"గొర్రె కొవ్విన కొద్దీ కసాయివాడికి లాభమే",అన్నట్లు ...........


                                                                 


 తెలంగాణా రాజకీయ నాయకులు ఊహిస్తున్నట్లు తెలంగాణా వారి మీద ప్రేమతోనో, కె.సి.ఆర్. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడనో ,"తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు" ప్రకటణ చేసి ఉండరు కేంద్రం వారు. ఒక వేళా కేవలం రాజకీయ లబ్ది కోసమే అయితే, తెలంగాణా లో అధికార పార్టీకి తెలంగాణ ఇచ్చినా సరే  పదిసీట్ల కంటే ఎక్కువ లోకసభ సీట్లు వచ్చే అవకాశం లేదు.మరి అటువంటి పదిసీట్ల కోసం పాతిక సీట్లు గ్యారంటీగా పోగొట్టుకునే సాహాసం చేస్తారా? ఒకవేళ జగన్ పార్టిని కలుపుకుందామనుకున్నా, లోపాయాకారీ ఒప్పందాలతో మద్దతు పొందుతామనుకున్నా,సీమాంద్రా ప్రజలు అంత అమాయకులా! తమ మనోభావాలను తీవ్రంగా గాయపరచిన కాంగ్రెస్ వారికి మద్దతు ఇస్తామంటె ఒప్పుకుంటారా? ఇంపాజిబుల్. మరి ఇంత ఆగమేఘాల మీద రాష్త్రాన్ని ఆగం ఆగం చెయ్యడానికి అసలు కారణం ఏమిటి?

  నేను ఇదివరకటి పోస్టుల్లోచెప్పిన విదంగా , హైద్రాబాద్ ని U.T   చేస్తే తప్పా తమకు, తమ ఆస్తులకు రక్షణ ఉండదన్న, మెజార్టీ హైద్రాబాదీయుల ఆకాంక్ష మేరకే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటణ జరిగింది అనుకోవాల్సి వస్తుంది. అందుకే సీమాంద్రలో అంతమంది ప్రజలు ఉద్యమం పేరుతో ముప్పై రోజులుగా రోడ్ల మీద ఉన్నా, వారిని సమాదాన పరచే చర్యలు చేపట్టకుండా రెచ్చగొట్టే ప్రకటణలే చేస్తుంది కేంద్ర సర్కార్. ఎందుకంటే, వారి ఉద్యమాన్ని బూచిగా చూపి హైద్రాబాద్ ని  U.T గా డిక్లేర్ చెయ్యాలన్నదే సర్కార్ వారి అసలు ఆలోచన.

  నిన్నట్టి విషయమే తీసుకుందాం. ఒక పక్కా సీమాంద్ర ఉద్యోగులు సేవ్ ఆంద్రప్రదేశ్ అనే నినాదం తో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, తెలంగాణా వారి నిరసనల మద్య రాష్ట్ర రాజ దానిలో బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తున్న సమయంలోనే, అటు దేశ రాజధానిలో షిండే గారు తెలంగాణ ఏర్పాటు లో మొదటి అంకం ముగిసింది, రెండవ అంకం మొదలైంది అని మీడీయా ప్రకటణ ఇవ్వడం రెచ్చగొట్టే ప్రక్రియలో బాగం కాదా? ఏ బాద్యత గల మంత్రి అయినా  అటువంటి ఉద్రిక్త పరిస్తితుల్లో ఆ ప్రకటణలు చేస్తారా? పోనీ తెలంగాణా వారిని సముదాయించడానికి చేశారేమో అని అనుకుందామనుకున్నా, ’హైద్రాబాద్ మీద మూడు ఆప్షన్ లు ఉన్నాయి, మేం దేనికి పరిమితం కాము" అని అంటారా? అంటే హైద్రాబాద్ ని తెలంగాణా ప్రజల  ఇష్ట ప్రకారం కాకుండా తమ ఇష్ట ప్రకారం చేస్తాం అనే గా అర్దం?

  రెఫు రాబోయే 2014  పార్లమెంట్ ఎన్నికలకి హైద్రాబాద్ సమస్య అధికార పార్టీ వారికి కల్పతరువు గా కనపడింది. హైద్రాబాద్ లో ఉన్న వ్యాపార వర్గాలను, సినిమా వర్గాలను ఉద్యమాల పేరుతో దందాలు చేస్తున్న వారి నుండి శాశ్వతం గా రక్షణ పొందడానికి,తెలంగాణా ఏర్పడితే హైదరాబాద్ లోని తమ ఆస్తుల విలువ సగానికి సగం తగ్గిపోతుందని బెంబేలెత్తున్న వారు, రియల్ ఎస్టేట్ వర్గాల వారు , ఇతర కంపెనీల వారు ఎంతటి ప్రతిపలం అయినా పార్టీ పండ్ గా ఇవ్వడానికి ఆయా వర్గాల వారు వెనుకాడక పోవచ్చు.కాబట్టి అటువంటి సువర్ణ అవకాశాన్ని ఒదులుకోవడానికి డిల్లీ వారు వ్యక్తిగతంగా కాని, పార్టి పరంగా కానీ సిద్దంగా లేరు. అందుకే ఈ ఆగ మేఘాల నిర్ణయాలు. ఇక ప్రజల ఆందోళన ల సంగంతంటారా. "గొర్రె కొవ్విన కొద్దీ కసాయివాడికి లాభమే",అన్నట్లు ఆందోళనలు ముదిరిన కొద్ది అధికార పార్టీకి లాభమే తప్పా నష్టం ఉండదు.ప్రక్రియలు అన్నీ పూర్తయిందాకా కాం గా ఉండి,అవసరమనుకున్నపుడు రాష్ట్రపతి పాలన పెట్టి తాను కోరుకున్నది చేస్తుంది. అప్పుడు హైద్రబాద్ ని U.T గా చేసినా, సీమాంద్రా వారి నుండి చాలా వరకు మద్దతు లభిస్తుంది కాబట్టి,  తర్వాత జగన్ పార్టీ ద్వారా రాహుల్ గాందీ ప్రదాని అవడానికి తగిన మద్దతు సంపా దిస్తుంది కాంగ్రెస్ . మొత్తానికి ఏతావాత జరిగేది ఏమిటంటే రాష్త్రం మూడు ముక్కలు , రాజకీయం ఆరు చెక్కలు అవుతుంది. అప్పుడు తెలుగు నాయకులంతా పార్లమెంట్ ముందు శివప్రసాద్ అండ్ పార్టీ చేసినట్లు, సోనీయమ్మను కీర్తీస్తూ   హాయిగా  చెక్క భజన చేసుకోవచ్చు.                

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )