"బాడీ కెమిస్ట్రీ " కి బలి అయిపోయిన 9 వతరగతి ప్రేయసి,10వతరగతి ప్రియుడు !!
తోటలు పెంచే రైతు చేసే తెలివిగల పని ఏమిటో తెలుసా? సరి అయిన సమయం లో కాకుండా ముందే తోట లో చెట్లు కాపుకు వస్తే వెంటనే వాటి పూత విరిచేసి కాపు కాయకుండా జాగర్త పడతాడు. ఆ చెట్లుకు నిర్ణీత సమయం తర్వాత వచ్చే కాపును మాత్రం బద్రంగా చూసుకుంటూ తన ఫల సాయాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అలా కాకుండా ప్రక్రుతి ధర్మమే కదా అని రెండేళ్ళ చెట్టుకే కాపు కాయనిస్తే వచ్చేవి కుక్కమూతి పిందెలే. ఇదే సూత్రం మానసికంగా పరిణతి చెందకుండా కేవలం వయస్సు తెచ్చే వ్యామోహం లో పడి జీవితాలు నాశనం చేసుకునే అమ్మాయిలు , అబ్బాయిలకు వర్తిస్తుంది. తెలివిగల తల్లి తల్లితండ్రులు తమ బిడ్డలు కు యవ్వనపు చాయలు పొడసూపుతున్నప్పు...