సిమాంద్ర ప్రజలు నిజంగా సమైక్యత కోరుకుoటున్నారా? అయితే ఇలా చేయగలరా?

                                                                     

ది గ్రేట్ కాంగ్రెస్ పార్టి అప్ ఇండియా వారు , తెలంగాణా రాష్ట్రాన్ని విభజించడం ఖాయం అని ప్రకటించినప్పుడు , సుమారు 70 రోజుల పాటు సిమాంద్ర ఉద్యోగులు  రెచ్చిపోయి ఉద్యమాలు చేస్తే , అక్కడి ప్రజలు కూడా వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రోడ్లమిదకు వచ్చి పోరాటాలు చేసారు . అది చూసిన సిమాంద్ర రాజకీయ నాయకులు ప్రపంచంలో ఇంతకూ ముందు ఎప్పుడ్డూ ఇలాంటి ప్రజా ఉద్యమం రాలేదు అని కితాబులిస్తూ , ప్రజా మనోబావనలను జాతి మొత్తానికి తెలిసేలా ఎవరి ప్రయత్నాలు వారు చేసారు . అప్కోర్స్ తెలంగాణా రాజకీయ నాయకులు మాత్రం సదరు ఉద్యమాలు  అన్ని స్పాన్సర్డ్ ఉద్యమాలు అని చప్పరించి పారేశారు . కాని రాష్ట్ర విభజన జరిగాక , ఎవరూ దాని గురించి మాట్లాడకుండా, ప్రజలు  ఎవరి పని వారు చేసుకుంటూ , ఉద్యోగులు వారి వారి ద్యూటిలు చేసుకుంటూ , రాజకీయ నాయకులు వారి వారి పార్టి ల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఎవరి పనిలో వారు యమ బిజీ అయిపోయారు . ఇదంతా చూస్తుంటే ఆంధ్రులు ఆరంభ శూరులు అనే దానికి కట్టుబడి పని చేస్తున్నట్లు తెలుస్తుంది .

  కాని సిమాంద్ర నాయకులలో ఒకే ఒక్కడు ఇంకా సమైక్యా  ఆంద్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు . అతనే మాజీ ముక్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు . కాని వెలువడుతున్న సర్వ్ ల ప్రకారం అయన గారికి ప్రజల మద్దతు తక్కువే అని తెలుస్తుంది . మరి నిజంగా సిమాంద్ర ప్రజలు సమైక్యతా కోరుతున్నవారు అయితే  కిరణ్ గారి పార్టి సమైక్య గాలికి ఊగి పోవాలి . కాని అలా లేదు . కాబట్టి సిమాంద్ర ప్రజలలో సమైక్యతా అనేది నేతి బీరకాయలో నేయి లాంటిది అని అనుకోవచ్చా ! ఎన్నికలకు ముందు కిరణ్ కు జై అన్న సహచరులే , ఎన్నికలలో సీట్లు కోసం రాష్ట్ర విభజనకు O.K అన్న పార్తిలోనే చేరి పోయి "జై సింగపూర్ సిమాంద్ర " అనే కొత్త రాగం ఎత్తుకున్నారు . కాబట్టి దిని వలన అర్దమయ్యేది ఒకటే రాజకీయ నాయకులు కు అతీతంగా సామాన్య ప్రజలు లేరు అని.

     ఒక వేళా   సిమాంద్ర ప్రజలు ఇంకా సమైక్యతా కోరుకుంటుంటే ,రాష్ట్ర విభజన విషయంలో సోనియా గాంది గాంగ్ వారికి అన్యాయం చేస్తూ, తెలంగాణా ప్రకటించిందని దృడంగా నమ్ముతుంటే , కాంగ్రెస్ పార్టి తో సహా అన్ని పార్టీల రాజకీయ నాయకులు తమను నమ్మించి గొంతు కోసారనీ బావిస్తుంటే , ఈ విషయంలో తమ నిరసనను ప్రపంచ వ్యాప్తంగా తెలియ చేయాలి అంటే , ఒకటే మార్గం !. నోటా మీటను నొక్కి చూడండి . సిమాంద్ర లో మెజార్టి ప్రజలు "నోటా " కు ఓటేస్తే , ఖచ్చితంగా అది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది . అంతర్జాతీయ మీడియా దానికి తగిన ప్రచారం కల్పిస్తాయి . మన దేశ అత్యున్నత న్యాయస్తానం కూడా దిని గురించి ఆలోచించే అవకాసం ఉంటుంది . అలా సిమాన్డ్రుల కోరిక తిరనూ వచ్చూ . కాని సిమాంద్ర ప్రజలు అలా ఒక్క మాట మిద నిలబడి , రాజకీయ నాయకుల ముఖం మిద చెప్పు తీసుకు కొట్టినట్లు చేసి తమ సత్తాను చాట గలరా?  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!