పెండ్లి కాని "బాబా" లు గొప్పా ? పెండ్లి అయిన "భాబా" లు గొప్పా?
మన దేశం లో బాబాలు అనబడేవారు రెండు రకాలు. ఒకరు పెండ్లి కాని బాబాలు అయితే రెండవ రకం పెండ్లి అయిన భాబాలు . వీరిలో ఏ రకం బాబాలు గొప్ప వారు అనేది తెలుసుకునే ముందు అసలు ఈ రెండు రకాల బాబాల మద్య ఉన్న తేడాలు ఏమిటొ తెలుసుకుంటే గాని చెప్పడం కుదరదు. అందుకే వీరి గురించి వివరిస్తాను.
ముందుగా పెండ్లి కాని బాబాలు గురించి తెలుసుకుందాం. మన దేశం లో పూర్వం రుషులు , మునులు అనబడె మానవోత్తములు ఉండె వారు . వీరు వనాలలో ఆశ్రమాలు నిర్మించుకుని , తమ పరివార సహితంగా జీవిస్తూ తమ అనుభవాలను , జ్ఞానాన్ని తమ తర్వాతి తరాలకు అందిస్తూ సమాజానికి మార్గదర్శకులై ఉండె వారు . సాదారణంగా వీరు వివాహాలు చేసుకుని , తమ ధర్మ పత్నులతో ధర్మ బద్దమైన గృహస్త మరియు వానప్రస్త జీవితం గడుపుతూ ఉండె వారు.
మోడరన్ యుగం లో మునులు రుషులు లేరు. వారి స్తానాన్నిబాబాలు , స్వామీజీ లు ఆక్రమించారు . వీరికి పెండ్లిళ్ళు పెటాకు ఉండవు. సంసార జంజాటాలు ఉండవు. హిందూ జీవన విదానం లో ప్రధానమైన గృహస్త , వానప్రస్తం దశలను అనుభవించకుండా డైరెక్టుగా "సన్యాసి " ఆశ్రమం లోకి బాబాలుగా ప్రవేశం చేసి దర్మోపదేశాలు చేస్తుంటారు. హిందు అయిన వ్యక్తీ సన్యాసి కావాలంటే ముందు సంసారి కావాలి అనేది తప్పని సరి. ఇదే విషయం గురించి మరింత సమాచారం కొరకు నేను రాసిన టపా "సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు." చదవండి. ఇక ఇందులో కొందరు సంసారులు కాకుండా డైరెక్టుగా సన్యాసులుగా మారిన వారు , వయసు చేసే పోరును తట్టుకోలేక తమ రహస్య భక్తురాండ్ర ను కూడి "సన్యాసి భంగం " కి గురి అయి అటు ఆశ్రమ పరువు ప్రతిష్టలను, ఇటు యావత్ హిందూ జాతి ఔన్నత్యాన్ని మంట గలుపుతున్నారు. కాబట్టి సంసారి కాకుండా సన్యాసి అవడమనేది ఏ మతం లోనైనా O.K కావచ్చు కాని ప్రక్రుతి ధర్మాలకు అనుకూలంగా మానవ జీవన విదానాన్ని నిర్దేసించిన "హిందూ జీవన విదానం " లో మాత్రం కూడని పని.
ఇక రెండవ రకం భాబా లు ఎవరంటే పెండ్లి చేసుకుని భార్యల చేతిలో నానా యాతనలు పడుతూ ,పెండ్లి చేసుకున్న నేరానికి తాము మాత్రమే కాక, తమను కన్న నేరానికి తల్లితండ్రులను , తోడపుట్టిన నేరానికి అన్నదమ్ములు అక్కచెల్లేల్ల అందరూ , భార్య పెట్టిన పోలిస్ కేసులతో జైలు పాలు అయితే , "మగాడిగా ఎందుకు పుట్టించావు దేవుడా " అని ఆ దేవున్ని కొరుకుంటూ ఉండె "భార్యా బాదితులు " .
ఇదివరలో అయితే భార్యల చేతిలో హింసలు పడె భర్తలు అటూ పైకి చెప్పుకోలేక , ఇటూ భార్యలను సులువుగా వదిలించుకోలేక నరక యాతన అనుభవిస్తూ ఉండెవారు. కాని భార్యా బాదితుల సంక్య నానాటికీ అధికం అవుతూ ఉండడమే కాక వారిలో భార్యలు పెట్టె తప్పుడు కేసులకు తట్టుకోలేక ఎక్కువమంది ఆత్మహత్యలకు గురి అవుతూ ఉండడం , సుప్రీం కోర్టు వారు కూడా ఈ విషయం లో అందోళన ప్రకటించడం జరిగాయి . ఈ విషయం మీద మరింత సమాచారం కొరకు ఇంతకు ముందు నేను రాసిన టపా
మొగుళ్ళని "విగత" లుగాను, పెళ్ళాల్ని "విదవలు " గా ను చేస్తున్న ఈ చట్టం మన సమాజానికి సరిఅయినదేనా? చూడగలరు.
అలాంటి "భాబా " లు అక్కడక్కడా "భార్యా భాదితుల సంఘం" గా ఏర్పడి కుటుంబ సమస్యలు విషయం లో పోలిస్ కేసులు బదులు పెద్దల జ్యోక్యం తో పరిష్కరించుకునే సాంప్రాదాయక విదానమే బెస్ట్ అని. ఇలాంటి విదానమే కుటుంబాలను రక్షించగలుగుతుందని గృహస్తులలో చైతన్యం తేవడానికి క్రుషి చేస్తున్నారు. సుప్రీం కోర్టు వారి జ్యొక్యం తో గృహ హింస కేసులలో మొదట భార్యా భర్తలకు మొదట కౌన్సిలింగ్ క్లాసులు ఇచ్చిన పిదప , అప్పటికి వారి మద్య సయోధ్య కుదరక పోతేనే క్రిమినల్ కేసులు పెడుతున్నారు. మేజిస్ట్రేట్ ల అనుమతి లేకుండా ఎట్టి పరిస్తితుల్లోను భర్తను కాని అతని తరపు బందువులను కాని అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని స్పష్టమైన ఆదేశాలు పోలిస్ వారికి ఇవ్వబడ్డాయి. ఇది ఒక రకంగా భార్యా బాదితుల సంఘం వారి నైతిక విజయమే.
కాబట్టి ఇప్పుడు మనకు రెండు రకాల భాబాలు గురించి తెలిసి పోయింది కాబట్టి వీరిలో ఎవరు గొప్ప? ఎవరు సమాజానికి ఎక్కువ ఉపయోగకారి ? చెప్పండి . నా దృష్టిలో అయితే పెండ్లి పెటాకులు లేకుండా , హిందూ జీవన విదానం కి వ్యతిరేకంగా బ్రతుకుతూ , అసలు సంసార జ్ఞానం లేకుండా , సంసారులకు "జ్ఞాన బోధ " చేస్తున్న ఆ "బాబా " లు కంటె , భార్యల చేతిలో హింసలు పొందినా , తమకు, తమ భార్యలకు మద్య చిచ్చు పెడుతున్న "గృహ హింస దళారీలు " అనే భూతాలను తరిమికొట్టడానికి "భార్యా భాదితుల సంఘం " ఏర్పాటు చేసుకుని తద్వారా తమ కుటుంబాలు మాత్రమే కాక , మొత్తం కుటుంభ వ్యవస్తని రక్షించుకోవాలని చూసే పెండ్లి అయిన భాబాలే గొప్ప వారు. వారు చెప్పేది రుషి వాక్యం. అనుభవమును చెప్పే మాట , శాస్త్రాలు చదివి చెప్పే జ్ఞాన బోద కంటె ఉత్తమం . అందుకే ఈ సమాజానికి వారే ఉపయోగకారులు.
భారత దేశం లో వివిధ పేర్లతో సంఘాలుగా ఏర్పడి , కుటుంభ పరిరక్షణకు కృషి చేయుచున్న భార్యా భాదిత సంఘాల సభ్యులకు ఇవే నా వందనములు.
Comments
Post a Comment