సంక్రాంతి కి సెలవు ఇవ్వనందుకు, యజమానికి ఇల్లాలు లేకుండా చేసిన పనివాడు !
యజమానులు ఇండ్లలో కాని ,షాపుల్లో కాని పని వారిని పెట్టుకునే ముందు వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటొ , వారి పూర్వపు నడత ఏమిటొ సమగ్ర విచారణ చేసుకుని పెట్టుకోవడం మంచిది . షార్ట్ టెంపర్ గాళ్ళని పనిలో పెట్టుకోవడం వలన యజమానులకే కాదు వారి కుటుంభ సబ్యులకు ముప్పు ఏర్పడవచ్చని చెన్నై లో జరిగిన ఉదంతం తెలియ చెపుతుంది . చెన్నై లోని అంబత్తూర్ ఏరియాలో మికైల్ రాజ్ ఒక టీ షాపు కి ఓనర్ . అతనికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు . అతని టీ షాపులో 'వికీ' అనే అతను పని చేస్తున్నాడు . పొంగల్ (సంక్రాంతి) పండుగ కు తనకు సెలవు తో పాటు బోనస్ ఇవ్వాలని వికీ యజమానిని అడిగాడు .దానికి మికైల్ ఇప్పుడు కుదరదు అన్నాడు . దానితో వికీ యజమాని లేని సమయం చూసి అతని ఇంటికి వెళ్లి ,అతని భార్యను తనకు సెలవు ఇప్పించ వలసిందిగా భర్తకు రికమెండ్ చేయమనగా అందుకు ఆవిడ నిరాకరించింది అట .దానితొ కోపం వచ్చిన వికీ ఆమెను కత్తితో పొడిచి చంపడమే కాక ,బీరువాలో ఉన్న డబ్బూ నగలు తీసుకుని ,కూల్ గా తిరిగి టీ షాపుకు వెళ్లి పని చేసుకోసాగాడు . డబ్బూ నగలు తీసుకునే టప్పుడ