ఎర్నాకులం వెళ్ళాల్సిన ట్రైన్ , డ్రైవర్ కు తెలియకుండానే గుల్బర్గా వెళ్లి గుండె గుభేలు మనిపించిoదట!


                                                                     

మొన్న మంగళ వారం జరిగిన ఈ  రైలు ప్రయాణం ఉదంతం వింటే కొంచం నవ్వుతో పాటు బోల్డంత అశ్చ్యర్యం కూడా కలుగుతుంది . ఆసియాలోనే అతి పెద్దదైన ఇండియన్ రైల్వేస్ అధ్వర్యంలో నడచే రైలు ఒకటి వెళ్ళాల్సిన గమ్యం వెళ్ళకుండా సుమారు 300 కిలోమీటర్లు తప్పుడు దారిలో వెళ్లి , తెల్లారే తాము చేరుకున్న స్టేషన్ చూసి సదరు ట్రైన్ డ్రైవర్ తెల్లముఖం వేసాడు అంటే , ఘనత వహించిన ఇండియన్ రైల్వేస్ లో ఎంత నిర్లక్ష్యం కొనసాగుతుందో ఇట్టే అర్దమయి పోతుంది . వివరాలు లోకి వెళితే

             మొన్న సోమవారం , గుజరాత్ లోని ఒఖా స్టేషన్ నుండి ఒఖా-ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ఎర్నాకులం బయలు దేరింది . అది మంగళ వారం రాత్రి 10-30 గంటలకు ఎర్నాకులం చేరుకోవాల్సి ఉండగా , రాంగ్ సిగ్నల్స్ పుణ్యమాని దారి తప్పి , చివరకు 28 గంటలు పైగా లేటుతో ఎర్నాకులం చేరిoది అట. దారి మద్యలో పన్వెల్  స్టేషన్ దగ్గర వారికి తెలిసిందేమిటంటే  పైన రత్నగిరి అనే స్టేషన్ వద్ద ట్రైన్ ఏక్సిడెంట్ ఒకటి జరగడం వలన , పూణే నుండి ట్రైన్ ను ఇతర మార్గం ద్వారా మళ్ళించి , గోవా సమీపంలో అసలు రూటు కి కలుపుతారని . కాని జరిగింది ఏమిటంటే పూణే దగ్గర రాంగ్ సిగ్నల్ వలన గోవా వైపు వెళ్ళ వలసిన ట్రైన్ , కర్నాటక లోని గుల్భార్గా వైపు ప్రయాణించి , తెల్లారే పాటికి షోలాపూర్ వెళ్లిందట . తెల్లారే నిద్ర లేచిన ప్రయాణికులు షోలాపూర్ ని చూసి బిత్తరపోయి స్తానిక స్టేషన్ మాస్టర్ కి విషయం చెపితే , అయన పై అధికారులను సంప్రదించి , ట్రైన్ రాంగ్ రూటులో వచ్చిందని రూడి చెయ్యడమే కాకుండా , "అయిందేదో అయింది , ఇక్కడనుండి ముందు గుంతకల్  నుండి హుబ్లి మార్గం ద్వారా పంపిస్తాం అని గుల్బర్గా దాక వెళితే , అక్కడ రైల్వే అధికారులు , ట్రైన్ ను వెనుకకి మల్లి పూణే పంపి , అకడనుండి ఎర్నాకులం పంపుతాం అన్నాడట . అలాగే ప్రయాణం చాల్లే అనుకున్న వారికి పూర్తీ సొమ్ము వాపసు ఇస్తాం అంటే ,దగ్గరి గమ్య స్తానాలకు చెందిన చాలా మంది "చాల్లే సంబడం "అనుకుంటూ డబ్బు వాపసు తీసుకుని 'బ్రతుకు జీవుడా " అనుకుంటూ బస్సులకి వెళ్ళిపోయారు అట .
                      నిజంగా అ రోజు అ ట్రైన్ లో ప్రయాణం చేసిన ప్రయాణికులు నరకం అంటే ఏమిటో చవి చూసారట . టాయిలెట్లో నిరు అయి పోయి , పసి పిల్లలతో ప్రయాణం చేసే వారి బాదలు వర్ణనాతితం అట . అదే బస్ డ్రైవర్ అయితే బాది  పారేసే వారే కాని , అంత గొప్ప రైల్వేస్ లో ఎవరిని బాదాలో తెలియక , ఎవరి జుట్టు వారే పిక్కుని , మీరు వద్దు , మీ రైళ్ళు వద్దు అంటూ , చివరకు టికెట్ సొమ్ము కూడా , క్యూలో నిలబడి తీసుకునే ఓపిక లేక , ఊస్సురూ అనుకుంటూ బస్సులకి వెళ్లి పోయినా అ ప్రయాణికులని చూస్తుంటే ఎవరికైనా జాలి కలుగక మానదు . మరి అ జాలి ఇండియన్ రైల్వేస్ వారికి ఎ మాత్రం ఉన్న బావిష్యత్  లో ఇటువంటి బుద్ది  తక్కువ పనులు చేయరని ఆశిద్దాం .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!