డిగ్గీరాజా గారి ద్రుష్టిలో ముఖ్యమంత్రి గారు మూర్కుడట!?



                                                                    


  అవును మరి!తర తరాలకు సరిపడా సంపాయించుకునే  బంగారం లాంటి అవకాశం వస్తే,దానిని కాదని ప్రజలు, సెంటిమెంట్ అంటూ పట్టుకు వెలాడడం మూర్ఖత్వం కాదు మరి?అదే అవకాశం డిగ్గీ గారికి వస్తేనా, నా సామి రంగా, హైద్రాబాద్ వాళ్ళని హడలెత్తించి ఫాయిదా పోందేవారే!మరి ఆ తెలివి తేటలు మన కిరణ్ గారికి లేవాయే! అంత తెలివి గలిగిన వాడు కాబట్టే  మద్య ప్రదేశ్ లో కాంగ్రెస్ సమావేశం లో పాల్గొనకుండా డిగ్గి రాజా ముఖం మీదే తలుపులు మూ శారు అక్కడి కార్య కర్తలు . ఇంతకి మన ముఖ్యమంత్రి గారి మీద డిగ్గీ రాజా అని పిలువబడే దిగ్విజయ్ సింగ్ గారికి ఎందుకంత దుగ్ద!?

  మొన్న సీమాంద్రా మంత్రుల సతీమణులు రాష్ట్రపతి గారిని ఇతర డిల్లీ పెద్దలను కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ణప్తి చేసారు. అందులో భాగంగానే డిగ్గీ రాజా గారిని కలిస్తే ఆయనకు చిర్రెతుకొచ్చిందట. ఒక సారి విభజన కు ఓ.కె అన్నాకా మాటి మాటికి ఈ రాయాబారాలేంటి అని అసహనం ప్రదర్శించారట." అయినా మిమ్మల్ని కాదు మీ ముఖ్యమంత్రిని అనాలి, ఎంత మూర్కుడు కాకపోతే కావాల్సిన దానిని అడగకుండా, అయిపోయిన రాష్ట్ర విభజన ఆంశం పట్టుకుని వేలాడటతా రు" అని ఈసడించాడట!ముఖ్య మంత్రి గారు కేంద్రం అభిమతానికి విరుద్దంగా సీమాంద్రా వారి ఆకాంక్షలకు వత్తాసు పలుకుతూ, దిక్కారానికి పాల్పడుతునారు అని చెప్పారట. పాపం సీమాంద్రా నాయకుల సతీమణులు ఏమనలేక తాము చెప్పాల్శింది చెప్పి వచ్చారట.

  నిజమే! దిగ్గీ రాజా గారి ప్రకారం ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు పనికి రాని వ్యక్తి. అదే ఇంకొకరు అయితే కేంద్రం వారి టి.నోట్ ప్రకటణలను "అదిగో తెలంగాణా వచ్చేసింది, ఇదిగో తెలంగాణా వచ్చేసింది అని సీమాంద్రా సెట్టిలర్స్ గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తూ, వారందరిని తన చుట్టూ తిప్పుకునేలా చేసే వారే!తెలంగాణ వస్తే మీకు రక్షణ ఉండద్సు అని సెటిలర్స్ ని కంటి నిండా  నిద్ర పోనివకుండా  కంగారెత్తించే  వారు .  హైద్రాబాద్ U.T  అయితే తప్పా మీరు బ్రతకలేరు అని భయపెట్టె వారు. మరి హైద్రాబాద్ ని U.T  చెయ్యాలంటే బోల్డంత ఖర్చవుద్ది అని ఊదరగొట్టే వారు. బయపడే బడా బాబులును తీసుకుని డిగ్గీ రాజా గారి లాంటి వారి చుట్టూ చక్కెర్లు కొట్టించే వారు. అటు పార్టీ పండ్ పేరిట కోట్లు వసూలు చేయించి అందులో తమ షేర్ జాగర్త్త చేసుకునే వారు. ఆ విదంగా అటు పార్టీకి ఇటు స్వంతానికి లాభం చే కూర్చుకునే వారు.హైద్రాబాద్ ని  U.T.   చేయించి అటు  హైద్రాబాద్ వారి నే కాక ఇటు సీమాంద్రా వారిని కూడా సంత్రుప్తిపరచే  వారు.  మరి అటు వంటి పనికొచ్చే పనులు చేయడం మానేసి పనికి మాలిన సమైఖ్య వాదం తలకెత్తుకోవడం ఎవరు చేస్తారు? ఒక్క కిరన్ కుమార్ రెడ్డి గారి లాంటి రాజకీయాలలో బ్రత కడం తెలియని వారు తప్పా!

  నేను ఇదివరకే చెప్పాను. తెలంగాణా వారి మీద ప్రేమ తో రాష్టాన్ని విభజించడం లేదు, అటు పార్టీ స్వార్దం, ఇటు వ్యక్తుల స్వార్దం కోసమే  "తెలంగాణా" ప్రకటించారు అని. తెలుగు వారు అంటే డిల్లీ వారికి ఉన్న గౌరవం ఏపాటిదో " ఏకైక తెలుగు ప్రదాని" శ్రి పి.వి. నరసింహా రావు గారి శవాన్ని కుక్కలు పీక్కు తీనేటట్లు "శవ సంస్కారం" చేసిన రోజే మనకు తెలిసి ఉండాలి. ఏదో పోయిన సారి అంటే ముప్పై మందికి పైగా M.P   లను గెలిపించే బాద్యత దివంగత ముఖ్యమంత్రి గారు తీసుకోవడమే కాక, రాష్ట్ర వాటాగా ఎవరూ ఇవ్వలేనంత పార్టీ ఫండ్ సమ కూర్చి ఉండవచ్చు. మరి ఇప్పుడు ఆయన లేరు. డిల్లీ వారికున్న బంగారు బాతు హైద్రాబాద్ ని U.T.  చేసే అవకాశం. దానికి తోడ్పడుతుంది సీమాంద్రులలోని అభద్రతా బావం. ఇప్పుడు రాష్ట్రం లో వారికి కావల్శింది ఆ బయాన్ని మరింత పెద్దది చేసి సీమాంద్రా సెటిలర్స్ ని, ఇతర కంపెనీల వారిని తమ చుట్టూ తిప్ప గలిగిన వారు. బహూశా ఆ పని ఎవరో లోపాయ కారీగా ఈ పాటికే చేస్తూ ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రే ఆ పని చేస్తే ఆయనే సీమాంద్రా నాయకుడు గా లీడ్ చేయొచ్చు కదా! మరి అటువంటి అవకాశం వదులుకునే వాడు మూర్కుడు కాక ఏమవుతారు అని డిగ్గీ రాజా గారీ ఉద్దేశ్యం.

  ఇక పోతే తెలంగాణా వారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేమి లేదు. ఎప్పటికైనా చైతన్యం ఉన్న వారు, చైతన్యం ఉన్నవారే, అది లేని వారు నష్ట పోక తప్పదు. నాటి తెలంగాణ సాయుద పోరాటం ఆంద్రా వారి సహాయంతో చేసారు కాబట్టి దానిని ఉద్దేస్య పూర్వకంగా విస్మరిస్తూ, నిజాములు, వారి ఘనకార్యాలే తమ ఉన్నతి అని ఎప్పుడైతే చంకలు గుద్దుకోవడం మొదలు పెట్టారో అప్పుడే కొంత మంది నాయకుల లోని బానిసత్వ బావనలు బయట పడ్డయి. తెలంగాణ ముద్దు బిడ్డ , దివంగత ప్రదాని కి డిల్లీ వారు చేసిన ద్రోహం గుర్తుకు తెచ్చుకుంటే ఈ తెలంగాణా రాష్ట్రాన్ని "కాంగ్రెస్" వారి చేతులు మీదుగా తీసుకోవడానికి ఇష్ట పడి ఉండే వారు కారు . పి.వి. నరసింహా రావు గారిని ఘోరంగా అవమానించిన సోనియా గాంది ముందు మోకరిల్లి తెలంగాణా బిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే వారు కారు.

  మీకు బి.జె. పి. కూడా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నపుడు అంత తొందరేందుకు? ఇన్నాళ్ళు ఆగిన వారు ఒక్క సంవత్సరం ఆగలేరా? తెలుగు ప్రదానిని అవమానించిన సోనీయా గాంది బిక్షగా తెలంగాణా తీసుకోవడం కంటే  ఆ అమరవీరుల స్తూపానికి తల బాదుకుని చావడం మంచిది. తెలంగాణా రావడమే కాదు, అది తెలంగాణ వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇచ్చేదై ఉండాలి. అలా రావటం లేదు తెలంగాణా. హైద్రాబాద్ కోసం ఆరాట పడే బడా బాబుల ఆకాంక్షలకు అనుగుణంగా  తెలంగాణా ఏర్పాటు అవుతుంది తప్పా అన్యదా కాదు అని తెలంగాణా పెద్దలనబడుతున్న వారు గ్రహిస్తే మంచిది.

   తెలుగు వారంటే గౌరవం లేని వారు, తెలుగువారి కోసం ఏమి చేసినా అది డిల్లీ వారి స్వార్దానికే తప్పా, తెలుగువారి కోసం కాదని ఇరువైపుల పెద్దలు గ్రహించి, సమస్యను హస్తిన లో కాకుండా తెలుగడ్డ మీదే కూర్చుని పరిష్కరించ్కుని తెలువారి ఆత్మ గౌరవాన్ని కాపాడవలసినదిగా తెలుగు బిడ్డలుగా అబ్యర్దించడం తప్పా మేము  చేయగలిగింది ఏముంది?        

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!