డాన్ బాస్కో !ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే ,ఇరగదీస్తాం చూస్కో !

                                                                     


ఇన్నాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఎర్రగడ్డ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అక్కడ ఉన్న "మెంటల్ హాస్పిటల్ " . ఆ హాస్పిటల్ లో చాలా మంది పిచ్చోళ్ళు ఉంటారు . అందులో పిల్లలకి పాఠాలు చెప్పడం చేత కాక , పిచ్చెత్తి పోయి హాస్పిటల్లో చేర్చబడిన వారు ఉన్నారో లేదో కాని , అదే  ఎర్రగడ్డలో ఉన్న "డాన్  బాస్కో" స్కూల్లో పని చేస్తున్న ఒక ఇంగ్లీష్ పంతులమ్మ మాత్రం ఆ  అర్హత  సాదించిందట . పైనున్న చిత్రం చూసే వారికి విషయం అర్ధం అయి ఉంటుంది .  ఇంగ్లీష్ క్లాసులో ఇంగ్లీష్ మాత్రమె మాట్లాడాలి అనేది పిల్లలకు ఇంగ్లీష్ బాషను బోదిమ్చడం లో బాగం కావచ్చు. తెలుగు మాతృబాష గా ఉన్న విద్యార్దులు తెల్లారే పాటికి పర బాషలో పండితులు కావాలంటే వారేమి మహా కవి కాళీ దాసు లా  వర ప్రసాదితులు కారు . ఒక ప్రణాళిక బద్దంగా , ఎంతో ఓర్పుతో పిల్లలకు బాషను నేర్ప గల శిక్షణ పొందిన ఉపాద్యాయులు ఇందుకు అవసరమ్. ఇంగ్లీష్ ను కూడా మొదట తెలుగు బాష ద్వారానే నేర్పించడానికి ప్రయత్నించాలి . ఉదాహరణకు ఉల్లి పాయను ఇంగ్లండ్ లో ఉండే విద్యార్ది కి చూపించి "ఆనియన్ " అని చెపితే అర్దమయినట్లు , హైద్రబాద్ లో తెలుగు మాతృబాష గా ఉన్న విద్యార్దికి అర్ధం కాదు . ఆ  పిల్లవాడికి మొదట ఆనియన్ అంటే "ఉల్లి పాయ " అని చెపితే ఠక్కున గుర్తుంచుకుంటారు . అలా మాతృబాష  నుపయోగించి అంగ్ల బాషను నేర్పిస్తే పిల్లలకు చాలా సులువుగా ఉo తుందని నా అభిప్రాయమ్.

    ఎందుకో మన తెలుగు గడ్డ మిద తెలుగుకు తెగులు పట్టి పోతుందని అనిపిస్తుంది . తెలుగు మీడియం స్కూళ్ళకు గ్రామాల్లో సైతం ఆదరణ లేని పరిస్తితి తెలుగు బాష దుస్తితికి దర్పణం పడుతుంది . ఇంగ్లీష్ బాషలో ఉన్నగ్రందాలలోని   విజ్ఞాన0 గ్రహించాలoటే వాటిని తెలుగు బాషలోకి తర్జూమా చేసుకుంటే సరిపోతుంది . కాని దాని కోసం ప్రయత్నించక మనమే ఇంగ్లీష్ వారి లాగా మారిపోవడం, వారు మాట్లాడినట్లే మాట్లాడానికి ప్రయత్నించడం , చివరకు అది చేత కాక అటు పూర్తీ ఇంగ్లీష్ వారిలాక , ఇటు పూర్తిగా తెలుగు వారిలా కాకుండా , ఇతర బాషా గాయకులూ పాడే తెలుగు సినిమా పాటలా తయారయింది మన తెలుగు బిడ్డల పరిస్తితి. ఎ విషయం అయినా మాత్రుబాషలో అర్ధం చేసుకున్నట్లు కాని , వ్యక్త పరచినట్లు కాని అన్య బాషలో చేయడం అసాద్యమ్. ఇది మేధావులు చెపుతున్న సత్యమ్. చదువుకున్న ప్రతి వారు విదేశాలకు పోయి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు . అలా పోవాల్సిన అవసరం ఉన్న వారు బాష మిద పట్టుకు ప్రయత్నించడం పెద్ద కష్టమేమి కాదు. కాని చదువు కోవడం అంటే ఇంగ్లీష్ లొ మాత్రమె చదువు కోవాలని , విజ్ఞాన వంతుడు కావాలంటే ఇంగ్లీష్ వారిలా వేష బాషలు కలిగి ఉండాలని అనుకోవడం కి మించిన అజ్ఞానం మరొకటి లెదు.
      చివరగా ఒక మాట . కోతి గురించి తెలుసుకోవాలంటే దానికి సంబందిచిన సమాచారం గ్రహిస్తే చాలు. దాని కోసం మనమే కోతులుగా మారాల్సిన అవసరం లేదు!.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!