కోటి ఆరోపణలు చేసినా ,ఒక్క కామెంట్ తో ఖతం !.

                                                             
           
నిన్న ఒక విషయం మిద రాష్ట్రంలోని ఒక్క చానల్ తప్పా , మిగతా  చానళ్ళు అన్నిస్క్రోలింగ్ లుతో సహా   ప్రసారాలు చేసాయి . ఆ విషయం అవినీతి పరులైనా కాంగ్రెస్ పెద్దలలో ఒకాయనకు సంబందించింది .ఆయనగారు గతంలో తన మిత్రుడు ముక్యమంత్రిగా అధికారంలో ఉండగా , అ   పదవిని అడ్డం పెట్టుకుని , అయన మరియు సదరు ముఖ్య మంత్రి గారికి దగ్గరి బండువుతో కలసి విదేశి కంపెనీలకు ఆంద్ర ప్రదేశ్ తిర ప్రాంతంలోని ఇసుక లిజ్ లు ఇప్పించే పూచి మిద సుమారు 110 కోట్ల పైన ముడుపులు డిమాండ్ చేయడం జరిగిందని , అమెరికా కోర్టులో కొంతమంది మిద అభియోగం మోపారట . అ దేశం లో ఆ కేసును సీరియస్ గా తీసుకుని నిందితుల ఆస్తుల జప్తులకు కూడా సిపార్సు చేసారట! అదిగో అటువంటి అభియోగాల చిట్టాలో మన రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి గారి స్నేహితుడు గారిది కూడా ఉందట .

  అయినా రాష్ట్రాల సరిహద్దులు సైతం చెరిపేసి , కొండలు తవ్విపోసి , ఖనిజ సంపదను కొల్లగొట్టిన వారినే "అప్త్రాల్ అది కూడా పెద్ద అవినితేనా " అని చప్పరించే అంత గొప్ప మనసున్న ప్రజలు ఉన్న రాష్ట్రంలో బోడి ఒక 100 కోట్ల రూపాయల అవినీతి గురించి యాగి చేయద్దమేమిటి! నాన్సెన్స్ కాకపొతే!  అయినా ముఖ్యమంత్రి స్తాయిలో ఉన్న వ్యక్తులు , వారి సన్నిహితులు ముడుపులు తీసుకోకుండా వుంటే వారు తమ స్టేటస్ ని నిలుపుకునేదేలా ? కనీసం ఓటుకు వేయి రూపాయలు ఇవ్వనిదే ఓట్లు వెయ్యని ప్రజలు ఉన్న సమాజంలో మడి  గట్టుకు కూర్చుంటే , తరవాతి ఎన్నికలకు తట్టా బుట్టా సర్డుకోవలసిందే !పదవిలో ఉన్నపుడు పైసల్ కూడ పెట్టడం తెలియని వాడు , ప్రజల దృష్టిలో సమర్దుడైన నాయకుడే కాదు . నలుగురిని కొట్టాలా , పదిమంది మందికి పెట్టాలా ! ఈ కళ లో ఆరితేరిన వాడే  అధికారానికి అర్హుడు!

   ఈ మాత్రం దానికే ప్రత్యర్దులు పని గట్టుకుని ప్రచారాలు చేసినంత మాత్రానా ప్రజల మనసులో సదరు నాయకుల మిద ఉన్న అభిమాన్నాన్ని ఇసుమంత అయినా తగ్గించాగలరా ? అసలు భూ ప్రేపంచకం మిద ముడుపులు తీసుకోని వాడెవ్వడూ ? అయన తీసుకున్నా, ప్రజలకు అన్ని ఉచిత సదుపాయాలూ కల్పించాడు . అయన వలన పోరగాల్లు  పెద్ద పెద్ద చదువులు ఉచితంగా చదివిన్రు . రోగం వస్తే పోన్ చేస్తే చాలు "కుయి కుయి అని అంబులెన్సులు వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసేవి . మరి అయన లేక పోయినా అయన వారసులు అయన ప్రారంబించిన పనులను కొనసాగించడానికి రెడి గా ఉన్నారు అంటే , కారణం ఏమిటి? అయన గారి ముందు చూపు . పార్టీలు పెట్టి , ఎన్నికల్లో నిలబడ్డప్పుడూ అంతో ఇంతో ప్రజలకు ఇవ్వాలి కాని , పార్టి పండ్ అంటూ తిరిగి ప్రజలని అడుకుంటారా ? అ మాత్రం లేనోళ్ళు పార్టీలు పెట్టడం ఎందుకు? అదే ఆయన్ని చూడండి ఎవరికీ ఏది కావాలంటే అది ఇచ్చేసే దానకర్ణుడు ! అందుకే అయన కావాలి !ఆయనే రావాలి! "ఆయనోస్తున్నాడు ". ఆయనోస్తున్నాడు .

    పైన తెల్పిన అభిప్రాయాలు సిమాoద్ర లో చాలా మంది ప్రజలు కలిగి ఉన్నారట . తెలంగాణలో కూడా ఉండవచ్చు . మరి ఎంత గొప్ప అవినీతిని అయినా  అప్త్రాల్ అనుకునే ప్రజలు ఉన్న సమాజంలో అయన మిద కోటి ఆరోపణలు చేసినా ఒక్క కామెంట్ తో ఖతం కాక మరేమిటి? ఆ ఒక డైలాగ్ ఏమిటంటే "ఆ.. తిననోడు ఎవడబ్బా ఈ రోజుల్లో "! తినడం అనేది తప్పు అయినప్పుడు కొద్దిగా తిన్నా , మరింత తిన్నా తప్పు తప్పే కదా! మరి అందరూ తప్పు చేస్తూ , అందులో ఆరితేరిన వాడిమీద పది ఏడవడం ఎందుకు? ఎవరికీ చేతనైనంత వారు తిoటారు.  . దట్సాల్!

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!