Posts

Showing posts with the label don bosco

డాన్ బాస్కో !ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే ,ఇరగదీస్తాం చూస్కో !

Image
                                                                      ఇన్నాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఎర్రగడ్డ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అక్కడ ఉన్న "మెంటల్ హాస్పిటల్ " . ఆ హాస్పిటల్ లో చాలా మంది పిచ్చోళ్ళు ఉంటారు . అందులో పిల్లలకి పాఠాలు చెప్పడం చేత కాక , పిచ్చెత్తి పోయి హాస్పిటల్లో చేర్చబడిన వారు ఉన్నారో లేదో కాని , అదే  ఎర్రగడ్డలో ఉన్న "డాన్  బాస్కో" స్కూల్లో పని చేస్తున్న ఒక ఇంగ్లీష్ పంతులమ్మ మాత్రం ఆ  అర్హత  సాదించిందట . పైనున్న చిత్రం చూసే వారికి విషయం అర్ధం అయి ఉంటుంది .  ఇంగ్లీష్ క్లాసులో ఇంగ్లీష్ మాత్రమె మాట్లాడాలి అనేది పిల్లలకు ఇంగ్లీష్ బాషను బోదిమ్చడం లో బాగం కావచ్చు. తెలుగు మాతృబాష గా ఉన్న విద్యార్దులు తెల్లారే పాటికి పర బాషలో పండితులు కావాలంటే వారేమి మహా కవి కాళీ దాసు లా  వర ప్రసాదితులు కారు . ఒక ప్రణాళిక బద్దంగా , ఎంతో ఓర్పుతో పిల్లలకు బాషను నేర్ప గల శిక్షణ పొందిన ఉపాద...