ఏ వంకా దొరకని వారు , "పెళ్ళాం" వంక చూపిస్తున్నారు !

                                                                             

శ్రీ మాన్ నరేంద్ర మోడీ ! భారతీయ జనతా పార్టి యొక్క ప్రదాని అబ్యర్ది . ప్రస్తుత గుజరాత్ ముఖ్య మంత్రి అయిన అయన గుజరాత్లో తను చేపట్టిన పాలానా సంస్కరణల వలన , గొప్ప అభివృద్దిని సాదించి అటు ప్రజలలోనే కాక , ఇటు ప్రతిపక్షాలలో సైతం "మోడీ మార్క్ " పాలన అనే నమూనా తో ప్రశంసలు  పొందారు . అయితే అయన నేతృత్వం వహించే పార్టి భారతీయ జనతా పార్టి కాబట్టి , అ పార్టికి ఉన్న వర్గ శత్రువులు అటో మాటిక్ గా మోడి గారికి శత్రువులు అయిపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు . రాజకీయ నాయకులు అంటే 'ఇంట్లో పైసాకు పనికిరాకపోయినా , వీదిలో పెద్ద పోజు కొట్టే అవకాశ మున్నవారు కాబట్టి వారు ఎవరినైనా , ఏ  విదంగా నైనా విమర్శిస్తారు . నిజంగా మోడీ గారితో సిద్దాంత పరమైనా లేదా పార్టి పరమైన అంశాలతో విబెదిమ్చే వారు ', అ అంశాల మిద ఆయనని విమర్శిస్తే హుందాగా ఉంటుంది . అంతే కాని ఎ వంకా దొరకనట్లు , అయన గారి భార్యా విషయం ని ప్రదాన అంశం చేసి , ఇప్పటివరకు  ఏంతో గౌరవంగా బ్రతుకున్న ఒక భారతీయ స్త్రీ గౌరవ మర్యాదలుని నిచ రాజకీయాలకు వాడుకోవడం అత్యంత గర్హనియమ్.

    గత ఎన్నికల సమయాలలో ఎలెక్షన్ కమిషన్ యొక్క ఉదార దోరణి వలన మోడీ గారు తన భార్య పేరును అఫ్ఫిడవిట్ లో ప్రస్తావించాల్సిన అవసరం లేకుండా పోయింది . కాని ఈ సారి ఖచ్చితంగా నిభందనలు పాటించాల్సిందే అని చెప్పడం వలన , తన భార్య పేరును "జశోదాబెన్" అని అఫ్ఫిడవిట్ లో చెప్పడం జరిగింది . అంతే !ఒక్క సారిగా వైరి పక్షాల వారు, ఆమె మిద జాలి చూపుతున్నట్లు నటిస్తూ , అయన మిద దాడి కి ఉపక్రమించారు . ఒక నాయకుడు అయితే ఏకంగా ఆమెకు "భారత రత్న" ఇవ్వవచ్చు అని ప్రకటించి, ఆమె పట్ల తన సానుభూతిని తెలిపాడు . నిజంగా ఈ చెత్త రాజకీయ నాయకుల సానుభూతి పొందాల్సినంత  దౌర్బాగ్య స్తితిలో ఆ మహా సాద్వి ఉందా? ఒక్క సారి చూద్దాం .

                     జషొదా బెన్ !. పుట్టింది 1952 లో అహ్మదాబాద్ కి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మన్ వాడ లో . ఆమెకు 17 యేండ్ల వయసులోనే అప్పటికి 18 యేండ్ల వయసున్న నరేంద్ర మోడీ గారితో వివాహమైంది . ఇది  మైనర్ ల మద్య వివాహం కాబట్టి ,చట్ట పరంగా వైడబుల్ మారేజ్ . అంటే ఇరువురిలో ఎవరైనా అ వివాహం ని రద్దు చేసుకోవచు . ఏ  కారణం వలనో పెండ్లి అయిన నెలలలోపే జషోదా బెన్ గారు పుట్టింటికి వచ్చేశారు . అప్పటి నుండి ఆమె గారికి మోడీ గారితో సంబందాలు లేవు . ఆమె గారు పుట్టింటిలో ఉండే మేత్రికులేషణ్ పూర్తీ చేసి , టిచర్ ట్రైనింగ్ చేసారు . అ తర్వాత టిచర్ గా పని చేస్తూ , 4 సంవత్సరాల క్రితమే రిటైర్ అయ్యారు . మోడీ గారు ఆమె గురించి ఎక్కడా చెప్పకునా ఆమె మాత్రం మోడీ గారి గురించి ఎ విషయం తన తోటి వారిలో దాచలేదు . భార్యా భర్తల బందం అంటే కేవలం శారీరకం కాదని , అది అచ్చంగా మానసిక పరమైనదని నాడు రామాయాణం లో సీతమ్మ తల్లి రుజువు చేస్తే , నేటి భారాతాయణం లో "జషోదా బెన్ " గారు రుజువు చేసారు .
             జశోదా బెన్ గారు గొప్ప శివ భక్తురాలు . ఆమె గారు తన పూజా మందిరంలో అ శివ భగవానునితో పాటు నరేంద్ర మోడీ గారి పోటోను పెట్టి ఎంతో భక్తితో రోజూ పూజ చేస్తున్నారట ! అంటే మోడీ గారి మిద ఆమెకు ఉన్న ఆరాధన బావానికి అదే ప్రత్యక్ష సాక్ష్యం . మోడీ గారు 2014 ఎన్నికలలో గెలవాలని కూడా ఆమె నిత్యం పూజలు చేస్తుందట . మరి అటువంటి మహా సాద్వి ఈ తలకు మాసిన రాజకీయ నాయకుల సానుభూతి అవసరమా? మోడీ గారు కూడా ఆమెకు తన పట్ల ఉన్నఅభిప్రాయం మరొకసారి తెలుసుకున్నాకనే ఆమె పేరు అఫిడవిట్లో ప్రకటించారు . ఆమె ను తప్పా వేరొకరిని తలువని పెండ్లి అయిన బ్రహ్మచారి అయన . ఇలా ఒకరి కోసం ఒకరు పుట్టినప్పటికీ , బహుశా శని గ్రహ ప్రబావం వలన కాబోలు ఇరువురూ మానసికంగా ఒకటైనప్పత్తికి , బౌతికంగా విడిగా ఉండి పోయారు . మరి అటువంటి దంపతులు గురించి అవాకులు చవాకులు పేలడం  సంసారులకు మంచిది కాదు .

         ఇంట్లో రంభ లాంటి బార్య లున్నా , పర స్త్రీల వ్యామోహంతో నిత్యo వారి కోసం వెంపర్లాడే కొంత మంది రాజకీయ నాయకుల బాగోతం బహిర్గత పరస్తే వారి బ్రతుకులు బస్ స్టాండే ! అందుకే మొన్న కొంత మంది తెలుగు నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ వ్యక్తీ గత జీవితాన్ని హేళన చేయపోతే , "డిల్లీలోమీరు గడుపుతున్న గలిజ్ జీవితాలను బయట పెడతాను " అని పవర్ స్టార్ బెదిరించేసరికి ఒక్కడంటే ఒక్కడూ నోరెత్తితే ఒట్టు . కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైనా సరే మీ పార్టీలు గురించి , మీ పాలనలు గురించి కోటి సార్లు విమర్సిo చుకొండి . ఎవ్వరికి అబ్యంతరం ఉండదు . కాని భార్యా భర్తల విషయాలు , కుటుంబ విషయాలు ప్రస్తావిo చే అర్హత ఎవ్వరికి లేదు . చట్ట ప్రకారం కూడా బాదిత బార్యకి మాత్రమె ఉంది . అది మరచి కుటుంబ స్త్రీలను ఏదో రూపంలో విదుల్లోకి తేవాలని చూస్తె మీకు పడేవి ఓట్లు కాదు, చెప్పు దెబ్బలే!
       ఇది నరేంద్ర మోడీ గారి మిద అభిమాన0 తో కాక , శ్రీమతి జషోదా బెన్ గారి గురించి తెలుసుకున్నాక , ఆమె మిద కలిగిన పూజ్య బావంతో పెడుతున్న టపా !దీనిని రాజకీయ కోణంలో కాక బారతీయ కుటుంబ స్త్రీల గౌరవ మర్యాదలు కాపాడే కోణంలో చూడాలని మనవి. వారి గౌరవ మర్యాదలుకు భంగం కలిగించే అంశాలు ఎ రూపంలో ఉన్నా వాటిని ఖండించా ల్సిందే నా అభి ప్రాయమ్.
 

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )