తాము పని చేసే ఇల్లు ఇలాగే ఉండాలి,అని కోరే హక్కు సేవకులకు ఉంటుందా?

                                                             
                                                              


  ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల కుటుంభాలు కలిసి ఉంటున్నాయి. ఆ ఇంట్లో పని చెయ్యడానికి సేవకులు అంటే పనిమనుషులు ఉన్నారు. ఆ ఇంట్లో అన్నదమ్ములకు ఏవో మనస్పర్దలు ఏర్పడి తమ్ముడు విడిపోద్దాం అంటుంటే, అన్న కలిసి ఉందాం అంటున్నాడు. తమ్ముడుకి సప్పోర్ట్ గా కోంతమంది సేవకులు ఇంటిని విభజించాల్సిందే అని గొడవ చేస్తుంటే, అన్న వైపు సేవకులు లేదు, లేదూ ఇంటిని ఉమ్మడిగా ఉంచాల్సిందే అని గొడవ చెయ్యటం మొదలు పెట్టారు. చివరకు అది ఎంత కాడికి వెళ్లిందంటె,అసలు ఓనర్లు తగ్గి ఉంటున్నా, కొసరు సేవకులు రోడ్లెక్కి కొట్లాడు కుంటున్నారు.

 ఇంటిని విడదీయాల, వద్దా అనేది ఓనర్లైన అన్నదమ్ముల  ఇష్టం . సేవకులకు ఉండే హక్కు ,తమకు నచ్చిన ఇంట్లో పని చెయ్యడమే కాని, తమ సౌలబ్యం కోసం ఆ అన్నదమ్ములు తాము చెప్పిన విదంగానే ఇంటిని ఉంచాలి అనే హక్కు ఎక్కడిది? ఒక వేళ ఇంటిని విభజించిన తర్వాత , తమకు నచ్చిన ఇంట్లో పని చేసే హక్కు సేవకులకు ఉంటుంది. కానీ ఓనర్ల గొడవలో తాము తల దూర్చి, ఇంటి పరువును రచ్చకీడ్చడం ఎంతవరకు సమంజసం? ఎవరి హద్దులు వారు ఎరిగి మసలుకోవడం అందరికి మంచిది.

 సీమాంద్రా, తెలంగాణా ఉద్యోగులు తమ పరిదిని అతిక్రమించి ప్రవర్తిస్తున్నారు అని పిస్తుంది. అసలు తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎలా కన్వీనర్ అయ్యాడొ, నాకర్దం కావడం లేదు. ఒక పక్కా ప్రభుత్వ నుండి జీతం పొందుతూ, పూర్తీ కాలం రాష్ట్రాన్ని విడగొట్టే పదకాలు రచిస్తుంటే ప్రభుత్వం ఒక్క బాద్యత ఏమిటి? నిజంగా ప్రభుత్వ అంగీకారం లేకుండా పబ్లిక్ గా ఇలాంటి పనులు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారా? రాష్ట్ర ప్రజల మద్య తంపులు పెట్టి, తమాషా చూస్తున్న, అధికార పార్టీ దీనికి పూర్తి బాద్యత వహించాల్సి ఉంటుంది. ఒక వేళ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలనుకుంటే వారు సామాన్య ప్రజలు అయినా కావాలి, లేదా వారి తరపున మాట్లాడే ప్రజా నాయకులు, ప్రతినిదులు అయిన అయి ఉండాలి. కాబట్టి, ఇంట్రస్ట్ ఉన్నవారు తాము చేసే ఉద్యోగాలకు రాజీ నామా చేసి ప్రజల తరపున పోరాడవచ్చు. అంతే కానీ, ప్రజల సొమ్ము తింటూ, పనులు ఎగ్గొట్టి, ప్రజాసేవ కోసం అనే వంక తో తంపులు పెట్టే కార్యక్రమాలు చేస్తుంటే చేత కాని ప్రభుత్వాలు అయితే తప్పా, ఎవరూ ఊరుకోరు. చేత కాని ఓనర్లను  చెప్పు చేతల్లో పెట్టుకుని పనిమనుషులు ఆడింది ఆటగా , పాడింది పాటగా సాగే కొంప ఎలా ఉంటుందో , అలా ఉంది మన రాష్ట్ర పరిస్తితి .

  అయినా ఉద్యోగులకు తమకు నచ్చిన రాష్ట్రంలో పని చేసే హక్కు ఉంటుందని ఆంద్రప్రదేశ్ హైకోర్టు వారు వ్యాక్యానించటమే కాక, తాము ఉద్యమలు చెయ్యాలంటే, ఉద్యోగాలు మానేసి ఆ పని చెయ్యండని కూడ చెప్పింది. కానీ రాజకీయాలకు తప్పా రాజ్యాంగానికి విలువ ఇవ్వని వారికి ఎన్ని చెప్పినా భధిర శంఖారావమే!.        

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన