మాతా పితల విగ్రహాలు అసత్యం అట ! మైత్రేయి పరువాలు సత్యం అట !

                                                                     



హిందూ జీవన విదాన సిద్దాంతం  యొక్క విశిష్టత ఏమిటంటే , ఇది ఏ ఒక్కరితోనో లేక ఏ ఒక్క సిద్దాంతం తోనో  ప్రారంబం కాలేదు, అలాగే ఏ ఒక్కరితోనో అంతం కాదు. దీనికి ఇతర మతాలకు ఉన్న భేదం  అదే . ఇది మతం కాదు జీవన విదానం అన్ని ఎన్ని సార్లు  చెప్పినా , చివరకు ఈ  దేశ సర్వోన్న్నత న్యాయస్తానం నొక్కి చెప్పినా , కొంతమంది దీనిని పట్టించుకున్నట్లు కనపడడం లేదు. ఎంతొ విశిష్టమైన హిందూ జీవన విదానం ని ఏదో ఒక ప్రవక్త బోదనలతో మొదలైన మతాల స్తాయికి దిగాజార్చాలని కొంతమంది పని కట్టుకుని ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది. అలాంటి వారి ప్రయత్నాల కొనసాగింపే హిందూ మతం లో "విగ్రహారాధన " లేదు అనే వితండ వాదం చేయడమ్. వారి వాదాలకు అనుకూలంగా హిందూ జీవన విదానం లో ఒక బాగమైన ఒక రుషి చెప్పిన దానిని మాత్రమే పట్టుకుని "హిందూ మతం " అంటే ఇలాగే ఉండాలి అని చెప్పడం చూస్తుంటె , వారికి హిందూ అనే పదానికి కూడా అర్ధం తెలియదు అని అనుకోవాలి. అసలు హిందువులకు విగ్రహారాధన కరెక్టా , కాదా అనే దానిని కాసేపు పక్కన పెడితే , విషయం తెలుసుకోకుండా , ఎవరో చెప్పారని విగ్రహారాధనను మానివేస్తే , కలిగే అనర్దాలు ఏమిటొ  తెలుసుకునేందుకు ఒక   కద చెపుతాను . విసుగు అనుకోకుండా చదవండి .

                                నాకు తెలిసిన వెంకటేశ్వర రావు గారి కుటుంబం ఒకటి ఉంది. రావు గారికి  తాత ముత్తాతలు నుండి సంక్రమించిన ఆస్తితో పాటు , దైవ భీతి , దాన గుణం లాంటి ఉదార స్వబావాలు  కూడా అబ్బాయి. వారి తాతలు గుళ్ళు , గోపురాలు నిర్మించి గొప్ప దైవభక్తులుగా పేరు గాంచారు కాబట్టి రావు గారు కూడా అదే బాటలో ఉన్నారు. వారి దాన గుణం చేత కాని, లేక ఉన్నది చాల్లే అనే తృప్తి వల్ల  గాని , రావు గారి హయాం లో ఆస్తులు కొన్ని తరిగాయి తప్పా , ఏ మాత్రం పెరగలేదు. రావు గారికి  ఒక్క గానొక్క కొడుకు విశ్వం విశ్వవిద్యాలయాలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. అతడికి విశ్వ విద్యాలయాలో పరిచయం అయిన వామపక్ష బావజాల స్నేహితుల ద్వారా అతనూ  ఒక వామ పక్షిగా మారి పోయాడు.దేవున్ని నమ్మడం ,  విగ్రహాలకు పూజ చేయడం అంతా ఒక హంబగ్ అని, అది దోపిడి విదానం లో బాగం అని బలంగా నమ్మాడు. విద్యాలయాలో జరిగే సెమినార్లలో ఈ  విషయాల మీద తెగ ఆవేశ పడి పోతూ లెక్చర్లు దంచే వాడు. ఇంటికి వచ్చినప్పుడు తండ్రి నిర్వహించే క్రతువులు, పూజలు చూసి ఈసడించుకునే వాడు. తండ్రిని ఏమన లేక  ఇంటికి రావడం తగ్గించేసాడు. 

                      ఇక కాలం తన ధర్మం తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి వెంకటేశ్వర రావు గారు మరణించి ఇంటి పెత్తనం కొడుకు చేతిలోకి వచ్చింది. కొడుకు పల్లెటూర్ లోనివి చాలా వరకు అమ్మీ వేసి పట్నం లో మకాం పెట్టాడు . అతని పెండ్లి సామ్యవాద పద్దతిలో స్టేజి మారేజ్ చేసుకున్నాడు. ఇంట్లో పూజ అవీ  తీసివేయడమే కాకుండా , దేవుని విగ్రహాలతో పాటు , తాత ముత్తాతల పటాలను కూడా తీసి వేయించాడు. ఎందుకంటె అవి బూజు పట్టిన  సాంప్రదాయ వాదుల పొటోలు అవడం చేత. తన గదిలో మార్క్స్, ఎంగెల్స్ , ఇంకా తనకిష్టమైన సామ్యవాద సిద్దాంత కర్తల పోటోలు పెట్టుకున్నాడు. అయన హయంలో స్తానికంగా కమ్యునిస్ట్ పార్తీయే అధికారం లో ఉంది కాబట్టి , అయన చుట్టూ ఎప్పుడూ కమ్యునిస్ట్ లు అని చెప్పబడుతున్న వారే  ఉండె వారు.  వారిలో చాలా మంది రియల్ ఎస్టేట్ , ఇతర వ్యాపారాలు చేస్తూ ఆస్తులు పెంచుకోవడం చూసిన విశ్వమ్ తనూ వారితో సహవాసం చేసి కోట్లు గడించాడు. ఇదేమిటి కమ్యునిస్ట్ లు అవసరానికి మించిన ఆస్తులు పెంచుకోవడం సిద్దాంత విరుద్దం కదా, "ఇంటర్నేషనల్ కమ్యునిజం వేరు. ఇండియా కమ్యునిజం వేరు. స్తానిక పరిస్తితులుకు అనుగుణంగా సిద్దాంతం ని మలచుకుని కమ్యునిస్ట్ లు పనిచేయాలి" అని మార్క్స్ చెప్పారు కాబట్టి ,అందరూ తెగ సంపాదించేసి ఎన్నికల్లో ఖర్చు చేస్తుంటే , మేము చేతులు ముడుచుకు కుర్చోవాలా ? అందుకే మేము ఎన్నికల్లో పోటి పడినట్లు , సంపాదనలోనూ పోటిపడుతున్నామ్ " అని తమ పనిని సమర్దించుకునే వారు. 

                    ఇక ఇంట్లో సాంప్రదాయ విగ్రహారాధన లేనప్పిటికి , మార్క్స్ ఎంగెల్ పొటోలు మాత్రం రూములు నిండా  ఉందేవి.వారి జయంతులు, వర్దంతులూ జరిగేవి. గుళ్ళు , గోపురాలకు పోకపోయినా , సోషలిజం కి , కమ్మ్యునిజానికి  తేడా తెలియని పార్టి కార్యకర్తలు అమరులైతే , అక్కడికి వెళ్లి వారి సమాడులకి పూల మాలలు వేసి, లాల్ సలాం కొట్టి వచ్చే వాడు.   విశ్వం కి కూదా ఒక కొడుకు  కలిగాడు. పెరిగి పెద్దవాడు అయ్యాడు. దేవుడు , గీవుడు లేడూ  , బొమ్మలకు పూజలు చేయడం ఏమిటి నాన్సెన్స్ అన్న తండ్రి సిద్దాంతం వంట బట్టింది కాని, కమ్యునిస్ట్ సిద్దాంతం మాత్రం వంట  బట్ట లేదు. ఎందుకంటె విశ్వం కొడుకు పెరిగే సరికి ప్రజల్లో కమ్యూనిజం మీద మోజు  తగ్గి పోయింది. స్తానికంగ కమ్యునిస్ట్ పార్టి అధికారం లో లేక పోయినా , ఆ పార్టి నాయకుడిగా తండ్రి సంపాదించిన ఆస్తి దండిగా ఉండటం తో విశ్వం గారి అబ్బాయి ఆడింది అట , పాడింది పాట. పాపులర్ సినిమా హీరోయిన్ "మైత్రేయి " అతని ఆరాద్య దేవత అయింది. అతని రూము నిండా ఆమే ఫొటోలే .నిత్యం, అనేక భంగిమల్లో ఉన్న ఆమె పరువాల చిత్రాలను చూస్తూ తన్మయత్వం చెందుతుండె వాడు. ఆమె నటించిన చిత్రం సిటి లోకి వస్తే , విపరీతమైన ఖర్చు చేసి , తనస్నేహితులతో ఆమె నటించిన చిత్రానికి పబ్లిసిటి ఇచ్చేవాడు. అప్పుడప్పడు వెళ్లి ఆమెను కలసి వచ్చే వాడు కూడా. ఇలా ఆ ఇంట్లో ఒక మైత్రేయి ఆరాధకుడు తయారు అయ్యాడు. 

     ఇక విశ్వం గారి తల్లి , విశ్వం చేసే పనులు నచ్చక ఆమె పల్లేటుల్లో స్వంత ఇంటిలోనే ఉంటు , తన భర్త ను , ఇలవేల్పులను స్మరించుకుంటు ఒంటరిగా కాలం వెళ్ళదీస్తుంది. ఆమె  కొడుకు సిద్దాంతం ఇలవేల్పులను మరచిపోతే , మనవడి సిద్దాంతం తైతక్కలాడే వేల్పులను ఇంట్లోకి తెచ్చింది. చివరకు దేవుడి విగ్రహాలు స్తానం లో సినిమా స్టార్ ల వ్విగ్రహాలు ప్రత్యక్షం అయ్యాయి. దైవారాధన బదులు స్టారారాధన మొదలు అయింది. వెంకటేశ్వర రావు గారి కుటుంబం గురించి తెలిసిన వారు ఎవరైనా , అయన మనుమడితో " బాబూ , తల్లితండ్రులు ,దేవుళ్ళు పొటోలు  పెట్టి పూజలు చేయాల్సిన  ఇంట్లో , ఇలా మైత్రేయి హిరోయిన్ పొటోలు పెట్టి పూజించడం ఏమైనా బాగుందా " అంటె "మాతా పితల విగ్రహాలు అసత్యం  ! మైత్రేయి పరువాలు సత్యం "అన్నాడు అట. అదీ కధ !

      కాబట్టి ఆరాధనా పద్దతులు అనేవి ఆ యా వ్యక్తుల మానసిక స్తాయి ననుసరించి ఉండాలి తప్పా, ఎవరో చెప్పారని సాంప్రదాయ విగ్రహారాధన వద్దనుకుంటే , విగ్రహాలు మారుతాయి తప్పా, నరనరాల్లో జిర్నించుకు పోయిన ఆరాధన తత్వం మారదు. ఎక్కడ దైవ పూజ సన్నగిల్లుతుందో అక్కడ వ్యక్తీ పూజ ప్రబలమవుతుంది. అందుకే విగ్రహ దేవుళ్ళు స్తానం లో నిగ్రహం లేని వ్యక్తుల పూజలు ఎక్కువ అయి , చివరకు అదొక పెద్ద బిసినెస్ గా మారిపోయింది. 
కాబట్టి దైవారాధన అనేది పూర్తిగా వ్యక్తి ఇచ్చనుసారం  ఉందాలి తప్పా , ఇలాగే ఉండాలి అని  భక్తులకు గిరి గీయడం  తప్పుడు విదానం. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!