ఆమెకు వచ్చిన గర్భం మీదే కాదు, దాని మీద వచ్చిన D.N.A రిపోర్ట్ మీదా అనుమానమే నట !
భర్త అనుమానానికి బలి అయిన భార్య ఊదుడు గాడికి బాదుడు గాడే సరి! అని ఒక సామెత . వెనుకటి కాలంలో (ఇప్పుడు కూడా) , చేతబడి, బాణా మతి లాంటి క్షుద్ర ప్రయోగాలు చేసే వారికి , ముందు పళ్ళు ఊడగోడితే మంత్రాలు పారవనే మూడ నమ్మకంతో వారిని కొట్టి పళ్ళూడ గొట్టే వారు . అలా పుట్టిందే ఆ సామెత . అలాగే చీటికి , మాటికి ఇల్లాల్ని అనుమానిస్తూ , సంసారంలో చిచ్చులు పెట్టుకునే వారికి సహితం ఇదే పద్దతిని పాటించి వారిని నయానో , భయానో బుద్దిగా కాపురం చేసుకునేలా మార్చేవారు . కాని ఆదునిక కాలంలో అనుమానం జబ్బు ఉన్న మొగుడినైనా , క్షుద్ర విద్యలు పట్ల ఉన్న అపోహలనైనా తొలగించడానికి అయినా వైద్య శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు వాటిని వినియోగిమ్చుకోవడానికి తగిన చొరవ చూపక పోవడానికి మూల కారణం ఆ ప్రక్రియల మిద , వాటిని అమలు చేసే విదానాలు మిద తగినంత విశ్వసనీయత లేకపోవడమే అని క్రింది ఉదంతం తెలియ చేస్తుంది . నల్గొండ జిల్లాలోని భువన గిరిలో ఉంటున్న...