అసెంబ్లీ రూల్స్ దెబ్బకు రేకలు రాలిన "రోజా "!!

                                                                                  


                                            పాపం రోజా ! ఆంద్ర ప్రదేశ్  ప్రతిపక్ష నాయకులు జగన్ గారు అభిమానం గా "రోజమ్మా " అని పిలుచుకునే అయన గారి చెల్లెమ్మా ! ప్రస్తుతం ఆమె గారి పరిస్తితి చూస్తుంటె "రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే ? తోట మాలి నీ తోడు లేడులే " అన్న మాతృదేవో భవ లోని పాట గుర్తుకు వస్తుంది. 

  ఎంత అవమానం! ఎంత అవమానం! ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో ఏ సభ్యునికి అదీ కూడా ఒక మహిళా సభ్యురాలికి ఎదురవ్వని అత్యంత హీనకరమైన పరిస్తితి? సుమారు 60 మంది ప్రతిపక్ష సబ్యులు ఉన్న ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఎవరికీ విదించని  1 సంవత్సర కాలం పాటు సస్పెన్షన్ అనే శిక్షను ఒక మహిళా సబ్యురాలికి మాత్రమే విదించారు అంటె ఆమె "అసెంబ్లీ తాటకి " అయి ఉంటుందని బవిష్యత్ తరాలు అనుకునే దుస్తితి! ఇదంతా ఎందుకు జరిగింది?ఆమే తో పాటు  అభియో గాలు ఎదుర్కొన్న చెవి రెడ్డి బాస్కర్ రెడ్డి లాంటి అదికార పక్ష తీవ్ర వ్యతిరేకులు సైతం కేవలం క్షమాపణ చెప్పడం ద్వారా హుందాగా శిక్ష నుండి తప్పించుకుంటె , రోజా గారు మాత్రం ఎందుకు బయట పడలేక పోతుంది ? ఇది కేవలం అహంకార పూరిత స్వాఅబావం కలిగిఉండడం , లెక్కలేని తనం , పబ్లిసిటి మానియా! . ఇంతకు మించి మరేమి లేదు. 

    స్త్రీకి అయినా పురుషుడికి అయినా కొంత స్వీయ నియంత్రణ ఉండాలి. బజారులో మాట్లాడినట్లు చట్ట సభలలో మాట్లాడితే కుదురుతుందా? ఇండియాలో స్త్రీలకు కొన్ని రక్షణలు ఉన్నాయి. అందులో ప్రదానమైనది సామాజిక సానుభూతి . పురుషుల పట్ల ప్రవర్తించినంత దురుసుగా , అనుచితంగా స్త్రీల పట్ల ప్రవర్తించడం కుదరదు. పది మందిలో స్త్రీ పురుషుడిని కొట్టినా పట్టించుకోరేమో కాని, అదే ఒక పురుషుడు స్త్రీని కొడితే వెంటనే దారిన పోయే దానయ్య అయినా స్పందిస్తాడు. అందుకే మన సమాజం స్త్రీ పక్షపాతి . అయితే ఇదంతా సాంప్రదాయ స్త్రీల విషయం లోనే వర్తిస్తుంది . కాని స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఉన్నాయ్ కదా అని ఎలా బడితే అలా తెగబడిన మాటలు , ప్రవర్తనతో చరించే స్త్రీల పట్ల పురుషులే కాదు , స్త్రీలు కూడా సానుభూతి చూపించరు . ఇదే విషయం MLA రోజా  గారి విషయం లో అవగతం అవుతుంది. 

   ఒక రాష్ట్ర ముక్యమంత్రిని పట్టుకుని చట్టసభలో , కామ ముక్యమంత్రి , సెక్స్ వర్కర్ ముక్యమంత్రి అనడం , అలాగే తోటి మహిళా సబ్యురాలిని ఉద్దేసించి "నీలాగా ఎవరితో పడితే వారితో పడుకోలేదు " అనడం ఆమె లోని నీచ స్వబావానికి నిదర్శనం. మనిషిలో ఎంత అహంకారం లేక పోతే తోటి సభ్యులు క్షమాపణ చెప్పినప్పటికీ ఈమె చెప్పకుండా "జబర్దస్త్ " చేస్తుంది? తనేదో గొప్ప సంస్కార వంతురాలు అయి  పద్దతిగా వ్యవహరిస్తుంటె, స్పీకర్ గారే పని కట్టుకుని తనని సస్పెండ్ చేసినట్లు కోర్టులకు పోయి న్యాయం కోరుతుంది . ఇదెలా ఉందటే "మొగుడ్ని కొట్టి మొగసాల కేక్కిన " చందాన . కాని చివరకు హైకోర్టు డివిజన్ బెంచ్ వారు ఆమెను "ప్రివిలేజ్ కమిటీ నిర్ణయానికి బద్దులు కండి " అని గట్టిగా చెప్పినప్పట్కి  ఆమె ససేమిరా అంటుంది అంటె ఆమె లో "అహంకారం " ఏ స్తాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు .   ఆమెను 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేయాల్సిందే అని ప్రివిలేజ్ కమిటి విస్పష్టంగా చెప్పినప్పటికీ , అయినా ఇంకొక చాన్స్ ఇద్దాం అని స్పీకర్ అనుకుంటున్నారు అంటె , ఆమె   స్త్రీ అనే ఒకే ఒక కారణం కావచ్చు.  అదే సాంప్రదాయ వాదులలో  ఉండె సహనం అనే  సద్గుణం. 

     పురాణ   కాలం లో  సీత సావిత్రి లాంటి సాద్వీమా తల్లులే కాదు , తాటకి, శూర్పణక, పూతన  లాంటి రాక్షస స్వబావం కల వారు ఉండె వారు . స్త్రీలు అయినా రాక్షస స్వబావం ఉంటె వారిని రాజ్యం లేక సమాజం దండించి తీరవలసిందే అని మన పూర్వికులు పురాణ కదల రూపం లో చెప్పారు. ఆ రాక్షస సంతతే అక్కడక్కడా ఈ నాడు   మన సమాజం లో ప్రత్యక్ష మవుతుంది. వారి పట్ల ఉపేక్ష వహించడం సరి కాదు. తప్పు చేసామని తెలిసీ కూడా అది సరి చేసుకునే అవకాశం ఇచ్చినా దానిని ఉపయోగించుకోకుందా ,బుకాయింపులతో  హాల్ చల్  చేయాలనుకునే వారు  చట్ట సభలు లో ఉండటం వేస్ట్ . "జబర్దస్తి " లాంటి ప్రోగ్రామ్ లో నటిస్తూ ఉంటే డబ్బుకు డబ్బుకు పేరుకు పేరూ వస్తాయి. 

   ఏది ఏమైనా అసెంబ్లీలో తోటి మహిళా సభ్యురాలిని ఉద్దేసించి   రోజా గారు మాట్లాడిన మాటలు  యావత్ స్త్రీ లోకం కు తలవంపులు తెచ్చేదిలా ఉందని ఈ  క్రింది విడియో చూసిన వారెవరు అయినా అభిప్రాయపడక తప్పదు. 

                                                                




Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం