పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

                                                           


కన్న తల్లి తండ్రులు ఎవరైనా తమ పిల్లలను తామే చంపుకుంటారా  ? సృష్టిలో ఏవో కొన్ని జీవులు తప్పా , అన్ని జీవులు తమ సంతానాన్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాయి . ఇదేదో ఆదర్శం కోసం చేసే పని కాదు. సృష్టి ధర్మమే అది . మరి మనుషులై ఉండి తమ కన్న కూతురినే చున్ని ఉరి పెట్టి చంపారు అంటే , వారు ఖచ్చితంగా ఆమె తల్లి తండ్రులు కాక పోయి అయినా ఉండాలి లేదా ఉన్మాదులు అయినా అయి ఉండాలి . లోకమంతా వారిని ఆమె తల్లి తండ్రులు అంటున్నారు కాబట్టి మనమూ అనుకుందాం . మరి వారికి ఉన్మాదం ఏదో అవహించబడి బడి ఉండాలి . ఏమిటది ?. విషయం లోకి వెళితే :

                        పచ్చల దీప్తి గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన, హరి బాబు సామ్రాజ్యం ల పెద్ద  కుమార్తె దీప్తి . ఆమె హైదరాబాద్లో HCL టేక్నాలిజీస్ లో టెక్నికల్ ఇంజనీర్  గా జాబ్  చేస్తుంది . ఆమె కు వివాహం కాలేదు . ఆమెకు ఒక చెల్లెలు ఉంది . హరిబాబు ఒక చిన్న రైతు . వారిది చాలీ చాలని సంపాదన . దానితోనే పెద్ద కుమార్తెను చదివించి ఉద్యోగాస్తురాలిని చేసాడు . ఆమె వివాహం తమ కులంలోనే చేయాలి అనుకున్నాడు . వారి సామాజిక వర్గంలో ప్రస్తుతం అమ్మాయిలకు బోల్డంత డిమాండ్ ఉంది . కారణం వారి లో అమ్మాయిలూ బూతద్దం పెట్టి వెతికినా కనపడటం లేదట . మరి అలాంటి సామాజిక వర్గంలో చదువు ఉండి , ఉద్యోగం చేసే దీప్తి లాంటి అమ్మాయిని  కన్యాశుల్కం ఇచ్చి అయినా చేసుకోవడానికి పెద్ద పెద్ద కుటుంబాలు వారు రెడీగా ఉంటారు .

     మరి అటువంటి పరిస్తితుల్లో దీప్తి తన స్నేహితుడిని , వేరే సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ ను ప్రేమించింది . గత 3 సంవత్సరం లనుండి వారు ప్రేమిమ్చుకున్తున్నారట . దీనికి హరి బాబు దంపతులు ఒప్పుకోలేదు . కిరణ్ కుమార్ మాటల్లో చెప్పాలంటే దీప్తి వీకెండ్ సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడల్లా , ఆమెను అరగంటకు ఒక సారి తల్లి తండ్రులు కొట్టే వారట . చివరకు దీప్తి, వారు చెప్పిన మాట వింటాను అంటే శాంతించారట . ఈ  లోపు కిరణ్ ఉద్యోగం చూసుకోవడానికి అమెరికా వెళ్ళాడట. ఇక్కడ దిప్తికి తల్లి తండ్రులు ఒక సంబంధం ఖాయం చేసారట . దానితో దీప్తి అమెరికాలో ఉన్న కిరణ్ కి సమాచారం ఇస్తే 3 రోజుల క్రితం అతడు హైదరాబాద్ వచ్చి, దీప్తి ని హైదరాబాద్ రప్పించి అక్కడ ప్రేమికులకు పెండ్లిళ్ళు చేయించే ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారట . అ తర్వాత దీప్తి తల్లి తండ్రులకు విషయం చెపితే , కూతురు చేసిన నమ్మక ద్రోహానికి నిర్ఘాంత పోయిన తల్లి తండ్రులు , కోపంతో , ఆవేశంలో తాము తల్లి తండ్రులు అన్న విషయమే మరచి పోయి , అంతే  నమ్మకంగా నవ దంపతులకు గుళ్ళో మళ్ళి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకు వచ్చి , అల్లుడిని లాడ్జిలో ఉంచి , కూతురిని ఇంటికి తీసుకు వచ్చిన 20 నిమిషాల్లోనే ఉరి పెట్టి చంపారట . అది దారుణం .

          ఈ  కేసులో సామాజిక కారణాలు కంటే ఆర్దిక కారణాలే  ఎక్కువ ప్రభావితం చేసి ఉంటాయి . హరి బాబు కి ఇద్దరు కూతుళ్ళు . వ్యవసాయం మిద వచ్చేది అంతంత మాత్రం . పెద్ద కూతురి సంపాదన తన కుటుంబానికి ఉపయోగ పడుతుందని ఆశించి ఉంటాడు . దీప్తి మామ గారి మాటల ప్రకారం దీప్తి ,కిరణ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం , తన సంపాదనలో కొంత భాగం తన తల్లితండ్రులకు ఇవ్వాలని కండిషన్ అట . కాని అ బిడ్డకు తన తల్లి తండ్రుల పట్ల ఉన్న మమకారం తో కూడిన బాద్యతను ఆ  పిచ్చి తల్లి తండ్రులకు చెప్పింది ఎవరు? ఒక వేళా దీప్తి చెప్పినా హరి బాబు నమ్ముతాడా ? ఒక్క సారి వివాహం అయ్యాక ఆడదాని బ్రతుకు మొగుడు చెప్పు చేతల్లోనే అన్ని నమ్మిన అ తండ్రికి కాదు , అలా జరుగదు అని గ్యారంటి ఇచ్చె వారెవ్వరూ? అలా లేదు కాబట్టే , హరి బాబు దంపతులలో ఆర్దిక  అభద్రతా బావం చోటు చేసుకుంది . కుమార్తె చెప్పకుండా పెండ్లి చేసుకోవడంతో అ అభద్రతా బావం వారిలోభయం గా మారి చివరకు రాక్షస రూపం ధరించింది . అందుకే ఆమెను అంత  కర్కశంగా పొట్టన పెట్టుకున్నారు .

  నేను ఇంతకు ముందు "తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన"   అనే టపా పెట్టడం జరిగింది . అందులో స్పష్టంగా వివాహాలకు తల్లి తండ్రుల అనుమతి గాని , పామిలి కోర్టుల అనుమతి గాని తప్పని సరి చేస్తూ , చట్ట సవరణలు చేయాలి అన్నాను. నిజంగా అలాంటి చట్టమే ఉంటె పాపం ,దీప్తి ఈ  విదంగా కన్నవారి చేతిలో చని పోయి ఉండేది కాదు . అనుభవం, విజ్ఞత ఉన్న న్యాయ మూర్తులకు తన అభిప్రాయాన్ని తెలిపి ,తల్లి తండ్రులకు తన సంపాదనలో కొంత, చట్ట బద్దమైన రీతిలో వారికి చెందేలా చెయ్యడం వలన వారిలో ఉన్న అభద్రత బావాన్ని రూపుమాపి , తనకు నచ్చిన వారిని వివాహం చేసుకుని ఉండేది . అటు దీప్తి తల్లి తండ్రులకు సరి అయిన కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిలో ఉన్న ఇతర బావాలను కొంత వరకు సముదాయించే విలు కలిగేది . కాని ఇవేవి జరుగ టానికి అవకాసం లేదు అంటే మన ప్రభుత్వాలలో అటువంటి చట్టం ఉండాలన్నా ఆలోచన రాకపొవడమే కారణం .
     
           కిరణ్ స్నేహితులు చెపుతున్న దాని ప్రకారం దీప్తి తల్లి తండ్రులు మొదట్లో వ్యతిరేకించినా , చివరకు కాంప్రమైజ్ అవ్వడానికి సిద్దమయ్యారు అట . కాని హరిబాబు  తరపు వారెవరో చెప్పిన చెప్పుడు మాటలు వలననే వారు అలాంటి పని చేస్సారట . నిజమే కావచ్చు . దీప్తి సామాజిక వర్గంలో అమ్మాయిలకి కొరత కాబట్టి , ఎవరైనా దీప్తి పెండ్లిని భగ్నం చేసి లబ్ది పొందాలనుకోవచ్చు . కాబట్టి హరిబాబు దంపతులలో  విష బీజాలు నాటి , వారిలో మరింత అభద్రతా బావం పెంచి ఉండవచ్చు . ఏది ఏమైనా చివరకు నష్ట పోయింది ఎవరు ? కిరణ్ కు కొంత కాలం బాద ఉండవచ్చు . కాని అతని కి  మరో బార్య దొరుకుతుంది . ఆ  తర్వాత మామూలే . హరి బాబు దంపతులకు మరో పెద్ద కూతురు దొరుకుతుందా?తన కన్నవారి పట్ల అంత బాద్యత ఉన్న అ అమ్మాయిని చేజేతులారా చంపుకోవడం హరిబాబు దంపతుల మూర్కాతి మూర్కం . తనలోని అభిప్రాయాన్ని  సమాజానికి తెలిపి ,తల్లి తండ్రులని ఒప్పించి గౌరవంగా వివాహం చేసుకునే  అవకాశం  లేకుండా చేసిన ఈ  సమాజమే దీప్తిని హత్య చేసింది .
         
                   కులాలు ఆదారంగా ఎన్నికలలో సీట్లు కట్టబెడుతున్న సమాజంలో , తల్లి తండ్రులని "కుల పిచ్చోళ్ళు" కులరక్కసులు " అని ఈసడించు కున్నంత మాత్రానా సమస్యలు పరిష్కారం అవుతాయా ?వారి మిద కవితలు రాస్తే , రాసిన వారిలోని కసి తీరుద్దేమో కాని , సామాన్యుడు లో ఉన్న బావం లో ఎలాంటి  మార్పు రాదు . వారికి ఏంతొ  కౌన్సెలింగ్ అవసరం. అప్త్రాల్ 50 యేండ్ల నుండి ఉన్న బావాజాలాన్ని, పెయిల్ అయిందని తెలిసి కూడా మార్చుకోవదానికే ఇష్టపడని మేధావులు ఉన్న సమాజంలో , వేల ఏండ్లుగా నరనరానా  జిర్నిం చుకు పోయిన దానిని , సామాన్య హరి బాబు దంపతులు ఎలా తొలగిoచుకోగలుగు తారు ? సమస్యపరిష్కారానికి  సామ , బెద , దాన , దండోపాయాలు అవసరం . దానిని చేయగలిగింది చట్టపరమైన విదానాలు మాత్రమె . అటువంటి చట్టం మన సమాజం ఇవ్వలేదు . అందుకే దీప్తి హంతకులు ఆమె తల్లి తండ్రులు కాదు. కాదు. కాదు. ఎందుకంటే తల్లితండ్రులు అనేవాళ్ళు కన్నవారిని  ఎన్నటికి హత్య చేయలేరు కాబట్టి . అమ్మా దీప్తి! నీలో ఉన్నకుటుంబ సంక్షేమ తపనను తెలిపే అవకాశం  ఇవ్వలేని ఈ  సమాజంలో సబ్యులు అయినందుకు సిగ్గుపద్తూ , నీ  ఆత్మకు శాంతి చేకూరాలని అ భగవంతుని ప్రార్దిస్తున్నాను .

         
     తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన అనే టపా కోసం లింక్ ని క్లిక్ చెయ్యండి . http://ssmanavu.blogspot.in/2012/10/blog-post_14.html

                                   (25/3/2014 Post Republished).

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!