గోవిందా..గోవిందా! యాబై వేల కోట్లు ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందా!



                                                                   


 మన సర్కార్లు ఎంతో ప్రతిష్టాత్మకం అని  చేసే కొన్ని కొన్ని పనులు చూస్తుంటే, అవి చిత్తశుద్దితో చేసేవా లేక అస్మదీయులకు లబ్ది చేకూర్చాలని ఎవరో ఇచ్చిన సలహాలను ముందు వెనుక ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాలా అని అనిపిస్తుంది. అలాంటిదే నిన్న సుప్రీం కోర్టు వారు చెల్లదని కొట్టివేసిన ఆధార్ కార్డులను తప్పనిసరిచేసే ప్రక్రియ.

  గ్యాస్, విద్యుత్, తాగునీటి కనెక్షన్ లకే కాక, ఇక బవిష్యత్ లో ఏ ప్రభుత్వ సేవలను పొందాలన్నా "అధార్ కార్డు" అనేది కంపల్సరీ అని కేంద్ర ప్రభుత్వం వారు  ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాలను నానా హైరాన పెట్టారు.  గాస్ సబ్సీడి పొందాలంటే ఆదార్ కార్డు ఆదారంతో తెరచిన బాంక్ ఖాతా వివరాలు అందచేయాలని, పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రం లోని అయిదు జిల్లాలను ఎంపిక చేసామని, కాబట్టి ఆ యా జిల్లాల ప్రజలు మే లోపు ఆధార్ వివరాలు వివరాలు అటు బాంక్ లో నమోదు చేసుకుని ,అట్టి ఖాతా వివరాలను గాస్ డీలర్ కి  ఇవ్వాలని లేదంటే 'సబ్సిడి కట్' అంటె ఆధార్ అందని ప్రజలు, ఇంకా అధార్ అప్లై చేయని ప్రజలు ఆందోళన చేసారు. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు ఇప్పటికి రెండు సార్లు అనుకుంటా కేంద్ర ప్రభుత్వం గడువు తేదీలను పొడిగించింది. అటువంటి ప్రతిష్టాత్మక ఆదార్ ప్రాజెక్టు సుప్రీం కోర్టు వారి తీర్పుతో నిరాదారమై పోయింది.

  "పౌరులుకు నిత్యావసర సేవలు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కోసం పట్టు బట్టడం పౌరుల ప్రాదమిక హక్కుల ఉల్లంఘణే" అని సర్వొన్నత న్యాయ స్తానం కుండ బద్దలు కొట్టింది. ఈ కేసులో  కేంద్ర సర్కార్ వారి ఏకైక డిఫెన్స్ ఏమిటంటే "మేము ఈ ప్రాజెక్టు కోసం యాబై వేల కోట్లు ఖర్చు పెట్టాము" అని మాత్రమేనంట!అంటె ప్రజల ప్రాదమిక హక్కులను ఉల్లంఘించే ఒకానొక పధకాన్ని ప్రభుత్వం ప్రెస్టేజియస్ గా బావించడమే కాక, దాని కోసం యాబై వేల కోట్లు ఖర్చుపెట్టిందన్న మాట!ఇదే కేసు వాదనల సందర్బంగా కేంద్ర కార్డుల జారీ అదార్టీవారు (UIDIA)   అన్నదేమిటంటే , ఆధార్ కార్డు తీసుకోవడం అనేది నిర్భందం కాదు పౌరుల ఇష్టం మీద అధారపడే సచ్చందం అది అని. మరి ఇంతోటి దానికి ప్రజలను ఇంత హైరానా పెట్టడం ఎందుకని కూడా సుప్రీం కోర్టు వారు పై విదంగా తీర్పు ఇచ్చారు.

  చూడపోతే, త్వరలో కేంద్ర కుంభకోణాల లిస్ట్ లో అదార్ కూడా చేరపోతుందనుకుంటా. చిత్తశుద్ది లేని సర్కార్ వారి పనులు చివరకు చేరేది అవినీతి కూపంలోకే అన్నమాట! అయినా ఒకర్ని అని ఏం లాభం! ప్రజలే ఎగబడి అవినీతి సామ్రాట్ లకు పట్టం కట్టడానికి తెగ ఉత్సాహా పడిపోతుంటేను!యదా ప్రజా! తదా ప్రజాసేవకా!     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన