మితిమీరిన ప్రేమ అందుడినే కాదు హంతకుడిని కూడా చేస్తుంది!

                                                                       

  ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమించిన వారికోసం వారు ఏమైనా చేస్తారు. ఇంట్లో వారికి రూపాయి ఖర్చుచెయ్యడం ఇష్టపడనివారు సైతం ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతైనా దారపోస్తారు.కారణం వారిలో ఉన్నది స్వార్దం తో కూడిన ప్రేమ మాత్రమే. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. అలాంటి ప్రేమ తల్లినీ,చెల్లీనీ ,భార్యనీ ఒకేలా ప్రేమించేలా చేస్తుంది. కానీ మోహంతో కూడిన ప్రేమలో త్యాగం అనేది ఉండదు. తాను ఇష్టపడిన అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తారు. వారి కోసం అప్పు చేసైనా వారు కోరింది ఇస్తారు. కానీ అదే ప్రేమను ఎదుటి వారు తిరస్కరిస్తే అస్సలు ఓర్చుకోరు. అవసరమైతే తనకు దక్కనిది ఎవరికి దక్క కూడదనే ఉద్దేశ్యంతో  తాము ప్రాణాధికంగా ప్రేమించిన వరినే మట్టుబెడతారు. ఈ విషయం లో రక్తసంబందాలు కూడ అడ్డురావని తమిలనాడు  జరిగిన ఈసంఘటణ రుజువు చేస్తుంది.

  అతని పేరు తమిల్ సెల్వన్.ఉండేది కడలూర్ జిల్లాలోని పంచకుప్పం లో. అతనికి మహాలక్ష్మి అనే మేనకొడలు ఉంది. అతను తన  ఇరవైరెండవ యేట నుంచి అంటే అంటే మహాలక్ష్మి యుక్త వయస్కురాలు అయినప్పటి దగ్గరనుంచి ఆమె అంటే ఇష్టం పెంచుకున్నాడు. ఆ ప్రేమతో ఆమెకు అవసరమైనవి అన్నీ తనే కొనే వాడు. ఆమె చదువుకు కూడా సహాయం చేసే వాడు. దానికి మహాలక్ష్మి కానీ ఆమె తల్లి తండ్రులు కానీ అబ్యంతర పెట్టలేదు. అలా పదేళ్ళు గడిచాయి. ఆ తర్వాత సింగపూర్ లో ఉద్యోగం వస్తే సెల్వన్ కొంత కాలం ఉద్యోగం చేసి మేన కోడలుని పెండ్లి చేసుకుందామని కడలూర్ వచ్చాడు. తన మనసులోని మాటను తన అక్కా బావలకు చెప్పాడు. వారు వారి పెంద్లిక్ ఒప్పుకోలేదు. దానితో అతను మహాలక్ష్మికి నచ్చ చెప్పి ఒప్పించాలని చూశాడు. ఆ అమాయి కూడ అతన్ని చేసుకోవటానికి నిరాకరించింది. అంతే! అతనిలోని ప్రేమ ముసుగు తొలిగిపోయింది. స్వార్ద రాక్షసుడు ప్రత్యక్ష మయ్యాడు.

  కడలూరులో మహా లక్ష్మి చదువుతున్న కాలేజికి రెండు కత్తులు తీసుకుని వెళ్ళాడు సెల్వన్. ఆమె ఎదలో విచక్షణా రహితంగా పొడిచాడు. అది చూసిన విద్యార్దులు బయంతో చెల్లా చెదురయ్యారు. కోంత సేపు తర్వాత ఆమె స్నేహితులు స్తానికుల సహాయంతో ఆమెను హాస్పిటల్లో చేర్చారు. కానీ ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. హత్య చేసిన అనంతరం ఆ రక్తపు చేతులతోనే సెల్వన్ పోలిస్ స్టేషన్ కి వెళ్ళి తానే హత్య చేసానని, తను పదేళ్ళుగా మహాలక్ష్మి ని ప్రేమిస్తున్నాను అని, ఆమె కోసం తన సంపాదన దారపోశానని,బంగారు నగలు కూడా చేయీంచి ఇచ్చానని, కానీ చివరకు ఆమె తనతో పెళ్ళి నిరాకరించినందుకు తట్టుకోలేక  ఆవేశం లో చంపాను అని చెప్పాడు. పోలిసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్ కి పంపారు. అదీ కధ.

  పై ఉదంతం లో తప్పు ఎవరిది? పదేళ్ళుగా తమ పిల్లకి అవసరమైనవి సమకూర్చుతున్న మేనమామ ఏ ఉద్దేస్యంతో ఆ పని చేస్తున్నాడో తెలుసుకోలేని తల్లితండ్రులదా? తన మేన మామ మనసులో ఏముందో గ్రహించ లేని మహా లక్ష్మిదా?మహలక్ష్మి మనసులో ఏముందో తెలుసుకోకుండా గుడ్డి ప్రేమతో అన్ని అవసరాలు టిర్చి, ఆ తర్వాత తనతో పెళ్ళి తిరస్కరించినంత మాత్రనా స్వయంగా అక్క కూతురైన దానిని చంపిన సెల్వానిదా? తప్పు ఎవరిదైనా శిక్ష అందరూ అనుభవించక తప్పదు. కూతురిని కోల్పోయిన తల్లి తండ్రులు, నూరేళ్ళ జీవితం ఇరవైరెండేళ్లకే కొల్పోయిన మహ లక్ష్మి, కనీసం పదేళ్ళు అయిన జెయిల్ లో ఉండబోయే సెల్వన్ అందరూ బావుకున్నది ఏమిటి?

  మనుషుల్ని నడిపించేవి, శాసించేవి, కేవలం ఆర్దిక సంబందాలే కాదు, బావోద్వేగాలు కూడా, అని ఇలాంటి ఘటనలు వల్ల తెలుసుకోవాలి. తమ ఆడపిల్ల పట్ల శ్రద్ద చూపుతున్న మగ పిల్లలు పట్ల తల్లి తండ్రులు జాగ్రత్త వహించాలి. ఎదైనా ఉంటే మొదటే నిష్కర్షగా చెప్పాలి. పరిస్తితులు చేజారి పోయే దాక నిర్లక్ష్యం చేస్తే చివరకు కోలుకోలేని వేదన అనుభవించాల్సి ఉంటుందని పెద్దలు గ్రహించి ఆడపిల్లల్ని కాపాడుకోవాలి .     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!