ఓరీ దేవుడో ! ఈ అమెరికా వాళ్ళు నన్ను మిస్సమ్మని చేసారు ... రో...

                                                                    
 పై పోటో లోని అమ్మాయి పేరు నీనా  దావులూరి . మొన్న అమెరికాలో జరిగిన అందాల పోటిలో "మిస్ అమెరికా " గా ఎన్నికై న  N.R.I . ఈమె మిస్ అమెరికాగా ఎన్నిక కావడానికి కారణం ఆమె బౌతిక సౌందర్యం కాదట . ఆమె గారిలోని మానసిక సౌందర్య మేనట ! తను  బౌతిక సౌందర్యం కన్నా ,   మానసిక సౌందర్యానికే ప్రాదాన్యత ఇస్తానని , ఒక ప్రశ్నకు బదులుగా ఆమె ఇచ్చిన సమాదానానికి  జడ్జ్ ల మైండ్ బ్లాంక్ అయి ఆమెకు కిరీట దారణ చేసారట !
 (అంతేనా , మైండ్ బ్లాంక్ అయి వేరెవరికో ఇవ్వాల్సినది ఈమెకు ఇచ్చారా }. సరే ఏదైతేనేం , కనిపించే బౌతిక సౌందర్యంని కాదని కనిపించని మానసిక సౌందర్యానికే "మిస్ అమెరికా " పట్టం కట్టారట అమెరికన్లు .

  మరి రేపట్నుంచి అడ్వర్టైజ్ మెంట్ల కోసం ఈ  "మిస్ అమెరికా " గారు కనిపించే బౌతిక సౌందర్యం ని ప్రదర్శిస్తారా లేక కనిపించని మానసిక సౌందర్యాన్ని ప్రదర్శిస్తారా ? అసలు ఈ "  మిస్"  ల పోటిల ఉద్దేస్యం పక్కా వ్యాపారం . ఇండియా లాంటి అతి పెద్ద మార్కెట్ లో విదేశి  కంపెనీలు  తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి  ప్రచార సాదానాలుగా  అమ్మాయిలను ఉపయోగించే ప్రక్రియలో బాగమే అందాల పోటిలు . పొద్దున్న లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకో బోయే వరకు ముఖాలకు ఆ క్రీమ్ ,ఈ క్రీమ్ పూసుకుంటూ , ఒంటి సౌందర్యం చూసి మురిసి పోయే వారు మానసిక సౌందర్యం గురించి చిలక పలుకులు పలుకుతుంటే ,చెవిలో పువులున్న వారు నమ్మితే నమ్మొచ్చు గాక . ఆమె తల్లి తండ్రులు విజయవాడ నుంచి వెళ్లి  అమెరికాలో స్తిర పడిన వారు కాబట్టి ఆ అమ్మాయికి అంటే భారత సంతతికి చెందిన వారికి "మిస్ అమెరికా " వచ్చిందని గర్వించాలా ? లేక కంపెనీల వ్యాపార ఉత్పత్తుల ప్రచార అవసరాలకు ఒక తెలుగు అమ్మాయి యొక్క కనిపించే అందాన్నే కాక కనిపించని అందాలను (మానసిక సౌందర్యం } కూడా వాడుకుంటునారే అని చింతించాలా ?

  నాకైతే పాపం పై పొటోలో ఆ అమ్మాయిని చూస్తుంటే 'ఓరీ దేవుడో ! ఈ  అమెరికా వాళ్ళు నన్ను మిస్సమ్మని  చేసారు ... రో." అని అరుస్తూ విలపిస్తున్నట్లుంది . మరి మీకేమనిపిస్తుంది ?

       

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం