అమాయకుడి పెళ్ళాం అందగత్తె అయితే ప్రతి అడ్డమైనోడి చూపూ దానిమీదే!


                                                                  



   "పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన, భూమీశుల పాలుచేరు భువిలో సుమతీ" అని చిన్నప్పుడు బడిలో పాఠాలు చదువుకున్నాం. అలాగే అమాయకుడికి ఒక అందమైన పెళ్ళాం ఉంటే వాడి కాపురం లో నిప్పులు ఎలా పోద్డామా అని చూసే అడ్డమైన వాళ్ళు మన సమాజం లో తక్కువేమి కాదు. ఇది కేవలం వ్యక్తులకే కాదు ప్రాంతాలకు, నగరాలకు  వర్తిస్తుందని మన హైద్రాబాద్ నగరం పరిస్తితి చూస్తే అర్దమవుతుంది.

   నిన్న జాతీయ చానళ్ళలో ప్రసారం అయిన కదనాలు చూస్తుంటే కేంద్రం వారికి హైద్రాబాద్ నగరాన్ని తమ పాలన లోకి తెచ్చుకోవాలని ఎంత తహ తహ గా ఉందో అర్దమవుతుంది. అందుకు చిరంజీవి గారి లాంటి నపుంసక రాజకీయ  నాయకుల వత్తాసు వారికి ఉంది. సీమాంద్రా సెట్టిలర్స్ కి  తెలంగాణా వారి పాలనలో రక్షణ ఉండదనే  విషయాన్ని పదే పదే ప్రచారాం చేస్తున్న సీమాంద్రా నాయకులు, అవును అదే నిజం అనేలా ప్రవర్తిస్తున్న తెలంగానా నాయకులు చివరకు వీరు చేసేదేమిటంటే  తెలుగువారి తెలంగాణా నగరాన్ని కేంద్రం వారి చేతికి అప్పచెప్పడం. "మేము చేత కాని సన్నాసులం, మేము నగర వాసులకు రక్షణ ఇవ్వలేము, మీరైతే యమ పోటుగాళ్ళు! మీ రక్షణ విదానాన్ని నిర్భయ ఉదంతమే చెపుతుంది. కాబట్టి మీ పాలనలోనే హైద్రాబాద్ ఉండాలి "అని సో కాళ్డ్ నాయకులంతా  కేంద్రానికి నగరం మీద హక్కులు రాసిచ్చేసినట్లుంది. వీరీ లోపాయకార ఒప్పంద పలితమే హైద్రాబాద్ కేంద్ర పాలిత ప్రాంత ప్రతిపాదన అని పిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజలను జో కొట్టడానికే, అసలు ఉద్ద్యేస్యం హైద్రబాద్ అప్పగింతే అనేది అర్దమవుతుంది.

  హైద్రాబాద్ దాని చుట్టుప్రక్కల ఉన్న బడా వ్యక్తులకు హైద్రాబాద్ తెలంగాణ లో ఉండటం ఇష్టం లేదు. ఇది మొన్నA.B.N   చానల్ వారు నిర్వహించిన సర్వే లో కూడా స్ఫష్టం అయింది. తెలంగాణ ఏర్పడితే తమ ఆస్తుల విలువ సగానికి సగం తగ్గిపోతుందనే భయం నగర వాసుల్లో మెజార్టి ప్రజలకు  ఉంది. కాబట్టి వారందరి సప్పోర్ట్ కేంద్రానికి ఉంటుంది. అసలు ఒక అనుమానం ఏమిటంటే అటు సీమాంద్రులు కాని, ఇటు  తెలంగాణ వారు కానీ హైద్రాబాద్ వాసులైన వారు లాబీయింగ్ నడిపి హైద్రాబాద్ ని ఈ ఎన్నికల గడువు లోపే U.T గా   మార్చాడా నికి కుట్ర చేసారని అనిపిస్తుంది. దీని కోసం ఒక వ్యూహం ప్రకారం తెలంగాణ ఏర్పాటు ప్రకటించి, సీమాంద్రులను రెచ్చగొట్టి తద్వారా పెల్లుబుకిన వారి నిరసనను శాంతింపచెయ్యడానికి మద్యే మార్గంగా  హైద్రాబాద్ ని  U.T  చెయ్యడానికి తెలంగాణ నాయకులను ఒప్పించేటట్లు నిర్ణయించి ఉంటారు. దీని కోసం కొన్ని వందల కోట్లు చేతులు మారి ఉండవచ్చు.

  అమాయకులైనా తెలంగాణా ప్రజలకు అర్వడం తప్పా, వారికి కుళ్ళు కుట్రలు తెలియవు అనేది అందరికి తెలిసిన విషయమే. సీమాంద్రులలో కూడా సామాన్యులలో హైద్రాబాద్ ని U.T  చెయ్యాలని  ఉండక పోవచ్చు. కానీ సేట్టిలర్స్ రక్షణ సాకుగ చూపీ అటు వారినీ ఒప్పియ్యడానికి రంగమ్ సిద్దం చేసి ఉంటారు. దానిలో బాగమే సీమాంద్రా కేంద్ర మంత్రుల U.T  రాగాలు. ఒక వేళా ఇదే జరిగితే తెలుగు వారు చరిత్ర హీనులవుతారు. తెలంగాణ నాయకులు నపుంసక రాజకీయ నాయకులని కీర్టించబడతారు. తెలంగాణా ప్రజలు అమాయకులు కాబట్టి వారి సంపన్న అందమైన నగరం మీడ కేంద్రం కన్ను పడింది. దానికి దళారీ నాయకుల ద్వారా కోట్ల ఫండ్ లబిస్తుంది.అటు డబ్బుకి డబ్బు , నగరానికి నగరం అప్పనంగా దొరుకుతుంటే  వద్దనే పాలకుడు ఎవరు? అందుకే కాంగ్రెస్ వారికి అంత తహ!తహ!.    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం