Posts

Showing posts with the label తీన్మార్ మల్లన్న ప్రోగ్రామ్ లు

టి.వి. రాములమ్మ, తీన్మార్ మల్లన్న ప్రోగ్రామ్ లు తప్పా , తెలంగాణా వారికి మిగిలేది ఏమి లేనట్లుంది!

                                                           ఈ  మద్య తెలంగాణా కాంగ్రెస్ వారు తెలంగాణా వచ్చేసిందని సోనీయమ్మను కీర్తిస్తూ ఉరూరా సంబురాలు చేసుకుంటునారు. వారి ప్రదాన ఉద్దేశ్యం తెలంగాణా వచ్చిందని చాటడం కాదు, తెలంగాణ ఇచ్చింది తమ నాయకురాలు సోనియా గాందీ యే తప్పా అందులో T.R.S  వారి ఘనత ఏమి లేదని చెప్పడమే. సరే బాగానే ఉంది. తెలంగాణా ఇచ్చింది ఎవరు , తెచ్చింది ఎవరు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు 2014 లో తేలుస్తారు కానీ, అసలు పదేళ్ళు పైనా పోరాడి సాదించమంటున్న "తెలంగాణా రాష్ట్రం " వలన తెలంగాణా ప్రజలకు ఎక్కువ లాభిస్తుందా? సీమాంద్రా ప్రజలకు ఎక్కువ లాభిస్తుందా ఒక సారీ చూదాం .      నిన్న మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాటన్నారు      " తెలంగాణ రాష్ట్రం " ఏర్పాటు వలన సీమాంద్రుల కంటే తెలంగాణ వారే ఎక్కువ నష్టపోతారు". అలాగే డిల్లీలో దిగ్విజయ్ సింగ్ గారు కూడా  ఒక విలువైన మాట చెప్పారు...