రధ సప్తమి నా పుట్టిన రోజు కావటం మా అదృష్టమా ?

మనవు బ్లాగు వీక్షకులకు రధసప్తమి పర్వదిన శుభాకాంక్షలు తో నాకు "రధ సప్తమి" రోజు అంటే ఒక ప్రత్యెకమైన రోజు .ఎందుకంటే అ రోజు సూర్య భగవానుడి పుట్టిన రోజు అని మాత్రమె కాదు . నేను పుట్టిన రోజు కూడా . మా నాన్న గారు వ్యాపారం నిమిత్తం కృష్ణా జిల్లా కవులూరు గ్రామం నుండి ఖమ్మం జిల్లా లోని మా స్వగ్రామం అయిన గార్లఒడ్డు కు వచ్చి కలప వ్యాపారం చేస్తున్న రొజులవి. నా కంటే ముందుగా జన్మించిన మా అన్నయగారు, అక్కలు ఇద్దరు కవులూరులోనే జన్మించారు . మా చిన్నక్క గారు పసి పాపగా ఉండగానే కుటుంబం అంతా గార్లఒడ్డు వచ్చేశారు . అప్పుడు మా కు...