ఒక్క రాహుల్ ముందు అయిదు కోట్ల సీమాంద్రులు ఆప్ట్రాలా!
మనది ప్రజాస్వామ్య దేశమట! నమ్మమని నమ్మకంగా చెపుతుంటారు అధికారంలో ఉన్న వారు. ఇక్కడ మెజార్టీ ప్రజలు అవునన్నదే చట్ట రూపంలో చలామణీ అవుతుందని చాలా మంది విశ్వాసం. కాని అది తప్పు అని, డిల్లీ పాలకులకు ఆంద్రా ప్రజలు అంటే గడ్డిపరకతో సమానమని నిన్న జరిగిన సంఘటణ రుజువు చేస్తుంది. గత 64 రోజులుగా సీమాంద్రా లోని అయిదుకోట్ల మంది ప్రజలకు నిత్యావసర సేవలు నిలుపుదల చేసి ఆ ప్రాంత ఉద్యోగులు,విద్యార్దులు, రైతులు, ఇతర అనేకానేక సంఘాలవారు రాజకీయాల కతీతంగా ,రోజూ కొన్ని లక్షలమంది ప్రజలు, చారిత్రాత్మకం అనిపించే రీతిలో, అహింసాయుతంగా ఆందోళన చేస్తుంటే, కనీసం కేంద్ర ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించిన పాపానా పోలేదు. వారు కోరుతుంది రాష్ట్ర విబజన ఆపమని, దానికి కారణం తమకు విబజన వలన కలిగే నష్టాలే అని అంటున్నపుడు వాటి మీద సవివరంగా వివరణ ఇచ్చి కనీసం వారీ భయాందోళనలు తీర్చాల్సిన బాద్యత కేంద్ర ప్రబుత్వానిదే. ఎందుకంటే ఇక్కడి ముఖ్య మంత్రి గారు కూడా అదే సందేహాలు వెలిబ