'తిక్కల పోరి తైతక్కలాటకు' క్లైమాక్స్ సీన్ "అమ్మ నీ కమ్మని దెబ్బ" ని చూడండి !!

                                                                           


           ఈ  మద్య , చదువుకునే పోరగాల్లకి అదేదో మాయదారి " ప్రచార పిచ్చి " అనే జబ్బు పట్టుకుందట. కొంత మంది పోరగాల్లు పోరులతో కలిసి ఒక పబ్లిక్ ప్లేస్ ల జమ గావడం, ఒక్క సారిగా పిచ్చి పట్టినట్లు గంతులేస్తూ వెర్రి కేకలు వేయడం. వారి కోతి గంతులకు వెనుక సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. డ్యాన్స్ అంతా అయ్యాక ఇదేందబ్బా గిట్ల ఎగిరిన్రు అని ఎవరైనా అడిగితె "జనం లో చైతన్యం తెచ్చుట కొరకు" అనే భుకాయింపులు . ఈ  లత్కోరి డాన్స్ లు చూసే వారికి ఎట్లున్నా , ట్రాపిక్ జామ్ అయి పబ్లిక్ బాదపడుతుంటె , పరువు తీసేసినట్టయి డాన్స్ లు వేసే పోరగాల్ల ఇంట్లో పెద్దలు బాదపడుతున్నారు. అలా బాధపడే ఒక తల్లి , తన కూతురు బస్టాండ్ లో పబ్లిక్ గా లత్కోరి డాన్స్ వేయడం చూసి తట్టుకోలేక ఏమి చేసిందో ఈ క్రింది విడియోలో చూడండి. సీన్

 కేరళలో ఒక బస్ స్టాండ్ లో స్టూడెంట్స్ అయిన యువతీ యువకులు కల్సి "మోబ్ ఫ్లాష్ " అనబడే మోడ్రన్ లత్కోరి డాన్స్ చేస్తుంటే , అందులో ఒక అమ్మాయి తల్లి వచ్చి ఆ అమ్మాయి చెంప పగులగొట్టడమే కాక అందులో పాల్గొన్న విద్యార్దులను నిర్వాకులను చెడా మడా తిట్టింది . దానితో ఆ అమ్మాయి కి కళ్ళు బైర్లు కమ్మి "అమ్మ నీ కమ్మని దెబ్బ " అనే పాట గుర్తుకు వచ్చి ఉంటుంది.
 
        పొట్ట కూటి కోసం వీదుల్లో నృత్యాలు చేసి జీవనం గడుపుకునే వారికి కాంపిటీటర్స్  గా తయారు అయిన ఈ  వీది నృత్యాలు చేసే వారిలో ఉన్నది పబ్లిసిటి మానియా తప్పా , సామాజిక స్పృహ ఏ మాత్రం కాదు అన్నది వారు చేసే లత్కోరి డాన్స్ లే చెపుతాయి. ఇలాంటి పిచ్చి ఉన్న పిల్లలకి ఇంట్లోనే  తల్లి తండ్రులు "అమ్మ నీ కమ్మని దెబ్బ " అనే పాట పాడి వినిపిస్తే వారు వీదుల్లోకి వచ్చి ఇలాంటి తిక్కల డాన్స్ లు వేయరు.

 "ఎవరి పిచ్చివారికానందం " అనే పెద్దల మాట   బహూశా  ఇలాంటి వారిని చూసే మొదలు అయినట్లు ఉంది.

                  

Comments

  1. ఆహా, ఎంత మంచి పని చేసింది ఆ తల్లి! ఫ్లాష్ మాబ్ వేలంవెర్రి మరీ ఎక్కువయిపోతోంది. అదో ఫాషన్ అనుకుంటున్నారు. ఇవన్నీ పాశ్చాత్యదేశాలనించి దిగుమతి చేసుకున్న పోకడలు. ఈ మాబ్ ఎవరి జీవనోపాధికీ దెబ్బ కొట్టడం లేదు గానీ అసలే అంతంతమాత్రమైన మన ట్రాఫిక్ క్రమశిక్షణకి మరింత అడ్డు తగులుతూ జనాలకి ఇబ్బందులు కలగజేస్తున్నారు. ఆ తల్లి కూతుర్ని రెండో చెంప మీద కూడా ఒకటి పీకవలసింది.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం