డిగ్గీరాజా గారి ద్రుష్టిలో ముఖ్యమంత్రి గారు మూర్కుడట!?
అవును మరి!తర తరాలకు సరిపడా సంపాయించుకునే బంగారం లాంటి అవకాశం వస్తే,దానిని కాదని ప్రజలు, సెంటిమెంట్ అంటూ పట్టుకు వెలాడడం మూర్ఖత్వం కాదు మరి?అదే అవకాశం డిగ్గీ గారికి వస్తేనా, నా సామి రంగా, హైద్రాబాద్ వాళ్ళని హడలెత్తించి ఫాయిదా పోందేవారే!మరి ఆ తెలివి తేటలు మన కిరణ్ గారికి లేవాయే! అంత తెలివి గలిగిన వాడు కాబట్టే మద్య ప్రదేశ్ లో కాంగ్రెస్ సమావేశం లో పాల్గొనకుండా డిగ్గి రాజా ముఖం మీదే తలుపులు మూ శారు అక్కడి కార్య కర్తలు . ఇంతకి మన ముఖ్యమంత్రి గారి మీద డిగ్గీ రాజా అని పిలువబడే దిగ్విజయ్ సింగ్ గారికి ఎందుకంత దుగ్ద!? మొన్న సీమాంద్రా మంత్రుల సతీమణులు రాష్ట్రపతి గారిని ఇతర డిల్లీ పెద్దలను కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ణప్తి చేసారు. అందులో భాగంగానే డిగ్గీ రాజా గారిని కలిస్తే ఆయనకు చిర్రెతుకొచ్చిందట. ఒక సారి విభజన కు ఓ.కె అన్నాకా మాటి మాటికి ఈ రాయాబారాలేంటి అని అసహనం ప్రదర్శించారట." అయినా మిమ్మల్ని కాదు మీ ముఖ్యమంత్రిని అనాలి, ఎంత మూర్కుడు కాకపోతే కావాల్సిన దానిని అడగకుండా, అయిపోయిన రాష్ట్ర విభజన ఆ