సర్దుకు పోలేని అమ్మాయి సంసారం చేస్తే , మొగుడు ముఖం పగిలే !అమ్మా అయ్యల మీద మీద కేసులు మిగిలే !

                                                                       


                              "ఆడపిల్ల నమ్మా , నేను ఆడపిల్ల నమ్మా "అంటూ కమ్మని రాగాలు తీసే గాయని మధు ప్రియ అంటే  తెలుగు ప్రజలకు ఒక రకమైన అభిమానం ఉంది. కారణం ఆ అమ్మాయి చిన్న పిల్లగా ఉన్నప్పుడే ,స్టేజి ఫియర్  అనేది ఏ మాత్రం లేకుండా , ఎంతో అనుభవం ఉన్న సీనియర్ గాయని మణులులాగా అలవోకగా పాటలు పాడెది. ఈ అమ్మాయి  చిన్న పిల్లగా పాటలు పాడుతున్నప్పుడె తల్లి తండ్రులు ఆమెకు పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలు  ఇచ్చినట్లుంది . దానితో ఆ అమ్మాయిలో  అలోచన కంటే అహం పెరగడం మొదలు అయి ఉంటుంది. అందు వలన ఆ అమ్మాయి పరిస్తితి "ఈడు వచ్చినా యువరం లేని పిల్ల " మాదిరి తయారు అయింది. అది చివరకు ఆ అమ్మాయి సంసారాన్ని మీడీయా స్తూడియో లోకి , పోలిస్ స్టేషన్ లలోకి లాకెళ్లి , పది మందిలో పలుచన అయ్యేలా చేస్తుంది.

                        మన చట్టాలు ప్రకారం 18 యేండ్లు నిండనిదే ఆడపిల్లలు పెండ్లి చేసుకోకూడదు అనే నిబందన ఉంది  కాబట్టి ,కొంత మంది  బాల ప్రేమికులు అంతా ఎప్పుడెప్పుడు 18 యేండ్లు నిండుతాయా , ఎప్పుడెప్పుడు పోలిస్ వారి రక్షణలో పెండ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తుంటారు. రికార్డులు ప్రకారం 18 నిండగానే, తల్లి తండ్రులు గుండెల మీద తన్ని , నచ్చిన వాడితో ఆర్య సమాజ్ లోనో , కాకుంటే పోలిస్ సమాజ్ (స్టేషన్ ) లోనో పెండ్లిళ్ళు చేసుకోవడం, కొన్నాళ్ళు కాపురం చేయగానే , ఒంట్లో వేడి చల్లారి పోతుంది కాబట్టి , అప్పటి దాక నచ్చినోడు అని అనుకుంటున్నోడులో "నచ్చని గుణాలు " ఎన్నో కనపడటం మొదలు పెడతాయి. అప్పటి దాక స్వర్గం అని బావించిన అత్తారిల్లు లేక మొగుడిల్లు  క్రమక్రమంగా నరకం లా కనిపించడం మొదలు అవుతుంది . దానితో తల్లి తండ్రుల ప్రేమ గుర్తుకు వచ్చి మనసు బావురుమని ఏడుస్తుంది . చివరకు అది మనిషినే బావురుమనే లా చేసి , తల్లి తండ్రుల దగ్గరకు వెళ్ళేలా చేస్తుంది. 

            సాదారణంగా తల్లితండ్రులు చేసిన పెండ్లి ద్వారా దంపతులు అయిన వారి మద్స్య ఏమైనా పొరపొచ్చాలు వస్తే అమ్మాయికి, అబ్బాయికి  నచ్చచెప్పి కూతురి కాపురం  చక్కదిద్దటానికి ప్రయత్నిస్తారు  . ఒక వేళా మొదట్లో ప్రేమ వివాహాలు  అంగీకరించకపోయినా , అల్లుడి మంచి తనమో , కూతురి సంసార అభివ్రుద్దినో గమనించి తల్లి తండ్రులు వారి సంసార బందానికి ఓకే అనేస్తారు . ఇటువంటి కేసుల్లో కూడా కూతురి సంసారం కల కాలం సాగాలి అని కోరుకుంటారు. అందుకే ప్రేమ వివాహం చేసుకున్న మగాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏమిటంటె , తాము సగటు మొగుడు కంటే మెరుగైన మొగుడుగా అంటే అదర్స మొగుడిగా ఉండాలి. సాద్యమైనంత త్వరగా, తనను విలన్ లా బావిస్తున్న అత్తా మామల హృదయాలు చూరగొని తనూ వారి కుటుంబం లో ఒక సబ్యుడు గా మారి పోవాలి. లేదంటే  బార్యా భర్తల మద్య ఏర్పడే చిన్న చిన్న తగాదాలు ,పుట్టింటి వారి జ్యోక్యంతో పెద్దవిగా మారి చివరకు సంసారమే చిన్న బిన్నం అవుతుంది. ఆడపిల్లకు పుట్టిల్లు "శాశ్వత సహజ రక్షణ కేంద్రం " అని ప్రియురాళ్ళను లేపుకు పోయి పెండ్లిళ్ళు చేసుకునే ప్రియుళ్ళు మరువరాదు. అలా మరచి పోబట్టే మొన్న శ్రిజ కేసులో అయినా , నిన్న గాయని మధుప్రియ కేసులో అయినా ఇన్ని రాదాంతాలు జరిగినవి , జరుగుతున్నవి. 

    గాయని మధుప్రియ చూడటానికి ఇప్పటికీ చిన్నపిల్ల లాగా నే ఉంటుంది. కాని మైకు పట్టుకుంటే పాటలే కాదు , మాటలు కూదా యమ దంచి వేస్తుంది. ఆ అమ్మాయి మాటల్లో  ఎవ్వరిని లెక్క చేయని తనం కనపడుతుంటుంది . అలాగే   కొంతమంది చిన్న పిల్లలో ఉండె పెంకి తనం తో పాటు తొందర పడె స్వబావం కనపడుతుంది. పొద్దుట పూట చెప్పిన మాట సాయంత్రం కి మారిపోతుంది. తల్లి తండ్రులు దగ్గర ఉంటె ఒక మాట చెపుతుంది , మొగుడు దగ్గరకెళితే మరో మాట చెపుతుంది . పోలిస్ కేసు పెట్టేటప్పుడు "వేదించిన మొగుడు " అన్న నోటితోనే , కొంచం కౌన్సిలింగ్ ఇవ్వగానే "మంచి మొగుడు " అనేస్తోంది. మరి అలాంటి మంచి మొగుడితో ఏదో అభిప్రాయ బేదం రాగానే  రయ్యి మంటూ పుట్టింటికి వచ్చి అతడో "వేదింపుల వేదవ" అంటూ మీడియా ముందు టాం టామ్   చెయ్యడమెందుకు? అందుకే ఈ అమ్మాయికి 18 యేండ్లు వచ్చినా ఇంకా చిన్న పిల్ల శకలు పోలా అనేది! ఈమే సెలబ్రిటి కాబట్టి , మీడియా పోకస్ వలన ఈ అమ్మాయి యొక్క ప్రేమ సంసారం లో ఉన్న సరిగమలు మనకు తెలుస్తున్నాయి, తెలియని ప్రేమ వివాహాల కదలు ఇలాంటివి ఎన్నో!

                                                                 

  
                         ఇక అబ్బాయి శ్రీ  కాంత్ గురించి చెప్పాల్సి వస్తే , మొదట్లో మధుప్రియ తల్లి తండ్రులను ఎదిరించి పెండ్లి చేసుకుంటాను అని పోలిస్ స్టేషన్ లో చెప్పేటప్పుడు , ఆ   అమ్మాయి పక్కన అమాయకుడిలా కనపడ్డ వ్యక్తీ , నిన్న సాక్షి టి.వీ లో ముఖం నిండా కట్లు తోఉన్నపిటికీ  మధు ప్రియ ని" ఇంటికి వస్తావా , రావా "   అని దబాయించి అడుగుతుంటే , అనుకున్నంత అమాయకుడు ఏమి కాదులే అనిపించింది. భార్య అలిగి పుట్టింటికి వెలితే రాత్రి వేళ , తన ప్రెండ్స్ ని తీసుకుని అత్తారింటికి వెళ్లడమెందుకు ? వారి చేతిలో ముఖం పచ్చడి చేయించుకోవటమెందుకు? పెద్దలు ఆమోదం లేని పెండ్లిళ్ళలో ,ఏదైనా సమస్య వస్తే, పద్దతిగా పగటి పూట పరిష్కరించుకోలేక , రాక్షసులు లా రాత్రి పూట దాడికి వెళతారా? అవును లే  లేపుకు పోయి  పెండ్లిళ్ళు చేసుకునే వారికి అంతకు మించిన పద్దతి ఏమి తెలుస్తుంది? చివరకు అటు వైపు, ఇటు వైపు వారు కేసులు పెట్టుకుంటే ,పోలిసులు , సైకియాట్రిస్ట్ లు 5 గంటలు శ్రమ పడి మొదటి కౌన్సలింగ్ ఇచ్చి , రెండవ కౌన్సిలింగ్ కి రెడి కమ్మని చెప్పారు అంట. ఈ  విదంగా  ఈ పిల్ల చేష్టలకు విలవైన పోలిస్ వారి 300 నిమిషాల సమయం వెచ్చించాల్సి వచ్చింది . ఇంకెన్ని నిమిషాలు వెచ్చిస్తే  వారి కాపురం కుదుటపడుతుందో మరి? 

    
        సంగీతం లో సరిగమలు సరిగా పలుకపొతే రాగం కర్ణ కటోరమ్ అవుతుంది. అలా గే సంసారం లో కూడా సరిగమలు ఉంటాయి. అవే ప్రేమ, ఆత్మీయత, ఓర్పు, సంయమనం  సర్దుబాటు, త్యాగం  లాంటివి . ఇవి ఎప్పుడు ఎలా చూపాలో తెలియకపోతే , సంసారం సమాజ  కటొరమవుతుంది. గాయని మధుప్రియకు స్వర సంగీతం లోపట్టు సాదించడానికి 10 యేండ్లు పట్టి ఉందొచ్చు. కాని సంసార సరిగమలు సరిగా పలికించడానికి 18 యేండ్లు చాలవు అనిపిస్తుంది. అదే చట్టం లో కనుక ,తల్లి తండ్రుల అనుమతితో అయితే 18 యేండ్లు , కేవలం స్వీయ నిర్ణయం తో అయితే 25 యేంద్లను  కనీస వివాహ వయస్సు గా , నిర్ణయించి ఉన్నట్లైతే ,శ్రిజ, మధుప్రియ లాంటి వేలాది మంది అమ్మాయిలూ జీవితాలు ఇలా ఒడి దుడుకులకు గురి అయి ఉండేవి కావు అని నా నిశ్చిత  అభిప్రాయం. ఇదే విషయం మీద ఇంతకు ముందు నేను రాసిన పోస్ట్ చూడండి. 

 ఏతా వాతా గాయని మధుప్రియ కేసు వలన మనకు తెలిసింది ఏమిటంటె "సర్దుకు పోలేని అమ్మాయి సంసారం చేస్తే , మొగుడు ముఖం పగిలే !అమ్మా అయ్యల మీద  మీద కేసులు మిగిలే ! అని . 


Comments

  1. 64 Acres agricultural land for sale with 4 boars near Chintalapudi, West Godavari Dt. (Between Chintalapudi and Chatrai). Just open below site to know full details.
    http://goo.gl/FNmtFq

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!