వోటు అమ్ముకునే వారికి, ఒళ్లమ్ముకునే వారికి తేడా ఏముంది?
మనది గొప్ప ప్రజా స్వామ్యంగా తెగ మురిసిపోయే వారికి ఈ మద్య అక్కడాక్కడా జరుగుతున్న పంచాయతి "వేలం పాటలు" చూస్తే ఇది ఏ తరహా ప్రజాస్వామ్యమో అర్దం కాకుండా ఉంది.ప్రజలంతా ఒకే మాట మీద నిలబడి చట్ట వ్యతిరేక పనులు చేస్తే ప్రజా స్వామ్యం అవుతుందా? ఖచ్చితంగా కాదు. అటువంటి తప్పులను చట్టబద్దం చేస్తే తప్పా, తప్పులు చేసిన వారు శిక్షల నుండి తప్పించుకోలేరు. మన పంచాయతి ఎన్నికల చట్టం ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నికైన "పంచాయతీలకు" ఆర్దిక పరమైన అవార్డులు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికి, అట్టి ఎన్నిక స్వచ్చందంగా ఏ ప్రలోబాలకు లోనుకాకుండా జరగాలి. కాని నిర్లజ్జగా, బహిరంగంగానే పంచాయతి పదవులను వేలం పాట పెట్టి, అది హెచ్చు డబ్బు ఇచ్చి కొన్న వారికే ఆ సీటు దక్కేలా చెయ్యడం నిజంగా అతి హేయమైన చర్య.ఇలా బహిరంగంగంగా నే డబ్బున్నవాడికి పదవి కట్టబెడుతుంటే, అది పేపర్లలో కూడా ప్రచురిస్తుంటే ఒక్కడంటే , ఒక్కడైనా పార్టీ వారు ఖండిస్తున్నారా? అలా చేస్తున్న వారి మీద చర్యలకు ఎలక్షన్ కమీషనర