తెలంగాణా విద్యార్దుల పీజుల కోసం సిమాంద్రా మంత్రులు సుప్రీం కోర్టుకు వెళతాం అనడం దిక్కుమాలిన రాజకీయం కాదా !?

                                                                           

 తెలంగాణ ప్రబుత్వం "ఫాస్ట్ " అనే పీజ్  రెయంబర్స్ మెంట్ పధకం తెలంగాణ విద్యార్దుల కొరకు ప్రవేశ పెట్టడానికి ఒక కమిటిని నియమిస్తూ నిన్న జీ.ఓ  ఒకటి జారీ చేసింది . దాని ప్రకారం ఇక నుంచి తెలంగాణా లోని విద్యార్దులు పిజ్ రియంబర్స్ మెంట్ పొందాలంటే సంబందిత విద్యార్ధి తల్లి తండ్రులు లేక తాత ముత్తాతలు 1/11/1956 కంటే ముందు తెలంగాణ నివాసులై ఉందాలి . ఈ పధకం ప్రవేశ పెట్టడానికి ముందే తాము దాని చట్టబద్దతను అన్ని కోణాల్లోంచి విశ్లేషించి , గతంలో ఉన్నత న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పులను పరిసీలించాకే తమ ప్రబుత్వానికి "స్తానికత " ను నిర్దారించే అధికారం ఉంది అని రూడి పరచుకున్నాకే 1956 ని స్తానికత నిర్దారణకు ప్రామాణికంగా తీసుకోవడం జరిగిందని K .C. R  గారు గట్టిగా నొక్కి  చెప్పడమే కాక , సంబ0దిత తీర్పులను కూడా ఉటంకించడం జరిగింది . 

    అయితే సదరు జీ.వో  గురించి తెలంగాణా లోని రాజకీయ పార్తీల కంటే , సీమాంద్రా మంత్రులు అత్య్త్సాహం చూపుతూ , స్తానికత నిర్ణయించేది రాష్త్ర ప్రబుత్వాలు కాదని , అది కేంద్ర ప్రభుత్వ పరిది అని నానా యాగీ చేస్తూ , తెలంగాణా విద్యార్దుల కోసం సుప్రీం కోర్టు కు వెళతాం అని గోల చెయ్యడం ఎంత వరకు సబబు? అసలు తెలంగాణా రాష్ట్ర విద్యార్దుల బాగోగులు చూడాల్సింది ఇక్కడి ప్రభుత్వాలు . ప్రబుత్వం ఏమన్నా అన్యాయం చేసే జీ.వో లు తెస్తే , దానిని ప్రశ్నించాల్సింది తెలంగాణా లోని రాజకీయ పక్షాలు, విద్యార్ధి మరియు మేదావి సంఘాలు తప్పా , పొరుగు రాష్త్ర మంత్రులు కాదని తెలియక పోవడం విచారకరం . సీమాంద్రా మంత్రుల అత్యుత్సాహం వలన తెలంగాణ లోని విద్యార్దులకు నష్టమే తప్పా లాభం ఏమి లేదు . దీని కోక ఉదాహరణ చెపుతాను .

     ఒక  తండ్రి తన ఇంట్లో ఉన్న పిల్లలు తన సంతానం కాదనీ , నిర్దారణ కోసం D.N.A పరీక్షా కోసం తల పెడితే , ఇంట్లో ఉన్నమిగతా  పెద్దలు నోరు ఎత్తకుండా , పక్కింటోడు గగ్గోలు పెడుతూ "అది అన్యాయం . కోర్టుకు వెళ్లి న్యాయం కోరతా " అంటుంటే ఆ తండ్రికి ఎలా ఉంటుంది ? ఇంకా అనుమానం ఎక్కువై , అసహనం తో పిల్లలకు మరింత కీడు తలపెట్టే అవకాశ ముంది . కాని ఆ తండ్రి నిర్ణయాన్ని ఆ ఇంట్లో పెద్దలే ప్రశ్నించి అడ్డుకుంటే అప్పుడు సమస్యను సావదానంగా పరిష్కరించుకునే వీలు ఉంటుంది . 1956 అనేది సహేతుకత లేక చట్ట బద్దం అవుతుందా లేదా అనేది బాదితుల విద్యార్దులు  ఎవరైనా ఉంటే వారు కాని వారి తరపున కానీ వారి తల్లి తండ్రులు కోర్టులలో ప్రశ్నించ వచ్చు . కోర్టు తీర్పులకు ఎవరైనా బద్దులు కావాల్సిందే . అది ప్రబుత్వమైనా , ప్రజలైనా .

       ఈ విషయంలో ఇకనైనా సీమాంద్రా మంత్రులు కలుగ చేసుకోకుండా విజ్ఞత కలిగి వ్యవహరించడం మంచిది . అలాగే 1956 జీ.వో వలన తెలంగాణా లోని విద్యార్దులకు నష్టం కలుగుతుందని బావిస్తే , దాని మీద తెలంగాణా రాజకీయ పక్షాలు , మేదావులు స్పందిస్తే పొరుగు రాష్ట్రాలు వారి జోక్యం తగ్గుతుంది . లేదంటే తెలంగాణా ప్రజలు స్తానికులు , సెటిలర్స్ గా విడిపోయి రాష్ట్రాన్ని మరొక "శ్రీ లంక " గా మారే ప్రమాదముంది .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!