ఆమెకు వచ్చిన గర్భం మీదే కాదు, దాని మీద వచ్చిన D.N.A రిపోర్ట్ మీదా అనుమానమే నట !

భర్త అనుమానానికి బలి అయిన భార్య 




                                    ఊదుడు గాడికి బాదుడు గాడే సరి! అని ఒక సామెత . వెనుకటి కాలంలో (ఇప్పుడు కూడా) , చేతబడి, బాణా మతి లాంటి క్షుద్ర ప్రయోగాలు చేసే వారికి , ముందు పళ్ళు ఊడగోడితే మంత్రాలు పారవనే మూడ నమ్మకంతో వారిని కొట్టి పళ్ళూడ గొట్టే వారు . అలా పుట్టిందే ఆ  సామెత . అలాగే చీటికి , మాటికి ఇల్లాల్ని అనుమానిస్తూ , సంసారంలో చిచ్చులు పెట్టుకునే వారికి సహితం ఇదే పద్దతిని పాటించి వారిని నయానో , భయానో బుద్దిగా కాపురం చేసుకునేలా మార్చేవారు . కాని ఆదునిక కాలంలో అనుమానం జబ్బు ఉన్న మొగుడినైనా , క్షుద్ర విద్యలు పట్ల ఉన్న అపోహలనైనా తొలగించడానికి అయినా వైద్య శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు వాటిని వినియోగిమ్చుకోవడానికి తగిన చొరవ చూపక పోవడానికి మూల కారణం ఆ  ప్రక్రియల మిద , వాటిని అమలు చేసే విదానాలు మిద తగినంత విశ్వసనీయత లేకపోవడమే అని క్రింది ఉదంతం తెలియ చేస్తుంది .

   నల్గొండ జిల్లాలోని భువన గిరిలో ఉంటున్న వెంకటేశ్ ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు . ఆ  అమ్మాయి వర్షన్ ప్రకారం అయితే అతను 3 యేండ్ల క్రిందట ఆమెను బలవంతంగా లొంగదిసుకుని గర్బవతిని చేసాడట . ఆమెకు అమ్మాయి జన్మించింది . దానితో ఆమె అతడిని పెండ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తే అతడు నిరాకరించాడు . ఆమె కేసు పెట్టింది . దానితో అతను ఆ గర్భం తన వల్ల వచ్చింది కాదని , అది D.N.A టెస్ట్ ద్వారా రుజువవుతుందని , కాబట్టి D.N.A  టెస్ట్ జరిపించాలని కోర్టు ను కోరగా , కోర్టు వారు D.N.A టెస్ట్ కి ఆదేశించారు . D.N.A టెస్ట్ అమ్మాయికి అనుకూలంగా రావడంతో ఆమె తో పెండ్లికి అంగీకరించాడు . కాని D.N.A టెస్ట్ లు చేసే వారిని మేనేజ్ చేసి సదరు  రిపోర్ట్ లు ను అనుకూలంగా గా తెచ్చుకుంటారు అని ఎవరో చెప్పడం వలన , వెంకటేశ్ లోని అనుమానం తీరక , కోర్టువారి తీర్పును కాదనలేక , చివరకు పెండ్లి రోజున ఎవ్వరికి చెప్పకుండా పారిపోయాడు . దానితో పెండ్లి ఆగిపోయి , పిల్ల తరపు వారు హతాశు లయ్యారు . అది కద.
  బార్య బర్తలు లేక ప్రేమికుల మద్య ఉండాల్సింది ఒకరి పట్ల ఒకరికి నమక్కం . అమ్మాయి అబ్బాయి నిజాయితిగా ఉండడమే కాదు , అలా ఉన్నారు అని ఒకరి పట్ల నమ్మకం కలిగేలా ప్రవర్తిమ్చాల్సిన బాద్యత కూడా ఇద్దరి పై ఉంది . బలవంతంగా లొంగదిసుకునె వాడితో 3 ఏండ్లు ప్రేమాయణం నడపడం వలన ఆమె పట్ల అతనికి ఉన్న అభిప్రాయం ఎలా ఉంటుంది ? తనతో 3 ఏండ్లు కలిసి స్నేహం చేసిన అమ్మాయికి వచ్చిన గర్బం తన వల్ల అయి ఉండదు అని గట్టిగా నమ్మబట్టే అతను తానె స్వయంగా D.N.A టెస్ట్ కోరి ఉండాలి . తీరా అది తన నమ్మకానికి వ్యతిరేకంగా వచ్చె సరికి , అది ఇచ్చిన వారిని అనుమానించి ఉంటాడు . అంటే అతనికి నమ్మక్కం కలిగించినది  అతనిలోని అనుమానం అనే భూతం తప్పా వేరు కారణం కాదు . మరి ఆ  భూతాన్ని అతని లోనుo డి తరిమివేయకుండా ఎన్ని రిపోర్ట్ లు ఇస్తే ఏమి ప్రయోజనం ! మరి అ భూత్తాన్ని ఎలా తరిమి వేయాలి ? రెండే మార్గాలు ! ఒకటి ఆదునిక వైద్య శాస్త్రం ద్వారా అతన్ని బాగుచేయడం. దానికి అంగీకరించక పొతే  "దంచుడు శాస్త్రం" ద్వారా పట్టిన అనుమానపు భూతాన్ని  వదిలించడం !.పోలిస్ కేసులు , కోర్టు తీర్పులు ఇవ్వన్ని ఆదునిక "దంచుడు శాస్త్రాలు" లో బాగాలే .

      ఇన్ని చేసినా పూర్తిగా అ అబ్బాయి మారాలంటే దానికి తగిన విదంగా అమ్మాయి ప్రవర్తించి అతనిని మార్చుకుంటే తప్పా అది సాద్యం కాదు . వెనుకటి ఆడవాళ్ళకు బూదేవంత సహనం ఉంది కాబట్టి ఎలాగో అనుమానపు మొగుల్లతో కాపురాలు సాగించే వారు . ఈ నాటి వారికి అంత   అవసరం లేకపోయినా మొగుడికి ఉంది ఒక జబ్బు అని, అన్ని మానసిక రుగ్మత లాగానే అది ఒక సాదారణ రుగ్మత అని, దానిని నయం చేయడానికి మంచి మందులు ఉన్నాయని గుర్తించే జ్ఞానం  ఉంటె చాలు . వారి సంసారాలు  అనుమానపు పిశాచాల బాదల నుండి విముక్తం అవుతాయి .
            దీనిని కూడా చూడండి :-

భర్త ప్రవర్తన తప్పు అన్నందుకు , భార్యకు పెద్దమనిషికి అక్రమ సంబందం అంటగట్టిన "అనుమానపు పిశాచి "


                                      (11/3/2014 Post  Republished )

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!