ఇంటి స్వేచ్చను కాదని ఒంటి స్వెచ్చను కోరుకున్న స్త్రీ చివరకు ఎవరకు ఉపయోగ పడుతుందో చూడండి

                                                                     
       

దేనికైనా పరిణామ క్రమం ఒకటి ఉంటుంది . ప్రపంచం లో నే కాదు, విశ్వాంతరాలలో కూడా మార్పు అనేది సహజ మైన ప్రక్రియ. దీనికి ఏ విషయం అతీతం కాదు. మనిషి జీవన శైలి కూడా అంతే. అయితే ఈ  మార్పు అనేది పరిణామ క్రమంలో బాగంగా యత్న దోష పద్దతిలో అభివృద్ధి చెందాలి తప్పా , ఎవరినో చూసి తెల్లారి పాటికి మారి పోవాల్సిందే అంటె "పులి ని చూసి వాతలు " పెట్టుకున్నట్లే .

     మన సమాజంలో స్త్రీకి స్వేచ్చ లేదు అని, దానికి కారణం మనువు చెప్పిన విదానమే అని , ఆదునిక జీవులు ఆడిపోసుకుంటున్నారు. మనువు చెప్పిన విదానం మను కాలం నాటి పరిస్తితులకు అనుకూలం గా ఉండవచ్చేమో కాని ఇప్పటి పరిస్తితులకు పనికి రానివే. వాటిని మార్చుకోవలసిన అవసరాన్ని ఎవరూ కాదనజాలరు. ఉదాహరణకు "డబ్బులు కోసం దేవుని పూజలు చేసే వారు రౌరవాది నరకాలు పొందుతారు అని మనువు చెప్పాడు. మరి ఆ సూత్రాన్ని కరెక్టుగా పాటిస్తే, ఎండో మెంట్ డిపార్ట్ మెంట్ అద్వర్యంలో పని చేసే గుళ్ళలో పనిచెయ్యడానికి  కి అర్చకులు  దొరకరు . మరి అర్చకులు తమ విదానం మార్చుకోలేదా ? పైసలు అంటె జీత భత్యాలు కే   పూజలు  చేస్తున్నారు కదా! కాని , మను ధర్మ శాస్త్రాన్ని ఎలాగు కాదన్నాం కదా అని , విదేశి మత విదానం లో పూజలు చేస్తాం  అంటె ఎలా? అప్పుడు నీవు విదేశి మతస్తుడవే అవుతావు. స్వదేశి వాడవు కావు. ఏసు క్రీస్తు కైనా సరే బొట్టు పెట్టి పూజలు చేస్తే హిందూ జీవన విదానం లో బాగం అవుతారు తప్పా , విదేశి బావజాల వ్యామోహితులు కారు . ఇదే సూత్రం స్త్రీ స్వెచ్చకు వర్తిస్తుంది .

   మనుధర్మ శాస్త్రం లోని చాలా  బాగ0 స్త్రీలకు ప్రస్తుత పరిస్తితులకు అనుకూలించనివి . కాని అయన చెప్పిన  మౌలిక విదానమైన   కుటుంబ వ్యవస్థ స్త్రీకి సర్వకాల సర్వావస్తల యందు మేలైనది . సురక్షితమైనది. కుటుంభంలో స్త్రీ పురుషుల సమానత ను పాటిస్తే స్త్రీకి  వైవాహిక కుటుంభ వ్యవత్స లో దొరికినంత భద్రత తో కూడిన  స్వేచ్చ జీవనం మరెక్కడా సాద్యం కాదు . కాని అసలు స్త్రీలకు గృహమే ఒక పెద్ద చెరసాల . దానిని బద్దలు కొట్టుకుని రండి అని స్త్రీలను ప్రోస్తాహించే వారి వెనుకాల ఉన్నఅబ్యుదయ  శక్తుల అసలు రూపం వేరు. వాటికి బయటపడిన స్త్రీలు కావాలి. వారి ద్వారా తమ వ్యాపార సంస్కృతిని అభివృద్ధి చేసుకోవాలి . ఆ కారణంతో వారు ఆదునిక స్త్రీ వాదం ని ప్రోత్సాహిస్తున్నారు తప్పా , భారతీయ స్త్రీల పట్ల జాలి తో కాదు.

 ఒక విదంగా చెప్పాలంటే మనువు కాలంకంటె ఇప్పటి స్త్రీలే అన్ని రంగాల్లో అభద్ర్తతా బావం  ని ఎక్కువుగా పీలవుతున్నారు . స్త్రీకి ఇంట్లో స్వేచ్చా లేదు అని బయటకు తీసుకు వెళ్లి వారిని తమ వ్యాపార పబ్లిసిటికి , తమ బోగ లాలసత్వానికి విరివిగా ఉపయోగించుకుంటున్నారు . ఒకప్పుడు పది మంది ఆడపిల్లలు ఉన్నా బాదపడని కుటుంబాలు, ఇప్పుడు ఒక అమ్మాయి ని అయినా కోరుకోవటం లేదు . గర్బం లో పిల్లని గర్భంలోనే హత మారుస్తున్నారు అంటె ఎంత అభద్రతా బావం ఆ తల్లుల్లో ఉందో చుడండి . స్త్రీని   వ్యాపార రీత్యా అన్నింటికి అంటె చివరకు పబ్లిసిటికి కూడా ఆమె ఒంటిని కూడా  వినియోగించుకునే దౌర్బాగ్య స్తితిలో ఉన్న నేటి సమాజానికి మనువు ను తిట్టే నైతిక అర్హత లేదు.  స్త్రీకి స్వేచ్చ కావాలి అది పురుషులతో పాటు సమానంగా ఉండాలి. కాని అది కుటుo భ వ్యవత్స కు భంగం కలుగని రీతిలో స్త్రీ పురుషులను కట్టడి చేసేలా ఉండాలి.
                                                                 

 

                                      స్త్రీ+ పురుషుడు = సంపూర్ణ మనిషి అనే అర్దనారీశ్వర  తత్వ్వాన్ని అందించిన భారతీయ సమాజం కంటె మెరుగైన సమాజం మరొకటి ఉంటుంది అనినేను అనుకోవటం లేదు. పెండ్లీలు చేసుకోకుండా .సేవా ,సేవా అనుకుంటు   సేవల ముసుగులో పనికి రాని పనులు చేస్తున్న వారు ఎక్కువ కావడం,  50 యేండ్లు సంసారం చేసిన వారు కూడా , ఏ సారం తెలియని బడ్డు బైరాగులను పూజించడం వలనే మన కుటుంబ వ్యవత్స దెబ్బ తిని పోయింది  . ఇప్పటికైనా స్త్రీ పురుషులు కుటుంబ వ్యత్స లోని గోప్ప్తన్నాన్ని గుర్తించి దాని పరిరక్షణకు  క్రుషి చేయాలి . అందులో బాగంగా స్త్రీలకు సముచిత సమాన అవకాశాలు ఇవ్వాలి. పురుషులను స్త్రీ వ్యతిరేకులుగా చూడటాన్ని మాని వేయాలి . ఆడజన్మను అయినా, మగజన్మను అయినా నిర్ణయించేది పురుషుడు అయితే అందుకు తోడపడెది స్త్రీ . ఆడపిల్ల అయినా , మగపిల్లవాడు అయినా కుటుంబ వారసులే అని అర్దం చేసుకుని వారికి సమాన అవకాశాలు కలిగిస్తే ,అన్ని అనర్దాలు తొలగి  పోతాయి. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!