పాస్ కోసం బజార్లో దిగితే , పబ్లిక్ పట్టుకుని పక్కలిరగ తన్నారా, మంత్రి కుమారా !!?
రంకు నేర్చినోడు బొంకు నేర్వక పోతే పబ్లిక్ చేతిలో పరువు పోగొట్టుకోవలసిందే . ఇదే రుజువు అయింది ఆంద్ర ప్రదేస్ మంత్రి గారి తనయుడి విషయం లో . కామా తురాణాం న లజ్జా న భయం అంటారు పెద్దలు. అంటే కామం తో కళ్ళు మూసుకు పోయిన వాడికి సిగ్గు కాని భయం కాని ఉండవు అని. కాని ఒక మంత్రి కొడుకు గా ఒక హోదా కలిగిన కుటుంబం నాకి చెందిన వాడై ఉండి , పట్టపగలు పబ్లిక్ గా, కారులో ఒక అమ్మాయి వెంటపడి వేదించి పబ్లిక్ తో తన్నులు తినే దురవస్త తెచ్చుకున్నాడు అంటే , పెద్దలు చెప్పిన పై సామెత నిజమే అనిపిస్తుంది. అతడు కోరుకుంటే , డబ్బులు తో అతని కోరికలు తీర్చే వారు కో కొల్లలుగా దొరికే ఆ నగరం లో ఇలాంటి మతి మాలిన పనికి ఎలా సిద్ద పడ్డాడు అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. "నా కొడుకు ని కావాలని నా ప్రత్యర్డులు ఇరికించారు , కాని వాడు నిర్దోషి , అని , అతని తండ్రి అయిన మంత్రిగారి మాటల్లో అబ్బద్దం ఉండె అవకాశం ఎంత ఉందో , నిజం కూడా ఉందే అవకాశం అంతే ఉంది. కాకపోతే మంత్రి గారి కొడుకు పైలా పచ్చీసు వాలా అనేది మాత్రం నిర్వివాదాంశం . అసలు విషయం ఏమిటంటే :మంత్రి కుమారా !!
ఆంద్ర ప్రదేశ్ లో మంత్రిగా ఉన్నా రావేల కిషోర్ గారి అబ్బాయి మీద, ఒక ముస్లిం అమ్మాయి వెంటపడి వేదించాడు అనే ఆరోపణ మీద నిర్భయ కేసు బుక్ అయింది. ఆ కేసులో ముక్యమైన సాక్స్యాధారంగా ఉన్న CC టి.వి. పుటేజ్ లో ఒక తెల్లని కారు, ఒక బురఖా వేసుకుని వెళుతున్న అమ్మాయిని నెమ్మదిగా పాలో అవుతూ ఆమె పక్కకు వస్తుంటే, ఆమె తప్పుకుని వడి వడిగా వెలుతుండడమ్ కనిపిస్తుంది. అయితే ఇదే కాకుండా ఇంకొక సాక్ష్యం ఏమిటంటె ఆ కారులో ఉన్న మంత్రి గారి కుమారుణ్ణి, కారు డ్రైవర్ ని అక్కడి పబ్లిక్ పట్టుకుని చితగొడితే డ్రైవర్ , అలా తన్నిన వారి మీద పోలిస్ కేసు పెట్టారు. ఈ కేసులో బాదితురాలు అని చెప్పబడుతున్న అమ్మాయి చెపుతుంది ఏమిటంటే , తను వీదిలో వెళుతుండగా మంత్రి గారి అబ్బాయి ఉన్న కారు తనను వెంబదించింది అని , ఆకారు డ్రైవర్ తన చేయి పట్టుకుని కారులోకి రమ్మని లాగాడు అని , తను భయం తో పరుగెత్తుకు వెళ్లి అప్పుడే తన కోసం వస్తున్నా భర్త తో చెప్పాను అని , దానితో అప్పటికే కారు దిగి అక్కడ ఉన్న మంత్రి గారి అబ్బాయిని , డ్రైవర్ ని పబ్లిక్ పట్టుకుని బాగా తన్నారు అని, ఆ తర్వాత పోలిసులు వచ్చి వారివురిని తీసుకువేళ్ళారు అని .
అయితే పోలీసులకు మంత్రి గారి తనయుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటె , తను పాస్ కోసం కారు దిగితే , పబ్లిక్ తన మీద దాడి చేసి కొట్టారని చెప్పాడు అంట . ఇది పక్కా అబద్దం అని ఎవరైనా ఇట్టె చెప్పవచ్చు. ఒక మంత్రి గారి అబ్బాయి జనం తిరుగుతున్నా, వీదిలో కారును ఆపి పాస్ కోసం దిగాడు అంటే ఎవరు నమ్ముతారు? అకారణంగా తన మీద దాడి చేసిన పబ్లిక్ మీద అతని రియాక్షన్ ఎలా ఉండాలి? ఎప్పుడొ సంఘటణ జరిగితే తీరిగ్గా రాత్రి వేల కంప్లైంట్ చేస్తాడా? కాబట్టి ఇది అబ్బదం. మరి అన్నీ తన కుమారుడి ద్వారా తెలుసుకున్న మంత్రి గారు , తన కొడుకు నిర్దోషి అని , ఒక పక్కా ప్లాన్ ప్రకారమే , తన కొడుకుని ప్రతి పక్ష నాయకుడు ఇరికించాడు అని ఎలా అనగలుగుతున్నాడు. ఒక వేళ అది కుట్రే అయితే అసలు విషయం ప్రజలకు వివరించకుండా , నా కొడుకు నిర్దోషి , నా కొడుకు నిర్దోషి అంటె సరి పోతుందా? అంటె నిజం కక్కలేకుందా , అబద్దం ని జీర్నీచుకోలెకుందా ఉండే అడకత్తెర లో పోక చెక్క పరిస్తితి దాపురించినట్లుంది మినిస్టర్ గారికి . అలాంటి పరిస్తితి ఎప్పుడు ఉంటుందో చూద్ద్దాం .
బురఖా లో వీదిలో నడుచుకుంటూ వెడుతున్న అమ్మాయిని ,మినిస్టర్ గారి అబ్బాయి తనకు పరిచయం ఉన్న స్త్రీ అని అనుకుని , ఆమెను తన కారులోకి ఎక్కించుకోవడానికి ప్రయత్నించి ఉండాలి. కాని ఆమె ఒక్క సారిగా అరచి పరిగెత్తే సరికి , మంత్రి గారి అబ్బాయి స్టన్ అయి కారు దిగి , ఇదేమిటి ? అని ఆలోచిస్తున్న సమయం లో , అమ్మాయి భర్త, పబ్లిక్ ని పోగేసి మంత్రి గారి అబ్బాయిని డ్రైవర్ ని తుక్కు రేగొట్టి ఉండాలి. లేదా ..
ఎవరో ఒక ప్లాన్ ప్రకారం మంత్రిగారి అబ్బాయికి గర్ల్ ప్రెండ్ లాగా ఫోన్ చేసి అతనికి తన ఐడెంటిటి తెలువకుండా భురఖా వేసుకుని , ఆతను తనను పాలో అయ్యే లాగా చేసి, చివరకు గొడవ చేసి అప్పటికే ప్లాన్ ప్రకారం కాచుకుని ఉన్న వ్యక్తులు అంతా కలిసి అతని మీద దాడి చేసి , మంత్రి గారి కొడుకు మీద నిర్భయ కేసు బుక్ అయ్యేలా చేసి ఉండాలి.
పై రెండు ఉహజనిత విషయం లోఏది నిజమైనా కూడా మంత్రి గారి అబ్బాయి పరాయి స్త్రీ కోసం పాకులాడడం అనేది ఉంది కాబట్టి ,ఇది మంత్రి గారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే చర్యయే. అందుకే మంత్రి గారు నా కొడుకు నిర్దోషి అనేది ఇప్పుడు బాదితురాలు అని చెప్పబడుతున్న విషయం లో కావచ్చు. కాని కొడుకు ప్రవర్తన నైతికంగా కరెక్టు కాదు కాబట్టి , ఇంకా దాని గురించి చెప్పే బదులు , ఇదంతా ప్రతి పక్షం వారి కుట్ర అనే రొటీన్ డిపెంస్ తో ప్రస్తుతానికి విషయం సద్దుమణిగేలా చూస్తుండవచ్చు.
ఏది ఏమైనా కామా తురాణాం న లజ్జా న భయం అనేది నూటికి నూరు పాళ్ళు నిజం అనేది మంత్రి గారి అబ్బాయి ఆత్రపు అనైతిక ప్రవర్తన రుజువు చేస్తుంది.
Comments
Post a Comment