రాముడంటే "రామ్ జెటల్మాని " గారికి ఎందు కంత ఒళ్ళు మంటో ఇప్పుడర్దం అయింది !!?
ఆ మధ్య వెటరన్ లాయర్ గారైన రామ్ జెటల్మాని గారు ఒక సభలో ప్రసంగిస్తూ ,రాముడు సీతకు సరి అయిన జోడి కాదని వాగి ,అందరి చేత విమర్శలు పొందాడు . దాని మీద ఇదే బ్లాగులో "కేవలం "అవినీతి" తరపున వకాల్తా పుచ్చుకునే మీకు," రామ నీతి" ఎలా తెలుస్తుంది రాంజెటల్మాని గారూ!" అనే టపా కూడా పెట్టడం జరిగింది . అన్ని ఏండ్లు వచ్చిన ఆ పెద్దాయనకు 'రాముడు ' అంటే ఎందుకు సరి పడదో అప్పట్లో నాకు అర్ధం కాలేదు .కాని మొన్న అంటే ఈ నెల 16 వ తారీకున ఒక వెటరన్ హిందీ నటి మణిని ,రామ్ జెటల్ మాని గారు ముద్దు పెట్టుకున్న తీరు చూసాక 'ఓహో ఈ ముసలాడి అసలు బుద్ది ఇదా ' అనిపించింది . వివరాలు లోకి వెళితే
మన దేశం లో అత్యదిక పీజులు తీసుకుని కేసుల ను వాదించే లాయర్లలో రామ్ జెటల్మాని గారు ప్రముఖులు . వారు ప్రాశ్చ్యాత నాగరికత వ్యామోహ పరులు . అందమైన ఆడవాళ్ళు అనుమతిస్తే ,పబ్లిక్ గా వారిని 'ఇంగ్లీష్ కిస్ ' పెట్టుకునే దాక ఈ ముసలోడికి అస్సలు ఆగి చావదు అనుకుంటా . అందుకే భారతీయ సాంప్రాదాయం అన్నా, దానిని పాటించే వారన్నా ,ఈ బడా లాయర్ కి అస్సలు గిట్టదు . అందుకే భారతీయ భర్తలకు మోడల్ పురుషుడు ,అన్య స్త్రీలను తల్లి లాగా బావించే శ్రీ రామ చంద్రుడు అంటే అతనికి తగని ఒళ్ళు మంట కాబోలు . "మగాడు అంటే, పరాయి ఆడది కన పడగానే, నోట్లో నోరు పెట్టి అదరామృతం గ్రోలాలి కాని ,రాముడిలా తల్లి ,చెల్లి అనటమేమిటి ? నాన్సెన్స్"అని ఈ ముసలాయన అభిమతం . అందుకే రాముడు మీద అవాకులు చవాకులు పేలటం .
అలాంటి మహా వృద్ద (91 సంవత్సరాలు ) లాయర్ ,మొన్న ముంబాయిలో "హమ్ లోగ్ అవార్డ్స్ " అవార్డ్స్ పంక్షన్ కి వెళ్లాడు . అక్కడా స్వర్గీయ కిశోర్ కుమార్ గారి సతి మణి ,మాజీ నటిమణి శ్రీ మతి లీనా చందా వర్కర్ కన పడగానే ఈ ముసలాయన నోట్లో నీళ్ళు ఊ రినాయట. వెంటనె ఆమె దగ్గరకు వెళ్లి ,ఆమెను దగ్గరకు తీసుకుని ,అందరు చూస్తుండగానే ఆమె నోట్లో నోరు పెట్టి ,తన ముసలి ఎంగిలి అంతా అమెలోకి ట్రాన్స్ పోర్ట్ చేసాడట . పాపం ఆమె ఇంటికి వెళ్లి స్టమక్ వాష్ చేసుకుని ఉంటుంది . పబ్లిక్ గా పరాయి ఆడదాని అదరామృతం కోసం అల్లాడి పోయిన ఆ వృద్ద లాయర్ ని చూసి అక్కడ ఉన్న వారంతా స్టన్ అయి పోయారట . అదీ అయన తీరు .
ఇప్పుడు తెలిసిందా ? మానవతులైన స్త్రిలన్నా , పరాయి స్త్రీలను కన్నెతి చూడని పురుషులు అన్నా రామ్ జెటల్మాని గారికి ఎందుకంత ఒళ్ళు మంటొ !!!
(20/2/2015 Post Republished).
(20/2/2015 Post Republished).
Comments
Post a Comment