కళ్యాణ రాగం ఆలపిస్తూ, కన్నవాళ్ళ గుండెల్లో కల్లోలం సృష్టిస్తున్న గాయని "మధుప్రియ

    Republished post.                                                                  

                       
                         కొన్నేల్ల క్రితం మన రాష్ట్రం లో, తన ప్రేమ వివాహం తో  సంచలనం స్రుష్టించింది ఒక ప్రముఖ నటుని కూతురు. దానికి ఆ కుటుంబం  అంతా అల్లడి  తల్లడి అయింది. ఆ అమ్మాయి ప్రేమ వివాహం లో స్పెషల్ ఏమిటంటె , మైనర్ గా ఉన్నప్పుడే అంటె 14 యేండ్ల ప్రాయం లోనే ప్రేమలో పడి, చట్టం ఒప్పుకోదు కాబట్టి 18 యేండ్ల వరకు ఆగి , మైనార్టీ తీరిన వెంటనే , తను ప్రేమ వ్యవహారం నడుపుతున్న వ్యక్తిని పెండ్లాడెసింది. అప్పుడు కుటుంబ పెద్దలు, శ్రేయోభిలాషులు ఎవరూ చెప్పినా ససేమిరా అంది. ప్రెమ వివాహం చేసుకోవడం డాషింగ్ అండ్ డేరింగ్ అనుకుంది. పెండ్లి చేసుకుంది. అలా పిచ్చ పబ్లిసిటి వచ్చింది ఆ అమ్మాయి మారేజికి . ఆ తర్వాత కొన్నాల్లకే ఆ పెండ్లి పెటాకులు చేసుకుంది , అది వేరే విషయం. ఇప్పుడి ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఆ నాడు  సినిమా యాక్టర్ గారి కూతురు  ఎలా చేసిందో , సరిగ్గా అలాగే చేస్తుంది "గాయని మధు ప్రియ".

                               గాయని మధు ప్రియ గురించి తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. తెలంగాణా ఉద్యమ గాయనిగా చిన్నతనం నుండే పాటలు పాడుతూ , తన గానం అందుకు తగ్గ చలాకి తనం తో అందరిని ఆకట్టుకునే విదానం ఆ అమ్మాయి సొంతం . తనకు తల్లి కంటె కూడా తండ్రి అంటేనే ఎక్కువ ఇష్టం అని పబ్లిక్ గా చెప్పటమే కాక , తండ్రి పాత్ర మీద ఒక అద్భుతమైన పాట పాడింది. అది పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో జరిగిన సంఘటణ. ఆమె చెప్పిన మాటలు, పాడిన పాట గురించి క్రింది విడియోలో చూడండి.

                    

     
            కాని విచిత్రమైన విషయం ఏమిటంటె ,తనకు తల్లి తండ్రులు అంటె ఎంతో ఇష్టమని చెప్పిన అప్పటి 17 యేండ్ల అమ్మాయి , అప్పటికే తను ప్రేమలో పడి సంవత్సరంన్నర అయింది అని తల్లి తండ్రులకు మాత్రం చెప్పలేదు. శ్రీజ లాగానే తన పదిహేనో ఏట నుండే  శ్రీ కాంత్ అనే ఒక రియల్టర్ ని ప్రేమిస్తుంది అట. చట్టం ఒప్పుకోదు కాబట్టి తనకి 18 యేండ్లు ఎప్పుడు నిండుతాయా అని ఆత్రంగా ఎదురు చూసింది. ఎవరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా కాలం ముందుకు సాగుతూనే ఉంటుంది కాబట్టి , మొన్నీ మద్యనే 18 యేండ్లు నిండి ,బాల గాయని కాస్తా "బడా గాయని" అయింది . దానితో అమ్మాయి గారికి కొండంత అండ వచ్చినట్లు అయింది. ఎందుకంటె తన ప్రేమను కన్నవారు , తోడపుట్టిన వారు , బందువులు ఒప్పుకోక పోయినా చట్టం ఒప్పుకుంటుంది కాబట్టి. తన ప్రేమకు ఇండియన్ పోలిస్ అండ ఉంటుంది కాబట్టి.

                                అదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ కి చెందిన శ్రీకాంత్ అనే కుర్రాడితో ఈ రోజు తన వివాహం కాగజ నగర్  లో  జరుగుతుందని నిన్న  విలేకరుల సమావేశం లో చెప్పింది మధుప్రియ. రాత్రి ఆమె బందువులు వచ్చి గొడవ చేయగా ప్రేమికులను, ఇరు వైపులా కుటుంబాలను పిలిపింఛి కాగజ్ నగర్ పోలిసులు కౌంసిలింగ్ ఇస్తున్నారు. తమ కుమార్తె మానసికంగా పరిపక్వత చెందిన అమ్మాయి కాదని, వయసు 18 మొన్నీమద్యే ,దాటినా , ఆమె కేరీర్ దృష్ట్యా ఇంకా కొన్నాళ్ళు ఆగటం ఆమె భవిష్యత్  కి దృష్ట్యా మంచిదని  , అందుకే కొన్నాళ్ళు ఆగితే తామే ఆమె కోరుకున్న శ్రీ కాంత్  తోనే  పెండ్లి చేస్తామని తల్లి తండ్రులు చెపుతున్న "మధుప్రియ " ససే మీరా అంటున్నట్లు తెలుస్తుంది. ఈ  సందర్బంగా , పోలిస్ స్టేషన్ లో మధుప్రియ తల్లి గారు అన్న మాటలు , ప్రస్తుత సమాజం లోని సగటు తల్లితండ్రుల ఆలోచనలకు అద్దం పడుతుంది. ఆమె అన్నది ఏమిటంటే
"ఆడపిల్లలని ఎంత బాగా చూసుకున్న చివరకు గుండెల మీద తన్నే వెళతారు" . ఇది కొంత మంది సెలబ్రిటిలు, మోడ్రన్   ఆడపిల్లలు ప్రవర్తనల వలన ఎంతో మంది తల్లితండ్రుల మనసులలో కలిగే అభిప్రాయాలు, తద్వారా అనేకమంది ఆడపిల్లలు అన్యాయమయ్యే పరిస్తితి. నేను స్వయంగా విన్నాను కొంతమంది తల్లి తండ్రులు చెప్పిన మాటలు. "ఆడపిల్లలను ఎక్కువ చదివించినా చివరకు ఎవరినో ఒకరిని ప్రేమించి కుటుంబాలను కాలదన్ని వెళతారు కాబట్టి ఈడు రాగానే పెండ్లి చేస్తే మంచిది" . ఈ  తరహా ఆలోచనలు పెరిగిపోవటనికి మరింత దోహదం చేస్తున్నాయి నాటి శ్రీజ , నేటి మధుప్రియ ఉదంతాలు. దీని వలనఎంతో మంది సామాన్య  ఆడపిల్లల కెరీర్  నాశనమయ్యే పరిస్తితి.అందుకే ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 25 యేండ్లు  చేస్తే బాగుంటుంది అని నా లాంటి వారి అభిప్రాయం . ఇదే  విషయం మీద గతం లో నేను రాసిన టపాను క్రింది లింక్ లో చూడవచ్చు.

   కడపటి సమాచారం మేరకు మధు ప్రియకు ఇంకా కౌంసిలింగ్ ఇస్తున్నారు పోలిసులు. చూదాం ఆమె నిర్ణయం ఏమిటో కనీసం తల్లితండ్రుల కోరిక మేరకు కొన్నాళ్ళు ఆగుతుందా? లేక ఈ రోజే  కల్యాణ రాగం ఆలపించి కన్నవాళ్ళ గుండెల్లో కల్లోలం రేపుతుందా?

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

   
(ఇది నేను గాయని మధుప్రియ తల్లితండ్రులను కాదని నా పెండ్లి నా ఇష్టం అంటూ శ్రీకాంత్ ని పెండ్లి చేసుకుంటున్న వేళ రాసిన పోస్టు. ఇందులో ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 25 సంవత్సరం లు ఉండేలా చట్ట సవరణలు రావాలని,లేకుంటే ఎంతో మంది అడబిడ్డలు అన్యాయం అవుతారని చెప్పాను. అదే నిజమని నిరూపిస్తుంది నేడు మధు ప్రియ సంసారం లో జరుగుతున్న గొడవలు.పబ్లిసిటీ కి తప్ప మరెందుకు పనికి రాని మీడియా ప్రచారానికి భిన్నంగా నేను ఇదే విషయం మీద మరొక పోస్టు పెడతాను.అంతవరకు నేను రాసిన ఈ పోస్టు చూడండి.)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!