మెడ మీద కత్తి పెట్టినా అసదుద్దీన్ ఒవైసీ గారు "భారత్ మాతా కీ జై " అననిది ఎందుకంటె, ఇందుకే !?

                                                                    


                          మొన్న మహా రాష్ట్రలో ఒక పబ్లిక్ మీటింగ్ లో MIM పార్టి అధక్షులు తెగ ఆవేశం తో ఊగిపోతూ " నా మెడ మీద కత్తి పెట్టినా సరే భారత్ మాతా కి జై  అని అనను " అని గొంతు ఎత్తి అరచాడు. ఏమిటబ్బా ఈయనకి భారత మాత మీద ఇంత కోపం అని కొంచం ఆశ్చర్య పోవలసి వచ్చింది. దానికొక రీజన్ కూడా సెలవిచ్చాడు అయన గారు. "భారత రాజ్యాంగం లో ఎక్కడైన భారత మాతాకి జై అనమని రాసి ఉందా? లేదు కాబట్టి నేను అనే ప్రసక్తే లేదు " అన్నారు . అయన మాటలు వినే  వాడి చెవిలో పువ్వులు ఉంటె "బహూశా ఈయన గారు భారత రాజ్యాంగాన్ని తు. చ . తప్పకుండా పాటించే వ్యక్తీ కాబోలు అనుకుంటారు. అలా అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన చట్టాలు  ఎన్నికల్లో రిగ్గింగ్ లు చేయడం, బెదిరించడం  నేరం  అని చెపుతున్నాయి. పాటిస్తున్నాడా , ఈయన గాని ఈయన పార్టి గాని? భారత రాజ్యాంగం లో చెప్పలేదు అని కాదు ఈయన బాధ ! భారత మాత  అనే పదం  స్త్రీ లింగం అయినందుకు ఒవైసీ గారు జై అనలేక పోతున్నట్లు ఉంది!

                     నిజమే మరి! అయన అనుసరించే మతం లో ఎక్కడా స్త్రీ దేవతా రాదన లేదు. వారు చెప్పే దాని ప్రకారం అసలు స్త్రీలు పుట్టింది పురుషుల అడుగులకు మడుగులొత్తుతూ , వారి సంతానాభివ్రుద్దికి సహకరించడానికి తప్పా మరెందుకు పనికి రాని జీవులు. అందుకే వారి మత ఉద్దరణ కోసం అవతరించాం అని చెప్పుకుంటున్న ISIS లాంటి ఉగ్రవాద సంస్తలు దాడులు సమయం లో తమకు దొరికిన స్త్రీలను "సెక్స్ బానిసలు " గా మార్చీ వేసి తమ లైంగిక అవసరాలకు వాడుకుంటున్నారు. పదేళ్ళ లోపు పిల్లల్ని అయినా సరే రేప్ చేసి మరీ గర్బవతుల్ని చేసి , తమ యుద్దం  కోసం "పోరాట యోదుల్ని " కనమని ఒత్తిడి చేస్తున్నారు అంట. ఈ  విదంగా 30,000 మైనర్ బాలికలను రేప్ చేసారని లెక్కలు చెపుతున్నాయి. ఇలా ఎందుకు స్త్రీలను హింసలకు గురిచేస్తున్నారు అంటే " మా మతం " మాకు చెప్పేది అదే అంటున్నారంట. సరే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటె స్త్రీల పట్ల అసదుద్దీన్ గారు నర నరాల్లో జీర్ణించుకుని ఉన్న అయన మత దృక్పదం  అది. మరి అలాంటి వ్యక్తీ "భారత మాతాకి జై " అని అనమంటే అంటారా ? ఎంత నామోషి? 

    అసలు దేశాలను , ప్రాంతాలని స్త్రీ లతో పోల్చడం ఏమిటి నాన్సెన్స్! అని అసడుద్ద్దిన్ గారి అభిప్రాయం కాబోలు.  భారత మాత , తెలంగాణా తల్లి , అని అనే బదులు భారత పిత , తెలంగాణా తండ్రి అని ఉంటె , అసదుద్దీన్ గారు ఇంత అవేశ పడాల్సిన అవసరం ఉండేది కాదు. భారత పితాకు జై అని తన పురుష భక్తిని చాటుకునే వాడు కదా? పాపం భారత దేశం లో పుట్టినందుకు ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చాయి. అసలు అసదుద్దీన్ గారి పితృ భక్తీ గురించి చెప్పాలంటే 2015 సంవత్సరం జనవరి నెలలో మీలాద్ ఉన్ నబి పండుగ సందర్బంగా , అయన తోటి ముస్లిం సోదరుల నుద్దేసించి చేసిన ప్రసంగం గురించి తెలుసుకోవాలి . సాదారణంగా మనం జన్మించిన ప్రాంతం లేదా పుట్టిన ఊరు  గురించి ప్రస్తావించేటప్పుడు  "మాతృభూమి " లేక మథర్ లాండ్ అని సంబోదిస్తాం . కాని ఒవైసీ గారికి మదర్ లాండ్ అని పలకటం ఇష్టం లేక " భారత దేశం ముస్లింలకు "country of father  " అని పండుగ సందేశం ఇచ్చాడు. ఆ సందర్బంగా నేను రాసిన బ్లాగు పోస్ట్ కూడా చూడండి .  

          కాబట్టి ఏతా వాతా మనకు అర్దమయ్యేది ఏమిటంటె , మెడ మీద కత్తి పెట్టినా "భారత మాతాకి జై " అనడానికి అసదుద్దీన్ గారు అంగీకరించలేకపోవడానికి "భారత దేశాన్ని " అమ్మ తో పోల్చడమేనని , అయన స్త్రీ ఆరాధనకు వ్యతిరేకం తప్పా , దేశ భక్తీ ప్రకటించడానికి వ్యతిరేకం కాదని. భారతదేశం అయన ఫాదర్ కంట్రీ కాబట్టి , మెడ మీద కత్తి పెట్టినా " భారత మాతా కు జై " అని అనడు గాక అనడు. "భారత పితా కు జై " అని అనమంటే ఏమన్నా అంగీకరిస్తాడు ఏమో?!! సరే అయన అనకపోతే అనక పోయాడు , మనం మాతృభూమి   బిడ్డలం కాబట్టి మనం అందాం. 
                                  భారత మాతాకి జై,       భారత మాతాకి జై. 

Comments

  1. కాదండీ ఆయన ఉద్దేశ్యం వేరే. భారతమాత అనే చిహ్నానికి జై కొట్టడం విగ్రహారాధనతో సమానమని కొందరి ముస్లిముల నమ్మకం. వందేమాతరం మీద అభ్యంతరానికీ ఇదే కారణం. దీనికి స్త్రీ పురుష (మాతా పిత) బేధాలు లేవు.

    నిన్న మహారాష్ట్రలో సస్పెండ్ అయిన మజ్లిస్ ఎంఎల్యే "భారత్ మాతాకీ జై" అనడానికి నిరాకరించాడు కానీ అదే ఉపన్యాసం "జై హింద్ జై మహారాష్ట్ర" నినాదాలతో ముగించాడు.

    ReplyDelete
    Replies
    1. O.K మీరన్నట్లు, ఒవైసితో సహ కొంత మంది ముస్లింలు కు భారత మాత అనేది ఒక చిహ్నం గాను, మాతకు జై కొట్టడం విగ్రహరాదన గా బావిస్తున్నారు అనుకుందాం. మరి జై మహరాష్ట్ర అంటే ఏమిటి? అది కూడా ఒక ప్రాంతాం యొక్క బౌతిక స్వరూపం కాదా? మహరాష్ట్ర అనగానే గుర్తుకు వచ్చేది మహరాష్ట్ర మ్యాప్. అది కూడా ఒక చిత్రమే. కాబట్టి జై మహ రాష్ట్ర అన్నా అది కూదా ఖచ్చితంగా విగ్రహారాధన క్రిందకే వస్తుంది అని నా అభిప్రాయం. అయితే వారి అభిప్రాయం మీరన్నదే కావచ్చు. విగ్రహరాధన వ్యతిరెకతలోనే స్త్రీమూర్తి ఆరాధన వ్యతిరేకత కూడా మిళితమై ఉంది.

      Delete
    2. ఇస్లాములో మహిళలకు తగిన స్థానం లేదన్నది కూడా నిర్వివాదాంశం. ఆస్తి పంపకం, డ్రెస్ కోడ్, వాజ్మూలం ఇంకా ఎన్నో విషయాలలో ఇది తేటతెల్లం అవుతుంది. అయితే ఇదొక్కటే ప్రస్తుత ఉదంతానికి కారణం కాదని నా అభిప్రాయం.

      విగ్రహారాధన అంటే ఏమిటి అన్న విషయంపై అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నా ఉద్దేశ్యంలో కాబా వైపు తిరిగి నమాజ్ చేయడం, హజ్ సమయంలో సైతానుపై రాళ్ళు రువ్వడం కూడా విగ్రహారాధన లాంటివే (షిర్క్). అయితే ఎవరి నమ్మకం వారిది మన నిర్వచనం అవతలి వారు ఒప్పుకోవాలని పట్టు పట్టలేము కదా.

      ఏది ఏమయినా జై హింద్ నినాదం చేసిన వ్యక్తిని దేశద్రోహిగా వర్ణించడం నేను సమర్తించలేను.

      Delete
  2. కౌన్ కిస్కా హై గొట్టాం గాడు జై కొట్టక పోతే నష్టమేమి లేదు..

    ReplyDelete
    Replies
    1. గొట్టాం గాడు జై కొట్టక పోతే పొయేదేమి లేదు కాని, ఒక M.P అయి ఉండి జై కొట్టక పోగా "నేను కొట్టను . ఏమి చేసుకుంటారో చేసుకోండి " అని ఉద్దేస్య పూర్వకంగా రెచ్చకొట్టడమ్ కొంచం సీరియస్ గా అలొచించాల్సిన విషయమే.

      Delete

    2. సెహభేషు !

      జిలేబి

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!