సంక్రాంతి కి సెలవు ఇవ్వనందుకు, యజమానికి ఇల్లాలు లేకుండా చేసిన పనివాడు !

                                                                                 

యజమానులు ఇండ్లలో కాని ,షాపుల్లో కాని పని వారిని పెట్టుకునే ముందు వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటొ , వారి పూర్వపు నడత ఏమిటొ సమగ్ర విచారణ చేసుకుని పెట్టుకోవడం మంచిది . షార్ట్ టెంపర్ గాళ్ళని పనిలో పెట్టుకోవడం వలన   యజమానులకే కాదు వారి కుటుంభ సబ్యులకు ముప్పు ఏర్పడవచ్చని చెన్నై లో జరిగిన ఉదంతం తెలియ చెపుతుంది .

చెన్నై లోని అంబత్తూర్ ఏరియాలో మికైల్ రాజ్  ఒక టీ షాపు కి ఓనర్ . అతనికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు . అతని టీ షాపులో 'వికీ' అనే అతను పని చేస్తున్నాడు . పొంగల్ (సంక్రాంతి) పండుగ కు తనకు సెలవు తో పాటు బోనస్ ఇవ్వాలని వికీ  యజమానిని అడిగాడు .దానికి మికైల్ ఇప్పుడు కుదరదు అన్నాడు . దానితో వికీ  యజమాని లేని సమయం చూసి అతని ఇంటికి వెళ్లి  ,అతని భార్యను తనకు సెలవు ఇప్పించ వలసిందిగా భర్తకు రికమెండ్ చేయమనగా అందుకు ఆవిడ నిరాకరించింది అట .దానితొ కోపం వచ్చిన వికీ ఆమెను కత్తితో పొడిచి చంపడమే కాక ,బీరువాలో ఉన్న డబ్బూ నగలు తీసుకుని ,కూల్ గా తిరిగి టీ షాపుకు వెళ్లి పని చేసుకోసాగాడు  . డబ్బూ నగలు తీసుకునే టప్పుడు ,మికైల్ రాజ్ పిల్లలు ఇంటికి రావడం జరిగింది .దానితొ వికీ  వారిని కూడా కత్తి తో గాయ పరచాడు .వారు దానితో ప్రాణాపాయ స్తితిలోకి వెళ్ళారు .

 ఆ తర్వాత రాత్రి ఇంటికి వచ్చిన మికైల్ కు చచ్చి పడి ఉన్నభార్యా ,చావు బ్రతుకుల్లో కొట్లాడుతున్న తన ఇద్దరి పిల్లలను చూసి గుండె చెరువు అయింది . పిల్లలు ఇద్దరినీ హాస్పిటల్లో చేర్పించాడు . తనకు ఇంత ఘోరం తల పెట్టింది దొంగలు అయి ఉండవచ్చు  అని అనుకున్నాడు.పోలిస్ రిపోర్ట్ ఇచ్చాడు . వారి విచారణలో నమ్మలేని నిజం బయట పడింది .వికీ యే ఇంత పని చేసాడు అనితెలిసి స్తాణువు అయ్యాడు . వికీ ని పట్టి ఇచ్చింది పక్కింటి స్విట్ షాప్ యజమాని ,తన ప్లాట్ కి అమర్చుకున్న c.c T.V పుటేజ్ . దానిలో వీకీ వచ్చి వెళ్ళినట్లు ఆదారం లబించడం తో పోలిసులు అతనిని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేసే సరికి అసలు నిజం బయట పడింది .

     తన యజమాని సెలవు బోనస్ ఇవ్వనందుకు ,అది ఇప్పించమని అతని భార్యను ప్రాదేయ పడ్డానని ,ఆ విషయం లో ఆమె జ్యోక్యం చేసుకోను అని ఖరా కండిగా చెప్పి నందుకే ,పట్టరాని కోపం వచ్చి ఆమెను హత్య చేసి ,డబ్బు నగలు దొంగ తనం చేసాను అని ,సాక్ష్యం లేకుండా చేయాలనే ఉద్దేశ్యం తోనే ,అప్పుడె ఆటల నుండి తిరిగి వచ్చిన అతని పిల్లలను కూడా పొడవడం జరిగిందని,నేరం ఒప్పుకోనడంతో అతని మిద కేసు పెట్టి ,రిమాండ్ కి పంపించారు.

చూసారా ! అప్ట్రాల్ సెలవు ,బోనస్ ఇవ్వనందుకు ఒక యజమాని భార్యను  చంపాడు అంటే వాడెంత షార్ట్ టెంపర్ అయ్యుండాలి . అలాంటి వాడివలన మికైల్  రాజ్ తన భార్యను కోల్పోవలసి వచ్చింది . అందుకే పని వాళ్ళ పూర్వపు చరిత్ర ను స్టేడి చేసాకే వారికి పని ఇవ్వడం మంచిది .

SOURCE :-            http://timesofindia.indiatimes.com/city/chennai/Denied-Pongal-bonus-and-leave-teashop-employee-kills-employers-wife-in-Chennai/articleshow/45869822.cms?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=TOI
 బ్లాగు వీక్షకులకు ,మిత్రులకు ,అగ్గ్రిగ్రేటర్ లకు సంక్రాంతి శుభాకాంక్షలతో .............. 

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.