అతను ఎన్నో ఎత్తులు ఎక్కడానికి , మరెన్నో విజయాలు సాధించడానికి సహకరిస్తున్న "ఆమె" సాటి మహిళకు మాత్రం శత్రువు ఎందుకు అవుతుంది ?
మనిషి జన్మకు కారకురాలైన , మనుగడకు ఆధారమైన ,మనిషిలో సగమైన, మానవ సమాజాభివ్రుద్దికి తమ జీవితాలు త్యాగం చేస్తున్న ఎందరో మరెందరో మహిళా మణులకు "అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభా కాంక్షలు. |
మొన్నీ మద్య ఒక పేరొందిన తెలుగు సినిమా నటుడు, ప్రస్తుతం అంద్రప్రదేశ్ లోని ఒక నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న వ్యక్తీ , "సావిత్రి " అనే సినిమా పంక్షన్ సందర్బంగా అన్న డైలాగ్ అనేక విమర్శలకు గురిఅవుతూ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. అయన గారు అన్న డైలాగు ఏమిటంటె "నేను ఎన్నో ఎత్తులు ఎక్కాను, మరెన్నో లోతులు చూసాను" అని తన రొమాంటిక్ హిరో లైఫ్ గురించి చెప్పి తన అభిమానులను ఉత్తేజపరచాడు. అయితే అది కాస్తా సీరియస్ గా మారుతుండడం చూసి "అబ్బే అదంతా తమాషాకి అన్న మాటలు , వాటిని పట్టించుకుంతారా ఎవరైనా " అని అంటున్నాడు. సరే ఏది ఏమైనా అయన అన్నది తన సినిమా ప్రమోషన్ సందర్బంగా , తన అభిమానులను ఉత్తేజపరఛడానికే అని ఉండవచ్చు. కాని ఇలాంటి డైలాగులు , హీరో గా ఉన్న అతను అనగలిగాడు కాని , అతనితో అన్ని రకాలుగా సమానం గా ఉన్న ఒక హీరోయిన్ అనగలదా ? లేదు. అనలేదు. ఎందుకంటే తప్పులో అయినా , ఒప్పులో అయినా మానవ సమాజం లో స్త్రీ , పురుషునితో పాటు సమానం కాదు కాబట్టి . అందుకనే అసమానులు అయిన అందరికీ ఒక అంతర్జాతీయ దినం ఉన్నటే స్త్రీలకు కూడా ఒక అంతర్జాతీయ దినం డిక్లేర్ చేసారు అనుకుంటా . అదే నేటి March 8 .
అర్ధ నారీశ్వర తత్వం. స్త్రీ + పురుషుడు = సంపూర్ణ మానవుడు అనే తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహత్తర సత్యం. కాబట్టి స్త్రీ పురుషులు వేరు వేరుగా జన్మించినా తిరిగి వివాహం లేక మనువు ద్వారా ఒకటి అవడం ద్వారానే సంపూర్ణ మనిషిగా ద్వితీయ జన్మ పొందుతున్నారు. అలా మనువు వలన సంపూర్ణ మానవులు అయ్యారు కాబట్టి మనుషులను మనువు సంతతి అన్నారు . సరే ఈ తత్వాలు గురించి కాదు ఇప్పుడు నేను ప్రస్తావించేది . అసలు మనిషిలో సగం అయిన పురుషుడిని వదిలివేసి స్త్రీకి మాత్రమే ఒక అంతర్జాతీయ దినోత్సవం ని ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది చూద్దాం.
ఒక మనిషిలో కుడి చేయి చేసే పని వేరు ఎడమ చేయి చేసే పని వేరు. చాలా మంది ముక్యమైన పనులు అన్నీ కుడి చేత్తోనే చేస్తారు. ఎబ్బెట్టు పనులనుకున్నవి ఎడమ చేత్తోనే చేస్తారు. అవి మనిషి తన సౌలబ్యం కోసమే ఎంచుకున్న విదానం అని కాక , మెదడులో కూడా అలాంటి నియంత్రణా ఎర్పాటు ఉంటుంది అంటారు. కుడి చేత్తో ముక్యమైన పనులు చేస్తున్నంత మాత్రానా , ఎడమ చేతి హక్కులుకి బంగం కలుగుతుంది అని అనగలమా ? లేదు? ఎందుకంటే కుడి అయినా ఎడమ అయినా రెందు చ్జేతులు అతనివే కాబట్టి అది అతనిష్టం అంటారు . అలాగే వివాహం అనంతరం స్త్రీ పురుషులూ కూడా ఏక శరీరులుగా , ఏకాత్మ లుగా మారాలి అనేదే "అర్దనారీశ్వర తత్వం" . ఈ తత్వం పూర్తిగా సక్సెస్ అయి ఉంటె ఒక్క రోజు మహిళా దినోత్సవాలు జరుపుకోవలసిన అగత్యం ఏర్పడేది కాదు.
స్త్రీలు అంతా ఒక వర్గం . పురుషులు అంతా మరో వర్గం అనే నినాదం కూడా అనేక లోపాలతో కూడుకున్నది. స్త్రీకి స్త్రీ శత్రువు అయినంతగా పురుషుడు కాదు అనేది చాలా మంది స్త్రీలు అంగీకరిస్తున్న సత్యం. ఒకస్త్రీ తన భర్త ,కుమారుడికి వ్యతిరేకంగా బాదిత స్త్రీలకు అండగా ఉంటుందా? తప్పు చేసినా తన వారినే సమర్దించటానికి చూస్తుంది. అదే కార్మికులకు , యజమానులకు ఏర్పడిన తగాదాలలో తప్పు తమదైనా కార్మికులు, కార్మికులు కు సంగీబావం తెలుపుతారు తప్పా , యజమానులకు కాదు. ఇది వర్గ దృక్పదం అంటె. మరి ఇది స్త్రీల విషయం లో వర్తిస్తుందా? వర్తించదు కాబట్టి స్త్రీలు అంతా ఒకే వర్గం అనేది కరెక్టు కాదు.
ఒకే వర్గం అయితే పెళ్ళాన్ని కిరోసిన్ పోసి తగులబెట్టిన మొగుడికి , తగుదునమ్మా అని రెండవ పెండ్లాం గా వెళ్ళడానికి స్త్రీ జాతి అంగీకరించదు. కడుపులో ఉన్న ఆడపిల్లని చే జేతులారా చంపుకోవడానికి ఏ అడ పిల్ల ఒప్పుకుని ఉందేది కాదు. కట్నం తేలేదని తనే కోడలకు అగ్గి అంటించేది కాదు. పెండ్లి కాగానే ఏదో వంకతో మొగుడిని తన అత్తకు దూరం చేసి ఆమెకు కడుపుచిచ్చుకు కారకురాలు అయ్యేది కాదు. సాటి స్త్రీకి ద్రోహం చేస్తున్నాను అని తెలిసి కూడా పరాయి మగాడికి ప్రియురాలిగా మారి సహజీవనం చేసేది కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ నాడు కుటుంబ స్త్రీలు ఎదురుకొంటున్న గృహ హింస లో 80% కారణం గా వారు మారి ఉండేవారు కారు. కాబట్టి స్త్రీ లు అంతా ఒక వర్గం అనే బావన నూటికి నూరుపాళ్ళు తప్పు. అలాగే స్త్రీలను ఉద్దరించే వారంతా స్త్రీలు కాదు . అలా అయితే పురుషుల పేర్లు కంటె స్త్రీల పేర్లే టక్కున గుర్తు వచ్చేవి.
ప్రతి పురుషుడు విజయం వెనుకాల తప్పకుండా స్త్రీ ఉంటుంది. కాని ఆమె ఒకరు మాత్రమే అయి ఉంటె అది సమాజానికి ఆరోగ్యకరం. లేకుంటే పైన చెప్పిన సినిమా నటుడి డైలాగు మాదిరి " నేను ఎన్నో ఎత్తులు ఎక్కాను. మరెన్నో లోతులు చూసాను" అని తనకు ఉపయోగపడిన వాళ్ళ గురించి పురుషుడు పది మందిలో తన గొప్పను చెప్పుకోవటానికి తప్పా మరెందుకూ పనికి రారు. మగాడు తమాషాకి అయినా ఇలాంటి డైలాగులు చెప్పదానికి సాహసించ లేని సమాజం కావాలి. అందుకు స్త్రీ పురుషులు ఒకటే అన్న సమ బావం తో కూడిన సమాజం ఏర్పడాలి. అప్పటి దాక అంతర్జాతీయ మహిళా దినోత్సావాలు ఎన్ని జరుపుకున్నాకంటి తుడుపు చర్యే .
మనిషి జన్మకు కారకురాలైన , మనుగడకు ఆధారమైన ,మనిషిలో సగమైన, మానవ సమాజాభివ్రుద్దికి తమ జీవితాలు త్యాగం చేస్తున్న ఎందరో , మరెందరో మహిళా మణులకు "అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభా కాంక్షలు.
(8/3/2016 Post Republished)
It is March 8; not February :)
ReplyDeletethank you for your suggestion. Mistake rectified.
Deleteనరసింహారావుగారూ, ఎత్తులు, లోతుల గురించి కాదు వివాదం జరుగుతోంది. "ఆడపిల్ల కనబడితే కమిట్ అన్నా అవ్వాలి, కడుపన్నా చేయాలి" అన్నందుకు. చెక్ చేసుకోండి.
ReplyDeleteఆప్కోర్స్,అయన గారు మీరు చెప్పిన మాట తో పాటు నేను బ్లాగు టైటిల్ లో పెట్టిన డైలాగ్ ని అన్నాడు.రెండు మాటలు స్త్రీలని ఉద్దేశించి అన్నవే అయినప్పటికీ మీడియా వారు కమిట్.కడుపు అనే మాటకు ఇచ్చిన పబ్లిసిటీ రెండవ దానికి ఇవ్వలేదు
Deleteఅందుకే నేను రెండవ దానిని ప్రస్తావించడం జరిగింది.
మీరు సాధారణంగా ఆడవారిపట్ల అగౌరవంగా ప్రవర్తించేవారిని చీల్చి చెండాడుతుంటారు కదా, ఈ సందర్భంలో ఎందుకనో అసలు విషయాన్ని లైట్ గా తీసుకున్నారు!
ReplyDeleteఈ విషయం లో ప్రస్తుతం అందరూ చీల్చి చెందాడుతున్నారు కాబట్టి నా మాట ఎవరు పట్టించుకుంటారులే0డీ.వేరే సందర్భం రాకపోదు. వచ్చినప్పుడు బాల కృష్ణ గారి డైలాగ్ మీద పోస్ట్ పెడతాను.
Deleteఈ విషయం లో ప్రస్తుతం అందరూ చీల్చి చెందాడుతున్నారు కాబట్టి నా మాట ఎవరు పట్టించుకుంటారులే0డీ.వేరే సందర్భం రాకపోదు. వచ్చినప్పుడు బాల కృష్ణ గారి డైలాగ్ మీద పోస్ట్ పెడతాను.
Delete