ఎర్నాకులం వెళ్ళాల్సిన ట్రైన్ , డ్రైవర్ కు తెలియకుండానే గుల్బర్గా వెళ్లి గుండె గుభేలు మనిపించిoదట!
మొన్న మంగళ వారం జరిగిన ఈ రైలు ప్రయాణం ఉదంతం వింటే కొంచం నవ్వుతో పాటు బోల్డంత అశ్చ్యర్యం కూడా కలుగుతుంది . ఆసియాలోనే అతి పెద్దదైన ఇండియన్ రైల్వేస్ అధ్వర్యంలో నడచే రైలు ఒకటి వెళ్ళాల్సిన గమ్యం వెళ్ళకుండా సుమారు 300 కిలోమీటర్లు తప్పుడు దారిలో వెళ్లి , తెల్లారే తాము చేరుకున్న స్టేషన్ చూసి సదరు ట్రైన్ డ్రైవర్ తెల్లముఖం వేసాడు అంటే , ఘనత వహించిన ఇండియన్ రైల్వేస్ లో ఎంత నిర్లక్ష్యం కొనసాగుతుందో ఇట్టే అర్దమయి పోతుంది . వివరాలు లోకి వెళితే మొన్న సోమవారం , గుజరాత్ లోని ఒఖా స్టేషన్ నుండి ఒఖా-ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ఎర్నాకులం బయలు దేరింది . అది మంగళ వారం రాత్రి 10-30 గంటలకు ఎర్నాకులం చేరుకోవాల్సి ఉండగా , రాంగ్ సిగ్నల్స్ పుణ్యమాని దారి తప్పి , చివరకు 28 గంటలు పైగా లేటుతో ఎర్నాకులం చేరిoది అట. దారి మద్...