ట్రిపుల్ తలాక్ కి విరుగుడు "హిందూ మతం " లోకి మారడమే అంటున్న "జోద్పూర్ తస్లిమా " ఆలోచన కరెక్టేనా ?

                                                                           


                                        స్త్రీలు సంఖ్య తక్కువ గాను , పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమాజాలలో బహుభర్త్రుత్వం అంటే ఒక స్త్రీకి ఒకరికి మించిన భర్తలు ఉండటం అనివార్యం అవుతుంది . అలాంటి సమాజాలలో అన్నదమ్ములు అందరు ఒకే స్త్రీని వివాహం చేసుకుని ఆమెతో సంతానాభివృద్ధి ని పొందవచ్చు  అనే నియమాలు పెట్టినా ఎవరూ ఆక్షేపించరు . అలాగే స్త్రీల సంఖ్య ఎక్కువగాను , పురుషుల సంఖ్య తక్కువుగా ఉన్న సమాజాలలో బహుభార్యత్వం అంటే ఒక పురుషుడికి అనేకమంది భార్యలు ఉండడం తప్పని సరి అవుతుంది .కాబట్టి అట్టి సమాజాలలో ఒక పురుషుడు ఒకరిని మించి భార్యలు కలిగి ఉండవచ్చు అనే నియమాలు ధర్మ సూత్రాలు లేక మత  నియమాలుగా మారుతాయి. అలా ఏర్పడిందే ముస్లిం మతం లోని బహుభార్యత్వా నియమం కావచ్చు.

                                        ఎక్కడో ఎడారి ప్రాంతాలలో జీవించే ప్రజా సమూహాలు , వివిధ కారణాలు వలన స్త్రీ పురుషుల నిష్పత్తిలో బాగా తారతమ్యం ఉండడం , ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే సమతూకాన్ని పాటించడం వలన అనేకమంది స్త్రీలు వివాహరహితులుగా ఉండడం సమాజానికి మంచిది కాదు అనే ఉదేశ్యం తో ఒక ముస్లిం వ్యక్తి 4 స్త్రీలను వివాహం చేసుకోవచ్చు అనే నిబంధన పెట్టి ఉంటారు . ఈ సంప్రదాయాన్నితమ  అక్రమణ దేశాల్లో పాటిస్తూ ఉండడం వారికి లాభసాటిగా ఉండి  ఉండవచ్చు . తమ ప్రాంతాల నుడి తమ స్త్రీలను తెచ్చుకునే బదులు ఆక్రమణ దేశాల్లోని పురుషులను యుద్ధం పేరుతొ చంపి, వారి స్త్రీలను చెరబట్టి వారిద్వారా తమ సంతానం వృద్ధి చెందించడం , ఖర్చు తక్కువ పని గా ఉండడం , దానివలన అటు రాజ్యానికి రాజ్యం, ఇటు సౌఖ్యం తో పాటు సంతానానికి  సంతానం  తద్వారా తమ వారసులకె స్థానిక నాయకత్వాలు ఇవ్వన్నీ భార్యత్వం ద్వారా కలిగే బహుళ ప్రయోజనాలు . అందుకే  ఒకరికి నలుగురు అనే వివాహ పద్దతి అప్పటి వారికి సమ్మతి కావచ్చు.

                                                                 

 
                                  కానీ ఇప్పటి రోజులు వేరు. ఒక స్త్రీతో కూడిన సంసార భారం  మోయాలంటే  బహుకష్టంగా ఉంది. అందుకే మత నియమాలు ఏమి చెప్పినా , బుద్దిగా ఒక భార్య తో కాపురమే ఒంటికి ,ఇంటికి మంచిది అనుకుని ఈ  దేశం లోని మెజార్టీ ముస్లిం లు ఏకపత్నీ వ్రతులుగానే ఉంటున్నారు. కానీ డబ్బు ఎక్కువైనవారు , ఇంకా తమకేదో ఎక్కువగా ఉందని భావించే వారు తమ మత విశ్వాసాల వంకతో "ఒకరితో ఉండేవాడు గరీబు , నలుగురితో ఉండేవాడే నవాబు 'అని తమ లోని మగ ఠీవి ని తమ మతానికి అనుగుణంగా పాటిస్తున్నారు . దీనివలన భారత దేశం లోని అనేక మంది ముస్లిం మహిళలు నానా అగచాట్లు పడుతున్నారు అనడానికి నిదర్శనం  మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఒక్క ముస్లిం  వ్యక్తిని కూడా తమ అభ్యర్థిగా నిలబెట్టని B.J.P పార్టీకి ఏకంగా 325 సీట్లు రావడమే . ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాద్ తండ్రి గారు చెప్పినట్లు , ముస్లిం మహిళలు ఎన్నికలలో తమకు దొరికిన అవకాశాన్ని తమ భర్తలకు వ్యతిరేకంగా , తమ హిందూ సోదరుల కు ఓట్లుగా వేసినందు  వలననే B.J.P కి ఘన విజయం లభించి ఉండాలి .

 ఈ  దెబ్బతో ముస్లిం మత పెద్దలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో వందల  యేండ్ల క్రితం ఎడారిలో నివసించే సమూహాలు కోసం అప్పటి పరిస్థితుల ప్రకారం ఏర్పరచుకున్న నియమాలనే ఇంకా కొనసాగించాలని చూస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది . దీనికి తార్కాణామే ఇటీవల జోద్ పుర లో తస్లిమా అనే ముస్లిం మహిళ చేసిన వ్యాఖ్యలు . సురేష్ పూజారి అనే హిందూ యువకుడిని వివాహమాడిన తస్లిమా తన మతేతర వివాహానికి కారణం తమ మతం లో ఉన్న స్త్రీల పట్ల కొనసాగుతున్న వివక్ష మరియు ట్రిపుల్ తలాక్ వివాహ పద్దతి . ఈ  దురాచారాలు నుండి  ముస్లిం మహిళలకు విముక్తి కలగాలంటే హిందూ మతం లోకి మారడమే సరి అయిన మార్గం అని ఆమె నొక్కి చెప్పింది. వివరాలకు క్రింది వీడియోను చూడవచ్చు.

   ఒకప్పుడు సామ్రాజ్య విస్తరణలో భాగంగా హిందూ దేశం లో అనేక మంది హిందూ స్త్రీలు పరాయి స్త్రీలుగా మార్చబడ్డారు . దానికి ట్రిపుల్ తలాక్ వివాహ పద్దతి ఉపయోగపడింది. ఇప్పుడు అదే పద్దతి ముస్లిం స్త్రీల ఆలోచనలలో మార్పు తెచ్చి తమ మూల మత జీవన విధానం (హిందూ ) లోకి వెళ్లేట్టట్లు చేస్తుంది. స్కానింగ్ ల పుణ్యమా అని హిందూ లోని కొన్ని సామాజిక వర్గాలు వధువులు దొరకక వరుళ్లు అవివాహితులుగానే ఉండి పోయే పరిస్తుతులు దాపురించాయి . అటువంటి వారికి వరం గా మారవచ్చు ట్రిపుల్ తలాక్ బాధితులైన తస్లిమా లాంటి వారు తీసుకునే మాత మార్పిడి నిర్ణయాలు . అదే జరిగితే చరిత్ర పునరావృత మవుతుందని చెప్పవచ్చు . అలా జరుగకుండా ఉండాలంటే సాంప్రదాయ ముస్లిం మత పెద్దల ఆలోచనలో మార్పు రావాలి . అట్టి మార్పు తమ మతం లోని స్త్రీల వికాసానికి దోహదపడాలి . ఆ దిశగా పెద్దలు ఆలోచన చేస్తారని ఆశిద్దాం.

    ఏది ఏమైనా బలవంతపు మత మార్పిళ్లుకు హిందూ జీవన విధానం వ్యతిరేకం. కానీ స్వచ్చందంగా వచ్చే వారికి ఎల్లప్పుడూ ఆహ్వానం .భారతదేశం లో ఎవరు హిందూ జీవనవిధానం లోకి వచ్చినా అది వారు తమ మూల జీవన విధానం లోకి వస్తున్నట్టే లెక్క. బల వంతంగా దారి తప్పిన బిడ్డలు తిరిగి ఇంటికి వస్తాను అంటే కాదనే వారెవ్వరూ? అందుకే తస్లిమా లాంటి వారల ఆలోచన కరెక్టేనంటూ వారికి  కు హృదయపూర్వక స్వాగతం చెపుతుంది హిందూ సమాజం.
 జై హిందూ                                                                  జై జై హిందూ                           
     

                         

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!