Posts

Showing posts from August, 2014

హిందూ దేవుళ్ళు అంటే మంట !కాని దేవతలు అంటే యమ ఇష్టమంట ఈ "కామ కపాల వర్మ "కి !?

                                                                              అతనొక తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో డైరెక్టర్ ! మొదట్లో ఇంగ్లీష్ సినిమాలు ను  టైటిల్స్ వేసే విదానం దగ్గర్నుంచి సౌండ్ ఎప్పెక్త్స్  వరకు అన్నింటిని మక్కికి మక్కిగా   తన చిత్రాలలొ చొప్పించి తెలుగు ప్రెక్షకుల జేబులు లూటి చేసాడు. ఈయన నిర్మించిన చిత్రాలులో రౌడిలు,గుండాల పాత్రలె  కదా నాయకులు. రక్త చరిత్రలు ,హింసా ప్రవ్రుత్తులే ఈయన గారి ఇష్టమైన సబ్జెక్టులు . ఈయనకెందుకో దేవుళ్ళు కంటే దెయ్యాలు అంటేనే యమ ఇష్తం అనుకుంటా వాటి మీద కూడా సినిమాలు తీసి జనాల్ని బయపెట్టి మరీ డబ్బు దండుకున్నాడు. ఆయన ప్రతి సినిమా విదుల ముందు అవసరమున్నా లేకున్నా  ఏదో ఒక సంచలన ప్రకటణ చెయ్యడం జనం ద్రుష్టిని తన మీదకు తద్వారా తన చిత్రాల మీదకు మళ్ళించుకోవడం బాగా అలవాటై పోయింది . తను సమాజంలో అందరి లాంటి వాడిని కాదని పబ్లిసిటి మానియా ఉన్న కొంత మంది గ్రూపు కి చెందిన వాడినని రుజువు చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు రాముడు క్రిష్ణుడు పేరు కలిపి పిలువబదుతున్న ఈ డైరెక్టర్ !            సరే తమ సినిమాల పబ్లిసిటీల కోసం రక రకాల పీట్లు చేస్తుంటారు సినిమా వాళ్ళు

పంద్రాగస్టు పండగ సాక్షిగా "సుశీలమ్మ"కు స్వాంతంత్ర్యం వచ్చింది!

                                                                           ఆయన గారి పేరు సింగిరెడ్డి బాస్కర్ రెడ్డి . హోదా Y .S. R  పార్టి కరీం నగర్ జిల్లా అద్యక్షులు . అన్నీ పార్టిల అద్యక్షులు మాదిరి అయన కూడా నిన్న ఆగస్టు పదిహేనున పార్టి కార్యాలయంలో జెండా ఎగురవేసి , బారతీయులందరికీ స్వాతంత్ర్యం ప్రసాదించిన ఆ రోజు విశిష్టత గురించి వివరించి కార్యక్రమ్మాన్ని ముగించారు . అంతే! అప్పటిదాక ఎంతో సహనంతో ఉన్న సుశీల అనే మహిళా కార్యకర్తకు చటుక్కున తనకు స్వాతంత్ర్యం ఉందనే విషయం గుర్తుకు వచ్చి , కాలికి ఉన్న చెప్పును తీసి సదరు జిల్లా అద్యక్షుడు మీదకు సివంగిలా విరుచుకు పడింది.దీనితో బిత్తర పోవటం సింగి రెడ్డి మరియు అతని మిత్రుల వంతు అయింది ఆమెకు జిల్లా అధ్యక్షుడిని నానా బూతులు తిడుతూ చెప్పు తీసుకు కొట్టె స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో , జిల్లా అద్యక్షుడు అయి ఉండి ఒక కార్యకర్త చేతిలో తన్నులు తినే దౌర్బాగ్యం ఆయనకు ఎందుకు కలిగిందో ఆ దేవుడికే ఎరుక!మొత్తానికి ఇతర మహిళల సంగతేమో కాని "సుశీలమ్మ"కు మాత్రం పంద్రాగస్టు పండగ సాక్షిగా  స్వాంతంత్ర్యం వచ్చింది! మేరా భారత్ మహాన్!      పూర్తీ వివరాల కొరకు