పెండ్లిలో పరాచికాలాడినందుకు , కాబోయే "ఆవిడ "తో పాటు 5 లక్షలు పోగొట్టుకున్న పెండ్లికొడుకు !!

                                                                             

పరాచికాలు ఆడటానికి కూడా ఒక హద్దూ ,పద్దుతో పాటు సమయం సందర్భం ఉంటాయి .కట్టుకున్న మొగుడు అయినా సరే ,పది మందిలో ఓవర్ పరాచికాలు ఆడితే ,భారతీయ ఇల్లాలు సహించలేదు . నాలుగు తిట్లతో పాటు ,అవసరమయితే చెంప చెళ్ళు మనిపిస్తుంది . పదిమందిలో ఆడే పరాచికం సుతి మెత్తగా ,సున్నితంగా ఉంటేనే అందం !అనందం ఇస్తుంది  . సన్నిహిత స్త్రీలతో పరాచికం ఆడితే వారి బుగ్గలు ఎరుపెక్కాలి కాని , కళ్ళు ఎరుపెక్క కూడదు .ఈ చిన్న సూత్రం తెలియని ఒక పెండ్లి కొడుకు ,అతని స్నేహితులు చేసిన పనికి ,పెండ్లి కూతురి మెడలో తాళి కట్టకుండానే , 5 లక్షల నష్ట పరిహారం కూడా ఇచ్చి ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది .  వివరాలు లోకి వెళితే :-

                               పూనే కు చెందిన అబ్బాయి ,ఘజియా బాద్ కు చెందిన అమ్మాయి పుణే లోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తూ ,పరిచయం పెంచుకుని అది కాస్తా ప్రణయంగా మార్చుకున్నారు .తర్వాత పెద్దల అనుమతితో వారిద్దరికీ వివాహం నిశ్చయమైంది . ఘజియా బాద్ లోఅమ్మాయి ఇంటి దగ్గర పెండ్లి జరుగుతున్నా సందర్బంలో ,పెండ్లి కూతురు ,పెండ్లి కొడుకు మెడలో వరమాల వేసే కార్యక్రమం మొదలు అయింది .పెండ్లి కూతురు వరుడి మెడలో వరమాల వేయబోతున్న తరుణంలో ,పెండ్లి కొడుకు స్నేహితులు అతన్ని ఎత్తుకున్నారు .దానితో అమ్మాయికి వరమాల వేయడానికి కుదరటం లేదు . ఇదంతా హాస్యానికే జరుగుత్న్నాప్పటికి ,3 సార్లు అమ్మాయి,అబ్బాయి  మెడలో వరమాల వేయబోవడమ్ ,అదే సమయానికి అబ్బాయి స్నేహితులు , అబ్బాయిని పైకి లేపడం తో అమ్మాయి విపలం కావడం జరిగింది .దీనితో అమ్మాయికి చిరెత్తుకు వచ్చింది .స్నేహితులు చేస్తున్న ఓవర్ ఆక్షన్ ని ఆపలేని పెండ్లి  కొడుకు నైజం తో తనకు బవిష్యత్ లో అయినా సమస్యలే అనుకుందో ,లేక పది మందిలో అవమానం పీలైందొ తెలియదు కాని , తనకు ఆ వరుడు వద్దని తెగేసి చెప్పేసింది .దానితొ పెండ్లి పెటాకులు అయింది .

                                    ఆ తర్వాత అమ్మాయి తరపు బందువులకు అబ్బాయి తరపు బందువులకు జగడం కావడం ,విషయం పోలిస్ కేస్ వరకు వెళ్ళడం ,పోలిస్ వారి మద్య వర్తిత్వంతో ఇరు పార్తీల మద్య రాజి కుదిరి దాని ప్రకారం అబ్బాయి వాళ్ళే 5 లక్షలు పరాచికానికి పరిహారంగా , అమ్మాయి తరపు వాళ్లకు చెల్లించి  చెవులు ఝాడించుకుని ఇంటికి తిరిగి వెళ్ళడం చక చకా జరిగి పోయాయి . అదీ  సంగతి . "అతి సర్వత్రా వర్జ్యయేత్ "అని పెద్దలు ఎందుకన్నారొ ఆ పెండ్లి కొడుక్కి ఇప్పటికైనా అర్ధం అయిందో !లేదో ?

 SOURCE : http://www.patrika.com/news/duniya-ajab-gajab/no-bending-of-the-groom-bride-break-the-wedding-1009493/

                                                               (4/12/2015 Post Republished)

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రియురాలికోసం భర్త భార్యను చంపితే , భార్య శవం పక్కనుండగా భర్త తో 2 రాత్రులు కులికిన ప్రియురాలు !!

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

"లేచి పోయే రాజెశ్వరీలు ,కసెక్కి పోయే కామేశ్వర రావులు" ఉన్నంత కాలం జి.కొండూరు లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి!.

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.