విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.
నాగరిక సమాజాలు పెండ్లి చేసుకునే యువతి యువకులు వయసు ఇంత ఉండాలి అని నిర్దేశించినప్పటికీ , ప్రక్రుతి పరంగా చూసినప్పుడు అంత కంటే ముందే అంటే 12 యేండ్ల నుంచే మోహ భావనలు కలుగుతుంటాయి . మామిడి తోట పెంచే తెలివి గల రైతు, 3 యేండ్లకే కాపుకు వచ్చే తొలి కాపును ఎలా నిర్దాక్షిన్యంగా తొలగించి వేస్తాడో , అలాగే టీనేజ్ లో కలిగే మోహపు పొంగులను గమనించి ఇంట్లో పెద్దలు జాగ్రత్తపడక పొతే ఆడపిల్లలకు జరిగే నష్టం ఎవరూ పూడ్చలేనిది అని ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించిన వాస్తవ సంఘటనల సమాచారం వలన తెలుసుకోవచ్చు.
యువతి యువకులు పెండ్లిచేసుకోవడానికి విదేశాల్లో "డేటింగ్ పద్దతి " అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం అయితే పెండ్లి చేసుకుందాం అనుకునే వారు ముందు కొంత కాలం , ఒకరి నొకరు , అన్ని రకాలుగా బాగా అర్ధం చేసుకోవడానికి కలసి తిరుగుతారు అట. అలా తిరిగాకా అన్ని సర్ర్రిగాన్నే ఉన్నాయి అని సంతృప్తి చెందాక పెండ్లి చేసుకుని , సంసారం జీవనం మొదలు పెడతారు అట. ఇటీవల సినిమా హీరో నాగార్జున గారబ్బాయి , అయన గరఁప్రెండ్ ఇలాగే కొన్ని యేండ్లు డేటింగ్ చేసి , ఇక చాలు పెండ్లి చేసుకుందాం అనుకుని ,శుభలేఖలు వేసి , బంధువులను పెండ్లికి రమ్మని ఆహ్వానించాక , చివరకు ఎక్కడో కుదరక "పెండ్లి కాన్సిల్ అయింది, మీ ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకోండి "అని బంధుమిత్రులకు క్యాన్సిల్ కబురు కూల్ గా చెప్పారు అట. ఎన్నో యేండ్లు డేటింగ్ చేసాక పెండ్లి చేసుకుంటే ఏం ? చేసుకోకపోతే ఏం ? పెండ్లి అయినట్టే లెక్క కదా !అని ఎవరైనా అనుకుంటే అది వారిలోని "అమాయకత్వానికి " కి గుర్తు అనేది మోడ్రన్ మై చాయిస్ వాదం . వారి అభిప్రాయం ప్రకారం పెండ్లి అంటే కన్యాదానమో , బ్రహ్మచర్యo త్యజించడమో కాదు , నూటికి నూరు పాళ్ళు లైంగిక స్వేచ్చా దానం. అందుకే 5 యేండ్లు , 10 యేండ్లు డైటింగ్ చేసినా , తమ లైంగిక స్వేచ్ఛకు భంగం కలుగదు కనుక పెండ్లి కానట్లే లెఖ్ఖ. అయితే ఆత్కూర్ కాకుంటే ఘనాత్కూర్ అనేదే డేటింగ్ తత్త్వం.
ఇక పొతే ఈ డేటింగ్ విధానం అనేది మన సమాజం లోని కొంత మంది కుర్రకారుకి యమా కిక్కిచ్చే వ్యవహారంగా ఉంది. ఇక్కడ డేటింగ్ ని పెద్దలు ఒప్పుకోరు కాబట్టి , దానినే ఇంకొక రకంగా అమలు చేస్తున్నారు . ఇది లేచిపోవడం రూపంలోనో ". లేక " రహస్య ప్రేమ " రూపం లోనో ఉంటుంది . ఈ బాపతు లో ఎక్కువుగా 13 నుంచి 16 యేండ్ల వారే ఉంటున్నారట. అలా లేచిపోయి ఇష్టం వచ్చినట్లు కొంతకాలం అక్కడక్కడా గడిపాక , అబ్బాయికి తన ఇల్లు గుర్తు వచ్చి , అమ్మాయిని వదిలి లి వెళ్లి పొతే , అమ్మాయికేమో గుల్ల అయిపోయిన ఇంటిపరువు తో పాటు తన జీవితం గుర్తుకు వచ్చి బావురు మనటం జరుగుతుంది. ఒక వేళా ఉన్న చోటే రహస్య ప్రేమ నెరపిన తీరా గర్భం దాలిస్తేనో , పెద్దలకు తెలిస్తేనే , కుర్రాళ్ళు మాయమయిపోతుంటారు. వేయి చెప్పినా ., లక్ష చెప్పినా ఈ దేశం లో "లేచిపోవడం " లేక రహస్య ప్రేమలు అనే డేటింగ్ సంస్కృతి వలన నూటికి 99% స్త్రీలు అన్యాయానికి గురిఅవుతున్నారు తప్పా , వారు కోరుకున్న పురుషులకు మాత్రం భార్యలు కాలేకపోతున్నారు అనేది సత్యం.
కాబట్టి ఈ దేశం లో మై చాయిస్ అనే విశృంఖల స్వేచ్చా వాదం లో భాగమైన డేటింగ్ సంస్కృతి , సినిమా తారలకు , పెద్ద పెద్ద సెలబ్రిటీలకు, పబ్లిసిటీ కోసం ప్రాకులాడే వారికి ,ఉపయోగపడుతుంది . ఎందుకంటే వారికి పెండ్లి అయిదంటే గ్లామర్ తగ్గుతుంది కానీ , ఎంతమందితో డేటింగ్ చేసినా గ్లామర్ తగ్గదు సరికదా ఇంకా వారి పట్ల క్రేజ్ పెరుగుతుంది , దాని వలన వారికి అవకాశాలు పెరిగి ఆదాయం బాగుంటుంది . కాబట్టి డేటింగ్ సంస్కృతీ వారికి లాయకీ కావచ్చు కానీ ,చక్కగా వివాహం చేసుకుని , సంసార బాధ్యతలు నిర్వహిస్తూ , అటు కుటుంబానికి తద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడదాం అనుకునే ఈ దేశం లోని కామన్ మాన్ /ఉమెన్ మాత్రం పనికి రానిదే .
Comments
Post a Comment