హిందూ దేవుళ్ళు అంటే మంట !కాని దేవతలు అంటే యమ ఇష్టమంట ఈ "కామ కపాల వర్మ "కి !?
సరే తమ సినిమాల పబ్లిసిటీల కోసం రక రకాల పీట్లు చేస్తుంటారు సినిమా వాళ్ళు . అది వారికి అవసరం కావచ్చు. కాని తమ నీతిమాలిన సినిమా పబ్లిసిటిల కోసం హిందూ దేవుళ్ళని తూలనాడడం, హిందువుల విశ్వాసాలను, వారి మనోబావాలను కించపరచడమ్ ఎంత వరకు సబబు? ప్రపంచం లో ఏ మత విశ్వాసాలను కాని, ఆ యా మత గ్రందాలలోని గాదలను కాని సామాన్య శాస్త్రం ద్రుష్టితో చూస్తె మిగిలేది ఏమి ఉండదు. ఆ మాత్రం తెలియని వారు కాదు మత విశ్వాసులు. దైవం గూర్చి తెలుసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి . ఒకటి జ్ణాన మార్గం అయితే, రెండవది భక్తి మార్గం. జ్ణాన మార్గం లో భగవంతుని అన్వేషించే వారికి లేదా పయనించే వారికీ భక్తి మార్గం కాని, పురాణ కదలను కాని పట్టించుకోవలసిన అవసరం లేదు. అలాగే భక్తి మార్గం ద్వారా అద్స్యాత్మిక ఆనందం పొందే వారికీ జ్ణాన మార్గం అవసరం లేదు. "వేల కొలది జనులలో ఏ ఒక్కడొ జ్ణాన శక్తి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్దముగా తెలుసుకోగలుగుతున్నాడు" అని అంటారు గీతాచార్యుడు.ఒక వేళా ఈ రక్త చరిత్ర దర్శకుడు అటువంటి ఒకరిలో ఒకరైతే మాకేమి అబ్యంతరం లేదు కాని , తన జ్ణానం ని ప్రదర్సించే క్రమంలో హిందూ విశ్వాశాలను కించపరిస్తే మాత్రం అది అజ్ణానమే అవుతుంది.
పూర్వ కాలంలో జాతక రీత్యా దివ్య ఘడియలలో పుట్టిన వారిని డేవతలు అని, దుష్ట ఘడియలలో పుట్టిన వారిని రాక్షసులు అని అనే వారు ఈ రాక్షసులు కి దేవుళ్ళు అంటే కోపం ఉండెది కాని వారి స్త్రి దేవతల మీద దుష్ట వాంచ ఉండెది. ఆ కారణమ్ చేతనే మహ మహా విజ్ణానులైన రాక్షస వీరులు సర్వ నాశనం అయ్యారు . అటువంటి రాక్షసులలో ఒకరు తిరిగి భూమీ మీద జన్మించి సినిమా దర్శకుడైనట్లుంది. అందుకే ఆయనకు "రక్త చరిత్ర" , దేయ్యాల చరిత్రల మీద మోజు తో పాటు దేవతల మీద దుష్ట తలంపు కలుగుతున్నట్లుంది. అందుకే ఒక మీడియా సమావేశంలో తనకు హిందూ దేవుళ్ళు అంటె పడదని కాని దేవతలు అంటె ఇష్టమని ప్రేలాపనలు చేసినట్లు తెలుస్తుంది. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాదితే హిందువులు ఖచ్చితంగా అతనికి బుద్ది చెపుతారు. గొప్ప గొప్ప రాక్షసులే నాశనమయ్యారు, ఆప్ట్రాల్ రక్త చరిత్రలు మీద సినిమాలు తీసి బ్రతికే ఈ దర్శకుడెంత?
నిజంగా ఆతనికి హిందూ దేవుళ్ళు మీద అంత వ్యతిరేకత ఉంటె అతని పేరులో ఉన్న రాముడిని, గోపాలుడిని తీసి తన బుద్దికి తగ్గట్లు "కామ కపాల వర్మ" అని పెట్టుకుంటె కరెక్టుగా ఉంటుంది.
Comments
Post a Comment