పని లేని లాయర్ , పట్టాభి రాముడి మీద కేసు వేసాడంట !!!

                                                                           
                                                    
   
                            
                             హేతు వాది , హేతు వాది ఎందాక నీ శోధన  అంటె, "నన్ను మా అమ్మ మా నాన్నకే కన్నదో! లేదో , తెలుసుకునే దాక"  అన్నాడట. అలా ఉంది భారత దేశం లో హేతు వాదులు అనబడే కోంతమంది వ్యవహారం. ఈ  సోకాల్డ్  హేతు వాదులు ఎవ్వరూ అన్యమతాలను, వారి పవిత్ర గ్రందాలను , అందులోని అంశాలు గురించి   ఒక్క మాట  మాట్లాడానికి దైర్యం చేయలేరు.  . ఎందుకంటె వాటి గురించి మాట్లాడితే వారి పురీష నాళాలు పగిలిపోతాయేమోననే భయం. కాని అదే హిందూ మతం పై  కాని , హిందూ గ్రందాలు పై  కాని , హిందూ దేవుళ్ళు పై  కాని కు విమర్శలు చేసే టప్పుడు   ఏ మాత్రం సంకోచం లేకుండా అవాకులు చవాకులు పేలుతూ , హిందూ సాంప్రదాయాల మీద తమకున్న అక్కసు నంతా వెల్లగ్రక్కుతుంటారు. మెజార్తీ ప్రజలు కొలిచే  ఆరాద్య దైవాలను నీచంగా విమర్శిస్తూ  పైసలు తో పాటు పాపులార్టి సంపాదించే కుహనా మేదావులు బహుశా భారతం లో తప్పా , మరెక్కడా బ్రతికి బట్ట కట్టలేరనుకుంటా. అదిగో అలాంటి కుహనా మేదావుల్లో ఒకరు ఉత్తర బీహర్ లోని సీతామర్హి జిల్లాకు చెందిన ఠాకూర్ చందన్ కుమార్ సింగ్ అనే లాయర్.

                 పనిలేని బార్బర్ పిలిచి తల గొరిగాడు అని సామెత. మరి పైన చెప్పిన సింగ్ గారికి కేసులు ఏమి లేవో , లేక అయన గారికి ఉన్న చట్ట పరిజ్ఞానం గమనించి క్లైంట్ లు ఎవరూ అయన దరికి చేరరో తెలియదు కాని , తనలోని హేతువాది ని  ప్రపంచానికి పరిచయం చేసి  తద్వారా పాపులారిటి సంపాదిస్తే కనీసం హిందూ వ్యతిరేకులు అయినా కేసులు ఇస్తారని ఆశించినట్టుంది. అందుకే ఏకంగా హిందువులు ఆరాద్య దైవంగా కొలుస్తున్న శ్రీ రాములు వారి మీదే కేసు వేసాడంట . ఏమనో తెలుసా? తన ధర్మపత్ని అయిన సీతమ్మ వారిని , ఆమె దోషం ఏమి లేక పోయినా ఆమెను వనవాసానికి పంపడం నేరం అని , ఇది క్రుయల్టి క్రిందకు వస్తుందని కంప్లైంట్  లో రాసాడట. అంతే కాదు, సీతమ్మ వారు    అగ్నిప్రవేశం ద్వారా తన స్వచ్చతను నిరూపించుకున్న , ఆమెను  అడవులకు పంపి క్రూర మృగాల మద్య నివసించమని ఆదేసించడం నేర పూరిత చర్య క్రిందకు వస్తుందని కూడా రాశాడు అంట. 

                         ఈ  విషయం లో శ్రీ రాములు వారే కాక , తమ్ముడు లక్ష్మణుడు కూదా ఇందులో బాగస్వామి కాబట్టి ఇద్దరి మీద అబ్డక్షన్  కేసు సెక్షన్ 367 మరియు ఇంకాకొన్ని సెక్షన్ లతో రెడ్ విత్ 34 వర్తిస్తుందని కంప్లైంట్ ఒకటి, సీతామర్హి చీప్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో వేసాడు . దానితో కాసేపు మతి పోయినంత పని అయింది అంట మేజిస్ట్రేట్ గారికి . అసలు ఆ పెటిషన్  గురించి ఏమి చెపుతాడో విందామని మొన్న శుక్రవారానికి పోస్టింగ్ వేస్తే , అది పేపర్లో , మీడియాలో పబ్లిష్ అయి సింగ్ గారికి  పిచ్చ పబ్లిసిటి బదులు "పిచ్చి లాయర్ " అన్న పబ్లిసిటి వచ్చింది. మొన్న శుక్రవారం ఆ కేసును క్షుణంగా పరిసిలించిన మేజిస్ట్రేట్ గారు , సింగ్ గారిని చేడా  మాడా తిట్టి కంప్లైంట్  ను తిరస్కరించారు  అంట . ఇక సింగ్  గారు పై కోర్టుకు వెళ్లి అక్కడ కూడా అక్షింతలు వేయించుకుంటారేమొ చూద్దాం. 


   కంప్లైంట్ విషయానికి వస్తే, తనలోని హేతు వాద అతి తెలివిని  ప్రపంచానికి తెలియ చేయాలి అనుకున్న సింగ్ గారికి ,కలియుగం లో చేయబడిన  ఇండియన్ పీనల్ కోడ్ , త్రేతాయుగం నాటి వ్యక్తులకు వర్తించేయాలని కోరడం మందమతి తనం అని తెలియదా? 

    ఒక వేళ రాములు వారిని సాదారణ మానవుడిగా బావించినా , ఎప్పుడొ వేల యేండ్లు నాడు , అప్పటి యుగ ధర్మం  ప్రకారం చరించిన వారిని , ఇప్పటి చట్టాల ప్రకారం శిక్షింప చేయ మని కోరడం , ఎంత బుద్ది  తక్కువ తనం. ఇలాంటి  న్యాయ పరిజ్ఞానం ఉన్న సింగ్ గారికి కేసులు ఏమి లేకపోవడం విచిత్రం ఏమి కాదు. మరి ఇలా కేసులు లేకపోవడం తో పిచ్చి ఎక్కి, ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు వేస్తున్నట్లు ఉంది. ఇలాంటి వారి పిచ్చి కుదర్చాలి అంటె ఇండియన్ చట్టాలు కంటె ,  ISIS  చట్టాలే  కరెక్టు. పబ్లిక్ మెడ కోసి ,పిచ్చి కుదిర్చే వారు. 

                  అంతగా సింగ్ గారికి వెనుకటి  తరాలు, వారి  సాంప్రదాయాలు మీద కోపం ఉంటె , తన ఇంట్లో లేక బందువులలో పండి పోయిన తాతలమీద కేసులు పెడితే సరి . వారు తన నాయనమ్మలను , అమ్మమ్మలను రోజూ ఎలా హింసించే వారో , ఎలా పురుషాధిక్యత చూపిస్తూ రాచి రంపాన పెట్టారో , తెలుసుకుని , తాతలు మీద క్రిమినల్ కేసులు పెడితే , తమ వంశం లో ఇంత మేదావి అయిన లాయర్ పుట్టినందుకు మురిసిపోయి , తనువులు చాలించే వారు తాతలంతా. 

                ఏది ఏమైనా సింగ్ గారి అతి హేతువాదం వలన మనకు ఇంకొక సామెత దొరికింది. అదేమిటంటే " పని లేని లాయర్ , పట్టాభి రాముడి మీద కేసు వేసాడంట" .   అందుకు సింగ్ గారికి ధాంక్స్ చెప్పాల్సిందే !!!. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!