మహిళ తనను రేప్ చేయనీయ లేదని కేసు పెట్టడానికి పోయాడంట, మృగతనం తెగిన మగాడు!!?

                                                                         


                                 అది మద్యప్రదేశ్ రాష్ట్రం లోని ఉమేరియా జిల్లాలోని మణ్ పూర్ పోలిస్ స్టేషన్ . మొన్న 29 వ తారీఖు తెల్లవారు జామున రామ్ కరణ్ ప్రజాపతి అనే వ్యక్తీ పరుగు పరుగున బాదతో విల విల లాడుతూ వచ్చాడు అంట. రావడం తోటే "ఆమె నా మర్మాంగం కోసేసింది మహాప్రభో " అని మొర  పెట్టుకున్నాడు అంట. ఎవరు? ఏమిటి కదా ? అని ఆరా తీసిన పోలిసులు అతను చెప్పిన దానిని ప్రాధమిక సమాచారంగా     జారీ చేసి , మర్మాంగం వద్ద తీవ్ర గాయాలు అయిన అతనిని హాస్పిటల్లో జాయిన్ చేసి , అతడు చెప్పిన మహిళా , మరియు ఆమెకు సహకరించాడు అని చెప్పబడుతున్న ఆ మహిళ భర్తను అరెస్ట్ చేద్దామని , ఆమె ఊరు అయిన గోవర్డే గ్రామానికి వెళ్ళారు అంట. అక్కడ విచారణ జరిపిన మీదట , అసలు విషయం తెలిసి నివ్వెరపోయిన పోలిసులు , హస్పిటల్ నుండి   ప్రజాపతి డిశ్చార్జ్ చేయగానే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుదామని కాపలా కాస్తున్నారంట! ఇంతకీ పోలీసులకు తెలిసిన అసలు విషయం ఏమిటంటె ,

                  గోవర్డే గ్రామం కి చెందిన ఆ మహిళకు రామ్ కరణ్ దూరపు బందువు అవుతాడట. 28 వ తారీకున అతడు ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆమెను ఆమె భర్తను తీసుకుని ఆ గ్రామం లో జరిగే జాతరకు వెళ్ళాడు అంట. అక్కడ ఆమె భర్తను తాగడానికి సారా తెమ్మని చెప్పి , భర్త అటు వెళ్ళగానే ఆ మహిళా  మీద అత్యాచారం చేయ బోయాడు అంట. దానితో ఆమె అటు పెనుగు లాడి , ఇటు పెనుగులాడి చివరకు తన వద్ద ఉన్న కిచెన్ కత్తి తో అతడి మర్మాంగం ని కోసింది అంట. దానితో తీవ్రంగా గాయపడిన అతను లబో దిబో మంటూ డాక్టర్ల వద్దకు వెలితే , "ఇది పోలిస్ కేసు. వారు చెపితే కాని వైద్యం చేయం అన్నారట. ఈ  సంఘటణ  జరిగింది 28 రాత్రి 10 గంటలకు. ఏ దాక్టర్ కూడా పోలిస్ వారి రెపరెన్స్ లేకుండా వైద్యం చేయడానికి ముందుకు రాక పోవడం వలన , చివరకు తప్పని పరిస్తుతుల్లో పోలిస్ స్టేషన్ కి వెళ్లి ఒక కట్టు కధ  చెప్పి ఎలాగో హాస్పిటల్లో చేరాడు రామ్ కరణ్ ప్రజాపతి.

     ఇక  అసలు విషయం తెలుసుకున్న పోలిసులు, స్త్రీ తన మాన రక్షణ కోసం మ్రుగాడి మర్మాంగమే కాదు, చివరకు అతడిని చంపినా అది రైట్ అప్ ప్రైవేట్ డిపెన్స్ క్రింద నేరం కాదు కాబట్టి , ఆమెను , ఆమె భర్తను అభినందించి , రామ్ కరణ్ ను అరెస్ట్ చేసి జైలులో వేద్దామని వేచి చూస్తున్నారు అంట. అదీ సంగతి. మద్య ప్రదేశ్ లో పిబ్రవరి 11 న సేమ్ ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది అట. ఒకామె తన మీద అత్యాచారం చేయబోయిన వాడి మర్మాంగాన్నికోసి వేయడమే కాకుండా , దాన్ని పట్టుకుని తిన్నగా పోలిస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు అప్ప చెప్పింది అట. మ్రుగాడి నుంచి రక్షణ కోసం అతడి మర్మాంగం వేరు చెయ్యక తప్ప లేదు అని చెపుతున్న  ఆమెను చూసె సరికి అక్కడున్న మగాళ్ళకు సర్వాంగాలు స్తంభించి పోయాయి అట. ఇలా ప్రతి బాదిత మహిళా    తిరగబడితే  మ్రుగాళ్ళు కూడా మంచి మగాళ్ళు లాగా మారి పోయి బుద్దిగా బ్రతకరూ ?!!

    మనకు రోజూ పేపర్లలో కనపడే రేప్ కేసులు లో విషయం చూస్తే అంతా ఒకే తీరుగా ఉంటుంది. బాదిత మహిళా మ్రుగాడి  సైకిలో, బైకో , కారులోనో వెలుతుంది. అక్కడ ఎవరో మ్రుగాడి ప్రెండ్స్ లేక ఇతరులెవరో వీరెంట పడతారు. అక్కడ అందరు కల్సి ఈమెను రేప్ చేస్తారు. ఆమె నాలుగు రోజులు దాక కామ్ గా ఉంటుంది. చివరకు ఎవరో ఒకరు దైర్యం చెపితే అందరి మీద కేసు పెడుతుంది. కేసు విచారణ సందర్బంగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చినా , ప్రాసిక్యుషన్ కి అనుకూలంగా ఉన్న విషయాలే పేపర్లలో , మీడియాల్లో వస్తాయి కాబట్టి , "ఘోరమైన సంఘటణ " అంటూ  ఘొల్లు మంటారు మీడీయా వారు. దానితో పిచ్చ పబ్లిసిటి వచ్చి, ఈ దేశం   లోని మగాళ్ళు అంతా మ్రుగాల్లే
అని ప్రచారం చెసే కొంతమందికి ఉపయోగపడుతుంది. తీరా కేసులు కోర్టులో విచారణ కు వచ్చే సరికి , వారూ వీరూ కాంప్రమైజ్ కావడం , "అబ్బే అంతా ఉత్తిదే "అని సాక్షులు చెపుతుంటే , నిజం తెలిసినా చట్ట ప్రకారం ఏమి చెయ్యలేని నిస్సహాయ స్తితిలో భారతీయ న్యాయ వ్యవస్థ , కేసు నాట్ ప్రూవ్డ్ అంటుంది. దానితో ఘోరమైన రేప్ కేసు కాస్తా నీరుకారిపోతుంది.

  అందుకే ఎన్ని రేప్ కేసులు నమోదు అవుతున్నాయి అన్నది కాదు. ఎన్నిమతిలో నేరాలు రుజువు అయి మ్రుగాళ్ళకు శిక్షలు పడుతున్నాయి అన్నదే సమాజానికి పనికొచ్చే లెక్కలు. పదేళ్ళు కోర్టులు చుట్టూ తిప్పి నేరస్తులను వదిలివేసే సో కాల్డ్ న్యాయప్రక్రియ కంటె , స్పాట్ లో మ్రుగాళ్ళ   "మర్మాంగం కోత" ప్రక్రియే అత్యాచారాలను కట్టడి చేస్తుంది. కాబట్టి  నిజమైన (?)బాదిత మహిళలలారా భయపడకండి. కోయండి మీ మీద అత్యాచారం చేసే మ్రుగాళ్ళను ! మీలో ఆదిశక్తి  ఉంది. ఆ శక్తిని  రానివ్వండి . మ్రుగాల్లను దునుమాడనివ్వండి  మీ మాన ప్రాణాలను  కాపాడుకోవడం  మీ జన్మ హక్కు. అలాగే తప్పుడు కేసులు పెట్టె మహిళలను కూడా చెప్పు తీసుకు కొట్టండి . ఎందుకంటె  అటువంటి వారి వలనే "సత్యమేవ జయతే " అన్న మన నినాదం  ప్రతిష్ట  మసకబారి పోతుంది. చివరకు నిజం కేసుల నుండి కూడా నిందితులు తప్పించుకోవడానికి అవకాశం కల్పించినట్లు అవుతూంది.

    ఒక సారి కేసు పెడితే శిక్ష తగ్గించుకోవడానికే నిందితుడు పోరాడే విదంగా కేసులు ఉందాలి తప్పా , అసలు కేసు నుండే తప్పించుకునే విదంగా ఉంటె ఆ కేసులకు ఉన్న విలువ ఏమిటీ? తప్పు చేసిన వారినే కాదు , తప్పుడు కేసులు పెట్టె వారికి కూడా కఠిన మైన శిక్షలు ఉంటే తప్పా ,మన సమాజం లో నేరాలు కట్టడి కావు అనుకుంటా?       

సోర్స్:- http://timesofindia.indiatimes.com/city/bhopal/Madhya-Pradesh-woman-cuts-privates-of-man-while-defending-rape-attempt/articleshow/51190572.cms?

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం