న్యాయ శాఖా మంత్రిని చాచి కొట్టిన సి.బి.ఐ.
బారతదేశ అత్యున్నత నేర దర్యాప్తు సంస్త మన సి.బి.ఐ. ఈ మద్య కాలంలో అది రాజకీయ సంకెళ్ళు తెంచుకుని "స్వతంత్ర దర్యాప్తు సంస్థ" అనే పేరును సార్థకం చేసుకోవాలని తహ తహ లాడుతున్నట్లుంది. అందుకే "బొగ్గు కుంభ కోణం కేసులో సుప్రీమ్ కోర్టు వారికి ఇచ్చిన అపిడవిట్ లో, తాము నివేదికను న్యాయ శాఖా మంత్రి చూశాకే ,కోర్టులో సమర్పించామని, ఇకనుండి అలా చెయ్యమని చెప్పింది. అంతకు ముందు ఇదే విషయం మీద ప్రభుత్వం తాము సి.బి.ఐ. వారి విచారణ నివేదికలో జ్యోక్యం చేసుకోలెదని చెప్పిందట!కాని సి.బి.ఐ. మాత్రం నిజం వెళ్ళగక్కి, రాజకీయ జ్యోక్యాన్ని అత్యున్నత న్యాయస్తానం ముందు తేట తెల్లం చేసింది. అ మాటతో న్యాయ శాఖా మంత్రిని చాచి కొట్టినట్టయింది.. మనది అటు ఇటు కాని వ్యవస్త కాబట్టి, సదరు న్యాయ శాఖా మంత్రి నిప్రభుత్వం వెనకేసుకు వస్తుంది కాని, అదే వేరే దేశం లో అయితే రాజీనామా చెయ్యక తప్పదనుకుంట అంత "అబద్దం" అవలీలగా చెప్పినందుకు. మనది "సత్యమేవ జయతే" అన్న అధికార చిహ్నం కలిగిన దేశం కాబట్టి ఇక్కడ అదికారం లో ఉన్న వారు