"పశువుల గడ్డి మేసినందుకు పదిహేడేల్లకి శిక్ష విదించారట!



                                                                  


 ఈ దేశం లో కేవలం ఒక్క న్యాయస్తానాలు మాత్రమే అవినీతి గడ్డి తీంటున్న పెద్దలను నిష్కర్షగా జైల్ లోకి పంపి, ఈ దేశం కోసం తపించే వారిని అప్పుడప్పుడు ఆనందపరుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. 'ఈ దేశం ని ఎవరూ బాగు చెయ్యలేరు, అవినీతి అనేది సర్వసాదార్ణం విషయం' అని మన దేశం లో పామరులు నుంచి మేదావులు
 దాకా  ఒక ద్రుడ నిర్ణయానికి వచ్చే శారు.  దీని వలన అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులలో కానీ, అధికారులలో కాని చట్టం అంటే ఏ మాత్రం భయం లేకుండా పోయింది. అవినితి పరులకు జనం నీరాజానాలు పట్టి ఎన్నికలలో గెలిపిస్తుంటే తాము చేసే పనికి ప్రజామోదం ఉంది అని అవినీతి పరులు బుకాయిస్తూ, అధికార దర్పం వెలగపెడుతుంటే చట్టం అంటే గౌరవం ఉన్నవారు, మనది ఖచ్చితంగా ఒక పద్దతి గల ప్రజాస్వామ్య దేశం అని బావిస్తున్న వారు విస్తుపొతున్నారు.కొంత మంది  ప్రజలు అవినీతి పరులను ఆరాదించడం చూసి,ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రద్దుచేసి,  కొంతకాలం నియంత్రుత్వ పాలన వస్తే బాగుండు అని కోరుకునే వారి సంఖ్య రోజు రోజుకు అదికమవుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి వారే ఎన్నికలలో వోటింగ్ లో పాల్గొనటం లేదు. వీరి సంఖ్య అవినీతి పరులను ఆరాదించే వారి కంటే అధికంగానే ఉన్నప్పటికి, అవినీతి పరులకు ఉండే అర్దబలం,అంగబలం, హింసారాజకీయ బయంతో వీరెవరూ తమ గొంతు విప్పడానికి సాహాసించ లేక పోతున్నారు. అందుకే అవినీతి పరులు ఆడింది ఆటగా, పాడింది పాటగ, చెప్పింది శాసనం గా వర్దిలుతున్నాయి.

  ఉదాహరణకి బీహార్ మాజీ ముఖ్య మంత్రి శ్రీ లాలూ ప్రసద్ యాదవ్ నే తీసుకుంటే, ఆయన మీద 1997  లో పశువుల దాణా కుంభకోణం కేసు నమోదు అయితే తన ముఖ్య మంత్రి పదవిని బార్యకు అప్పచెప్పి తను సెంటర్ రాజకీయాలలో సెటిల్ అయ్యాడు. మరి అటువంటి లాలూ ప్రసాద్ ని బీహారియులు తలమీద పెట్టుకుని పూజించినా , ప్రత్యేక సి.బి.ఐ. కోర్తూ వారు ఈ రోజు ఆయన్నిఆయనతో పాటు మరో మాజీ ముఖ్య మంత్రి, అతున్నత స్తాయి అధికార్లు దోషులుగా తేల్చి, జెయిల్ కి పంపించారు. అంటే సుమారు పదిహేడేల్లపాటు ఒక నేరస్తుడిని నాయకుడి గా అంగీకరించాల్సిన దౌర్బాగ్య స్తితి ఈ దేశ ప్రజలకు పట్టింది అంటే ఇదేనా మన పూర్వికులు కోరుకున్న మరియు మనం కోరుకుంటున్న ప్రజ స్వామ్యం! ?మొన్న జయ ప్రకాష్ నారాయణ్ గారు ఒక విషయం గురించి మాట్లాడుతూ, తీవ్ర ఆరోపణలు ఉన్న ఆర్దిక నేర కేసులను సత్వర విచారణ చేసి, నిజాన్ని నిరదారించవలసిన అవసరం ఉండంటే కొంత మంది ఆయన మీద ఇంతెత్తున ఎగిరి పడ్డారు. మరి ఈ రోజున లాలూ గారి కేసు వలన మనకు తెలిసేదేమిటీ? దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు, నేరం జరిగిన పదిహేడేల్లకు నేర్స్తుడినిశిక్షిస్తే ఇన్నాల్లు ఆ నేరస్తుడు ఈ  దేశ విదాన నిర్ణయాలలో  పాలు పంచుకున్నాడంటే ఆ పాపం ఎవరిది?

   సామజిక స్ప్రుహ ఉన్న ప్రజలు జరుగుతున్న పరిణామాలు చూస్తూ, మనసు రంపపు కోతకు గురవుతున్న మౌనంగా ఉన్నారంటే వారిలోని ఆశావాదం.  ఆ ఆశ చచ్చిన వారు, శాంత స్వబావులు నిరాశతో  ఉన్నా, తీవ్ర స్వబావం గలిగిన వారు తీవ్ర వాద ఉద్యమాల పట్ల  ఆకర్షితులై అందులో చేరుతున్నారు.కాబట్టి, ఈ దేశంలో తీవ్ర వాదం పట్ల యువత ఆకర్షితులు కాకుండా ఉండాలంటే, ఈ దేశం లో సత్వరనేర విచారణ కూడా సహకరిస్తుంది అనేది నిర్వివాదాంశం. నేరం జరిగిన ఆరునెలల లోపు నేరస్తులను శిక్షించే విదానం అమల్లో ఉంటే ,ఈ దేశం లో మరీ ఇంతగా ఆరాచక శక్తులు పేట్రేగి పోవడమనేది జరుగదు.ఒక దేశ  నాగరికత స్తాయి అంచనా వెయ్యడానికి ఆ దేశం లో అమలులో ఉన్న నేర విచారణా విదానం, నేర కట్టడి విదానం కూడా పరీశీలనాంశాలు అవుతాయి.

  నేరం చేసిన పదిహేడేళ్ళకి నేరస్తుడ్ని శిక్షించినా,నిష్పాక్షిక  విచారణ జరుపకుండ శిక్షించినా, రెండూ ప్రజాస్వామ్య వ్యవస్తను అవమానించేవే.ప్రజాస్వామ్యంలో ప్రజలకు తమ నాయకులు ఎటువంటి వారో తెలుసుకునే హక్కు ప్రాదమిక మైనది. దానిని "పెండింగ్ కేస్" అనే ముసుగు వేసి, నేరస్తులను ఎన్నుకునే లా చెయ్యటం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం. అందుకే"ఫాస్ట్ ట్రక్" కోర్టులను ఏర్పాటు చేసి ఈ  దేశంలో ఉన్న రాజకీయ నాయకుల కేసులను "లిస్టెడ్ కేస్" లుగా గుర్తిస్తూ  గరిష్టం గా ఆరునెలల్లో తేల్చి వేసేలా  చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.          

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!