ఫేస్ బుక్ కి అతిగా అలవాటు పడితే ,అచ్చంగా ఇలాగే అవుతారట !( కడుపుబ్బ నవ్వే విడియో చూడండి )
ఊరకుండుట కంటె ఊగులాడుట మేలు ! అన్నారు పెద్దలు.కదలకుండా రోజంతా ఒకే చోట తిని కూర్చుంటె ఆరోగ్య రీత్యా నష్టమే కాబట్టి ఈ మాట అని ఉంటారు . కాని కొంత మందికి ఎక్కడ ఉగాలొ తెలియక ,ఫేస్ బుక్ లోకి వచ్చి ఊగడం మొదలు పెట్టారు . వారి ఉగడాలకు ఒక వేళా పాళా ఉండటం లేదు . పొద్దస్తమానం ఫేస్ బుక్ లోనే . మాటర్ ఏమి లేక పోయినా ,తమలోని వీరత్వమ్ ,ధీరత్వం , భీరత్వమ్, చపలత్వం తో పాటు పనికొచ్చేవి ,పనికి రానివి అన్నింటిని కలిపి తమ మిత్రుల మీదకు సందిస్తుటారు .
పైన చెప్పిన ఫేస్ బుక్ వీరులకు కు కొంత మంది స్టాక్ ప్రెండ్స్ ఉంటారు . తమ మిత్రులు పెట్టె వాటిని విమర్శిస్తే తమను ఎక్కడ "అన్ ప్రెండ్" చేస్తారో అనే భయంతో వీరు ఏమి పెట్టినా ,అహో ఓహో అని లైక్ లు మీద లైక్ లు కొట్టి ఉత్తేజ పరుస్తుంటారు .వీరిలో చాలామంది లైక్ లు కొట్టడం ,తిక్క కామెంట్లు పెట్టడం తప్పా మరేది తెలియని స్నేహితులే ఎక్కువ . దీనితొ తాము పెట్టె పోస్ట్ లు తమ మిత్రులను ఇంత గా అనంద పరుస్తున్నాయా ! అని తెగ సంబర పడి పోతూ ఇంకా విజ్రుభించేస్తుటారు ఫేస్ బుక్ వీరులు . ఇంట్లో ఖాళీగా కూర్చునే వారి దగ్గర్నుండి ,కాలేజీల్లో చదువుకునే యువత వరకు ఇదే తంతు . ఏదో పిల్లవాళ్ళు ముచ్చట పడుతున్నారు కదా అని పేరెంట్స్ సెల్ లు కొని చేతికిస్తే ,క్లాసుల్లో చెప్పే పాఠాలను కూడా తలకెక్కించుకోకుండా ,సెల్ లోని ఫేస్ బుక్ పోస్ట్ లకు అడిక్ట్ అయి, ఫేస్ బుక్ పిచ్చి వారు గా మారిన వారు వేల సంఖ్యలో లోనే ఉండవచ్చు . అతి కొద్ది కాలం లోనే ఈ సంఖ్య లక్షల్లోకి మారవచ్చు . అందుకే పెద్దలు 'అతి సర్వత్రా వర్జ్యయేత్' అన్నది .
అదిగో అలా ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ లు చూసి ,చూసి ఒకామె చివరకు ఈ క్రింది విడియోలో మాదిరి తయారై పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ,ఆమె తరపు వారు తమకు తెలిసిన పాస్టర్ గారి దగ్గరకు తీసుకు వచ్చారట .ఆయన గారు ఆమెకు పట్టిన "ఫేస్ బుక్ దెయ్యం " ని ఎలా వదిలిస్తున్నాడొ చూడండి ( నాకు తమిళం రాదు కాబట్టి ,వారి హావ బావాలను నేను అలా అర్ధం చేసుకున్నాను ). ఈ విడియో మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తుందని నమ్ముతున్నాను. ఊరకుండటమ్ కంటే కాసేపు కడుపుబ్బ నవ్వడం మంచిది కాబట్టి ఆ పని కానిచ్చేయ్యండి .
Comments
Post a Comment