పంద్రాగస్టు పండగ సాక్షిగా "సుశీలమ్మ"కు స్వాంతంత్ర్యం వచ్చింది!
ఆయన గారి పేరు సింగిరెడ్డి బాస్కర్ రెడ్డి . హోదా Y .S. R పార్టి కరీం నగర్ జిల్లా అద్యక్షులు . అన్నీ పార్టిల అద్యక్షులు మాదిరి అయన కూడా నిన్న ఆగస్టు పదిహేనున పార్టి కార్యాలయంలో జెండా ఎగురవేసి , బారతీయులందరికీ స్వాతంత్ర్యం ప్రసాదించిన ఆ రోజు విశిష్టత గురించి వివరించి కార్యక్రమ్మాన్ని ముగించారు . అంతే! అప్పటిదాక ఎంతో సహనంతో ఉన్న సుశీల అనే మహిళా కార్యకర్తకు చటుక్కున తనకు స్వాతంత్ర్యం ఉందనే విషయం గుర్తుకు వచ్చి , కాలికి ఉన్న చెప్పును తీసి సదరు జిల్లా అద్యక్షుడు మీదకు సివంగిలా విరుచుకు పడింది.దీనితో బిత్తర పోవటం సింగి రెడ్డి మరియు అతని మిత్రుల వంతు అయింది ఆమెకు జిల్లా అధ్యక్షుడిని నానా బూతులు తిడుతూ చెప్పు తీసుకు కొట్టె స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో , జిల్లా అద్యక్షుడు అయి ఉండి ఒక కార్యకర్త చేతిలో తన్నులు తినే దౌర్బాగ్యం ఆయనకు ఎందుకు కలిగిందో ఆ దేవుడికే ఎరుక!మొత్తానికి ఇతర మహిళల సంగతేమో కాని "సుశీలమ్మ"కు మాత్రం పంద్రాగస్టు పండగ సాక్షిగా స్వాంతంత్ర్యం వచ్చింది! మేరా భారత్ మహాన్!
పూర్తీ వివరాల కొరకు క్రింది వీడియో ను చూడండి
Comments
Post a Comment