సుఖ సంతోషాలతో జీవిస్తున్న వారిలో " హిందువులు " ది నంబర్ 1 ర్యాంక్ అయితే , "మతహీనులు" ది లాస్ట్ ర్యాంక్ అట!!!

                                                                       

                               
                           మాకు దేవుడు లేడు , మతం లేదు అని విర్రవీగే "మతహీనులకు "  ఇది  ముఖం మీద నీళ్ళు కొట్టి నిద్ర లేపే సర్వే  వివరాలు ! ఈ  సర్వే చేసింది హిందూ సంస్తలూ కాదు , ఇండియాకి చెందిన సంస్తలు అంతకంటె కాదు. 'యునైటెడ్ కింగ్ డం ' లోని  Office for National Statistics వారు   3 యేండ్లకు పైగా , సుమారు 3 లక్షల మందిని విచారించి , విశ్లేషణ జరిపిన మీదట    వెలువరించిన  వాస్తవాలు. మరి ఇది చూసాక అయినా  ప్రజలు మతాలను , వాటి ఆచారాలను ఆచరిస్తూ సంతోషంగా ఉంటుండబట్టె శతాబ్దాలుగా అవి ఉనికిలో ఉంటున్నాయి అని "మత హీనులు" గ్రహిస్తే అదే మేలు. ఇక వివరాలు లోకి వెలితే ,

       యునైటెడ్ కింగ్డమ్ లో నివసించే ప్రజల సంతోష కర జీవనం పైన ఒక సర్వే నిర్వహించారు  జాతీయ గణాంక శాఖ కార్యాలయం వారు. వారు 3 లక్షలు పైగా  ప్రజలను 2012 సంవత్సరం నుండి 2015 సంవత్సరం వరకు విచారించారు . సదరు పలితాలను విశ్లేషణ చేయగా వెలువడిన వివరాలు ఏమిటంటె ,

      సగటు పొరుడి యొక్క జాతీయ సగటు సంతోషం రేటు 10 కి 7.38 ఉండగా , అది హిందూ మతం ఆచరించే వారిలో అత్యదికంగా అంటే 7.57 రేటింగ్ ఉందంట . వారి తర్వాత క్రిస్టియన్ లు 7. 47, సిక్కులు 7. 45 , బౌద్ధులు 7. 41 గా ఉందట. వీరంతా జాతీయ సగటు కంటె ఎక్కువ సంతోష రేటునే స్కోర్ చేసారు. ఇక జాతీయ సగటు కంటె తక్కువ రేటింగ్ స్కోర్ చేసిన వారు ఎవరంటే 

                             యూదులు 7. 37, ముస్లిం లు 7. 33, ఇతర మతాలను పాటించే వారు 7.26 కాగా ఇక అందరిలో అత్యంత తక్కువుగా సంతోషకరం రేటింగ్ ను స్కోరింగ్ చేసిన వారు అంటె ఏ మతమూ లేని "మత హీనులు". కాబట్టి ఏతావాతా ఐ ఇంగ్లీష్ వారి సర్వే లెక్కలు వలన తేలింది ఏమిటంటె దేవుడు లేడు , మనిషే సర్వసం  అని  అనుకునే వారు కంటే దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారే అత్యంత సుఖ  సంతోషాలతో జీవిస్ద్తున్నారు. మనిషిని సుఖ సంతోషాలను ప్రసాదిస్తున్న దైవబావన మనిషికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా ? చెప్పండి మతం వద్దనే కుహనా తాత్విక మేదావులారా!

   ఇక ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ముక్య విషయం ఉంది. మతాలలో కూడా సంతోషం రేటింగ్ లో కొంత వైరుద్యం ఉంది. అందరిలో హిందువులు మొదటి ర్యాంక్ స్కోర్ చేస్తే , ముస్లిం లు లాస్ట్ ర్యాంక్ లో ఉన్నారు . ఎందుకో తెలుసా? అందుకు కారణం విగ్రహారాధనె కారణం కావచ్చు. విగ్రఃరాధన చేసే ఆచారం ఉన్న హిందు , క్రిస్టియన్ , బుద్ద , జైనులు ఉన్నంత సంతోషకరం గా విగ్రఃఅరాదన లేని ముస్లిం లు లేరు. విగ్రహారాదన మనిషికి ఇచ్చినంత ఆద్యాత్మిక ఆనందం , నిరీశ్వర వాదం ఇవ్వదు. దీని గురించి వివరించాలంటే ఒక గ్రందం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికి , వివిధ మతాలలో అనందం రేటింగ్ లో ఉన్న వైరుద్యాలకు వారు అనుసరిస్తున్న ఆచారాలే కారణమని బావిస్తే సరిపోతుంది. 

 ఏది ఏమైనా ఒకటి మాత్రం స్పష్టం .దైవ బావన లేనివారి కంటె దైవ బావన ఉన్నవారే అత్యంత సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు .అందుకే మతహీనులు చెప్పే"మతం వద్దు , గితం లేదు " అనే  మతిలేని మాటలు విని బుర్రలు పాడుచేసుకోవాలసిన అవసరం ప్రజలకు లేదు. 

SOURCE :http://www.huffingtonpost.co.uk/2016/02/02/office-for-national-statistics-well-being-data_n_9138076.html

                                                      (7/2/2016 Post Republished).

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!