అసెంబ్లీ రూల్స్ దెబ్బకు రేకలు రాలిన "రోజా "!!
పాపం రోజా ! ఆంద్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు జగన్ గారు అభిమానం గా "రోజమ్మా " అని పిలుచుకునే అయన గారి చెల్లెమ్మా ! ప్రస్తుతం ఆమె గారి పరిస్తితి చూస్తుంటె "రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే ? తోట మాలి నీ తోడు లేడులే " అన్న మాతృదేవో భవ లోని పాట గుర్తుకు వస్తుంది. ఎంత అవమానం! ఎంత అవమానం! ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో ఏ సభ్యునికి అదీ కూడా ఒక మహిళా సభ్యురాలికి ఎదురవ్వని అత్యంత హీనకరమైన పరిస్తితి? సుమారు 60 మంది ప్రతిపక్ష సబ్యులు ఉన్న ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఎవరికీ విదించని 1 సంవత్సర కాలం పాటు సస్పెన్షన్ అనే శ...